HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >Love And Legacy The Untold Love Story Of Ratan Tata

Ratan Tata Untold Love Story: యుద్ధ స‌మ‌యంలో ర‌త‌న్ టాటా ల‌వ్ స్టోరీ.. పెళ్లి పత్రికలు ముద్రించే దాకా వెళ్లి..!

ర‌త‌న్ టాటా బ్రహ్మచారి. పెళ్లి కాలేదు, పిల్ల‌ల్లేరు. అయితే ఆయన పెళ్లి చేసుకోక‌పోవ‌టానికి గ‌ల కార‌ణాన్ని గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా చెప్పారు. ర‌త‌న్ టాటా చ‌దువుకోవ‌టానికి అమెరికాకు వెళ్లిన‌ప్పుడు ఒకామెను ప్రేమించారు. 1961-62 నాటి ల‌వ్ స్టోరీ ర‌త‌న్ టాటాది.

  • Author : Gopichand Date : 10-10-2024 - 7:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ratan Tata Untold Love Story
Ratan Tata Untold Love Story

Ratan Tata Untold Love Story: ప్ర‌ముఖ దిగ్గ‌జ‌ వ్యాపార‌వేత్త ర‌త‌న్ టాటా బుధ‌వారం రాత్రి తుదిశ్వాస విడిచిన విష‌యం తెలిసిందే. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్ప్ర‌తిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. ర‌త‌న్ టాటా (Ratan Tata Untold Love Story) ది పార్శి కుటుంబం. తల్లిదండ్రులు చిన్నప్పుడే విడిపోతే బామ్మ దత్తత తీసుకుని మరీ పెంచింది. ఓ దిగువ స్థాయి ఉద్యోగంతో తన ప్రయాణం స్టార్ట్ చేశారు ర‌త‌న్ టాటా. ఆ త‌ర్వాత కంపెనీలో క్రమేపీ పలు హోదాలకు ఎదిగి, గ్రూపును ఓ పటిష్టమైన గ్లోబల్ వ్యాపార సంస్థలా మార్చింది ర‌త‌న్ టాటానే. టాటా అంటే కేవలం వ్యాపారమే కాదు.. ఆదాయంలో ఎక్కువగా సామాజికసేవకు, దాతృత్వానికి వెచ్చించే గొప్ప వితరణశీలి.

అంట్లు తోమిన ర‌త‌న్ టాటా

నావల్ టాటా – సోనీ టాటా దంప‌తుల‌కు రతన్‌ టాటా 1937 డిసెంబర్‌ 28న ముంబైలో జన్మించారు. కాంపెయిన్‌ స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన రతన్‌ ఉన్నత విద్య కోసం అమెరికాలోని కార్నెల్‌ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. అక్కడ డ‌బ్బు కోసం చిన్నా చితకా ఉద్యోగాలు చేయాల్సి వచ్చింది. కొంతకాలం అంట్లు కూడా తోమారు రతన్‌. రతన్ టాటా ప్రస్థానం ఓ సాధారణ ఉద్యోగిగానే ప్రారంభమైంది.

Also Read: Ratan Naval Tata : సమాజం కోసమే సంపదను సృష్టించిన ‘టాటా’

ల‌వ్ స్టోరీ కూడా న‌డిపారు

ర‌త‌న్ టాటా బ్రహ్మచారి. పెళ్లి కాలేదు, పిల్ల‌ల్లేరు. అయితే ఆయన పెళ్లి చేసుకోక‌పోవ‌టానికి గ‌ల కార‌ణాన్ని గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా చెప్పారు. ర‌త‌న్ టాటా చ‌దువుకోవ‌టానికి అమెరికాకు వెళ్లిన‌ప్పుడు ఒకామెను ప్రేమించారు. 1961-62 నాటి ల‌వ్ స్టోరీ ర‌త‌న్ టాటాది. పెళ్లి సమయానికి ఇండో-చైనా యుద్ధం. దీంతో యువ‌తి తల్లిదండ్రులు ఆమెను ఇండియాకు పంపించడానికి ఒప్పుకోలేదు. దీంతో ర‌తన్ టాటా కూడా ఏం చేయ‌లేక‌పోయాడు. మరో అమ్మాయితో పెళ్లి నిశ్చయమై, పెళ్లి పత్రికలు ముద్రించే దాకా వెళ్లింది. కానీ అదీ ఆగిపోయింది. అంతే ఇక తను పెళ్లి మాటే ఎత్తలేదు.

సీఎం రేవంత్ సంతాపం

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణం పట్ల సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘ఈరోజు దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది. వారి నిష్క్రమణ పారిశ్రామిక రంగానికే కాకుండా యావత్ దేశానికి తీరనిలోటు. టాటా చారిటబుల్ ట్రస్టు ద్వారా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. టాటా కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’’అని తెలిపారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Breach Candy Hospital
  • business man
  • mumbai
  • national news
  • ratan tata
  • Ratan Tata Love Story
  • Ratan Tata Passed Away
  • Ratan Tata Untold Love Story

Related News

    Latest News

    • ఒక్కసారిగా పెరిగిన బంగారం వెండి .. ధ‌ర‌లు చూసి పసిడి ప్రియులకు షాక్

    • చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం

    • War Effect : భారీగా పెరిగిన పెట్రోల్ ధర ..లీటర్ రూ. 321.17 పైసలు

    • రణవీర్ సింగ్ ధురంధర్ 2 ట్రైలర్‌ వచ్చేసింది..

    • Allu Sirish Wedding : అటు చిరు..ఇటు చరణ్ మధ్యలో పవన్ ! వాటే మెగా మూమెంట్ !!

    Trending News

      • టీ20 ప్రపంచకప్ ఫైనల్.. న్యూజిలాండ్‌పై భార‌త్‌దే పైచేయి?!

      • ఏ కారు కొంటే మంచిది?!

      • ఇరాన్‌కు సాయం చేస్తున్న ర‌ష్యా?!

      • మార్చి 31లోపు ఈ ప‌నులు పూర్తి చేయాల్సిందే!

      • 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్‌ మీడియా నిషేధం: కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd