HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >Journey Of Mohammed Siraj

Journey of Mohammed Siraj: హైదరాబాద్ గల్లీ TO అంతర్జాతీయ క్రికెట్

ఆసియా కప్ 2023 ఫైనల్‌లో ఆరు వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు హైదరాబాదీ కుర్రాడు మహ్మద్ సిరాజ్. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచిన సిరాజ్ ఇన్నింగ్స్ ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గా చరిత్రకెక్కాడు

  • Author : Vamsi Chowdary Korata Date : 18-09-2023 - 12:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Journey Of Mohammed Siraj
Journey Of Mohammed Siraj

Journey of Mohammed Siraj: ఆసియా కప్ 2023 ఫైనల్‌లో ఆరు వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు హైదరాబాదీ కుర్రాడు మహ్మద్ సిరాజ్. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన సిరాజ్ ఇన్నింగ్స్ ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గా చరిత్రకెక్కాడు. హైదరాబాద్ పాతబస్తీలో సాధారణ కుటుంబంలో జన్మించిన మహ్మద్ సిరాజ్ నగరంలోని వీధుల్లో క్రికెట్ ఆడేవాడు.

సిరాజ్ తండ్రి గౌస్ ఆటో డ్రైవర్‌గా పని చేసేవారు. తండ్రికి సాయంగా ఉండేందుకు సిరాజ్ కొన్నాళ్ళు రంగులు వేసే పనికి వెళ్ళాడు. కానీ ఎంచుకున్న క్రికెట్ ని ఏనాడూ వదులుకోవాలని అనుకోలేదు. సిరాజ్ కుటుంబం హైదరాబాద్ మసాబ్ ట్యాంక్ సమీపంలోని ఇరుకైన అద్దె ఇంట్లో ఉండేవారు. శిక్షణ లేని సిరాజ్ 140 వేగంతో బౌలింగ్ వేయడాన్ని గమనించిన కోచ్ అద్నాన్ చేయందించాడు. ఆయన ప్రోత్సాహంతో లీగ్ స్థాయి క్రికెట్ లోకి అడుగుపెట్టి 50 వికెట్లు పడగొట్టి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దృష్టిలో పడ్డాడు. అలా రంజీలు, ఐపీఎల్, ఇప్పుడు టీమిండియాలో చోటు సంపాదించాడు.

ఎక్కడో హైదరాబాద్ విధుల్లో బంతి పట్టిన సిరాజ్ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తున్నాడు. జీవితంలో ఎన్నో బాధలు, కష్టాలు. కానీ అవేం అతని విజయానికి అడ్డుపడలేదు. గెలుపే లక్ష్యంగా సాగిన సిరాజ్ జీవితం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా మలుపు తిరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) అతన్ని ఐపిఎల్ వేలంలో కొనుగోలు చేసింది. దాంతో సిరాజ్ మళ్ళీ వెనుదిరిగి చూడలేదు. ఆ తర్వాత భారత క్రికెట్ జట్టులో స్థానం సంపాదించాడు.

హైదరాబాద్‌ గల్లీలో క్రికెట్ ఆడడం నుండి భారత జట్టు అత్యుత్తమ బౌలర్‌లలో ఒకరిగా మారడం వరకు మహ్మద్ సిరాజ్ చేసిన ప్రయాణం భవిష్యత్తు ఆటగాళ్లకు ఆదర్శం. 2020లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు సిరాజ్ తండ్రి మరణించాడు. ఆ సమయంలో సిరాజ్ టీమ్ ఇండియాతో ఆస్ట్రేలియాలో ఉన్నాడు. తన తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోయాడు. ఇలా జీవితంలో విజయం వరించిన ప్రతిసారి ఎదో ఒక సమస్య వెంటాడుతూనే ఉండేది. సిరాజ్ జీవితాన్ని గమనిస్తే కలలకు హద్దులు ఉండవని గుర్తుచేస్తుంది.

Also Read: Siraj: రూ. 60తో డొక్కు బైక్ పై ప్రాక్టీస్ కు…


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • asia cup 2023
  • Bio
  • Coach Adnan
  • HCA
  • hyderabad
  • IPL
  • journey
  • Life Story
  • Mohammed Siraj
  • Siraj 6 wickets

Related News

Hyderabad Minor Girl instagram Trap Case

డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..

Hyderabad Minor Girl  ప్రేమ పేరుతో 20 మంది మైనర్ బాలికలను మోసగించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఓ కేటుగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ధనవంతుడిగా నటిస్తూ అమ్మాయిల వ్యక్తిగత ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేయడం ఇతని శైలి అని పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్‌కు చెందిన డబ్బున్న బాలిక నుంచి రూ. 13 లక్షలు కాజేయడంతో పాటు మరో యువతిని శారీరక వేధింపులకు గురిచేసినట్లు తేలిం

  • Hyderabad Woman Disappears After Dispute Over Eating Curd

    పెరుగు తినమని చెప్పినందుకు ఇల్లు వదిలి వెళ్లిపోయిన భార్య

  • Dhoni Srh Match

    2026 IPL SRH – CSK Match : రేపటి మ్యాచ్ లో ధోని ఆడుతున్నాడా..?

  • Sanjana

    Actress Sajini : హైదరాబాద్‌లో మలయాళ నటిపై దాడి !!

  • LPL Financial opens first GCC outside US in Hyderabad

    హైదరాబాద్‌లో ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ భారీ పెట్టుబడి.

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd