Hyderabad: సీక్రెట్ కోడ్ తో ‘హైటెక్ వ్యభిచారం’
వ్యభిచార నిర్వాహకులు ఓటీపీ విధానాన్ని ఫాలో అవుతూ హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
- By Balu J Published Date - 03:07 PM, Thu - 21 April 22
బ్యాంకింగ్ లావాదేవీలు, నగదు బదిలీ, మొబైల్ రీచార్జ్ చేసే సమయంలో ‘ఓటీపీ’ తప్పనిసరి. కానీ వ్యభిచార నిర్వాహకులు కూడా ఓటీపీ విధానాన్ని ఫాలో అవుతూ హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పోలీసుల బారి నుంచి తప్పించుకోవడానికే బ్రోకర్లు ఇలా వ్యవహరిస్తున్నారని ఉన్నతాధికారులు చెప్తుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే, సీక్రెట్ కోడ్‌ను షేర్ చేసిన తర్వాత మాత్రమే సెక్స్ వర్కర్లను కలవడానికి కస్టమర్లను అనుమతిస్తున్నారు. 10 రోజుల క్రితం సిటీ పోలీసులు ఓ సెక్స్ రాకెట్‌ను ఛేదించారు. నార్సింగిలో సెక్స్ రాకెట్ నిర్వాహకులు పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు టెక్నాలజీ వాడుతున్నట్టు తెలిసింది. పోలీసు సిబ్బంది డికాయ్ ఆపరేషన్ ఉచ్చులో పడకుండా ఉండేందుకు కస్టమర్ ఆథెంటికేషన్ కోసం బ్రోతల్ నిర్వాహకులు రహస్య కోడ్లను ఉపయోగిస్తున్నారు.
విషయం తెలుసుకున్న నార్సింగి పోలీసులు ఒక ఫ్లాట్‌పై దాడి చేశారు. ‘‘అక్కడ నలుగురు ఉగాండా దేశస్తులున్నాయి. అందులో ముగ్గురు సెక్స్ వర్కర్లు, ఒక కస్టమర్ ఉన్నారు. విచారణలో కస్టమర్, బ్రోకర్ ఒకరినొకరు సంప్రదింకుండా కేవలం డేటింగ్ యాప్, రహస్య కోడ్ ద్వారా తమ ఫోన్ నంబర్లను షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత వాట్సాప్‌లో సంభాషణలు జరిగాయి. రాత్రికి రూ. 15,000 చెల్లించడానికి అంగీకరించిన తర్వాత, ప్రత్యేక కోడ్ ద్వారా మహిళను కలుసుకున్నాడు. అయితే నిర్దిష్ట కోడ్ డిస్ప్లే తోనే కస్టమర్ మహిళ గదిలోకి వెళ్లాడు” అని నార్సింగి పోలీసు చెప్పారు. గతంలో కస్టమర్లతో కనెక్ట్ చేయడానికి యాప్‌లను ఉపయోగించే అనేక సెక్స్ రాకెట్లను పోలీసులు ఛేదించారు. వ్యభిచార గృహ నిర్వాహకురాలు, ఉగాండా మహిళ, కస్టమర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి ఇంకా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Related News
Teen Driver : టీనేజీ డ్రైవర్ ఇద్దరిని బలిగొన్న కేసు.. మైనర్ తండ్రి అరెస్ట్
మహారాష్ట్రలోని పూణేలో ఉన్నకళ్యాణి నగర్లో ఓ టీనేజర్ లగ్జరీ పోర్షే కారును ర్యాష్‌గా డ్రైవింగ్ చేసి ఇద్దరి చావుకు కారణమైన ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.