HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >Iran And Israel Once Former Allies How Was Their Friendship Then

Iran Vs Israel : ఇరాన్, ఇజ్రాయెల్ ఒకప్పటి మిత్రదేశాలు.. వాటి దోస్తీ ఎలా ఉండేదంటే..?

అరబ్‌ ప్రాంతంలో చాలా వరకు సున్నీ ఇస్లామిక్ దేశాలే(Iran Vs Israel) ఉన్నాయి.

  • Author : Pasha Date : 02-10-2024 - 5:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Iran Vs Israel Gaza Lebanon

Iran Vs Israel : మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌పై ఇరాన్ భీకర దాడి చేసింది. దాదాపు 200కుపైగా బాలిస్టిక్ మిస్సైళ్లను ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రయోగించింది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. కానీ ఒకప్పుడు ఈ రెండు దేశాలు చాలా ఫ్రెండ్లీగా ఉండేవి. ఆ వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

Also Read :Railway Tracks : రైల్వే ట్రాక్‌ను పేల్చేసిన దుండగులు

1960 నుంచి 1990 వరకు ఏమైందంటే.. ?

  • 1960వ దశకంలో ఇరాన్‌-ఇజ్రాయెల్‌ దేశాలకు ఒక ఉమ్మడి శత్రువు ఉండేది. అదే ఇరాక్‌.
  • అరబ్‌ ప్రాంతంలో చాలా వరకు సున్నీ ఇస్లామిక్ దేశాలే(Iran Vs Israel) ఉన్నాయి. కానీ ఇరాన్ షియా ఇస్లామిక్ దేశం.
  • సున్నీ దేశాలు ఆనాడు ఇజ్రాయెల్‌కు దూరంగా ఉండేవి. అందుకే ఇరాన్‌కు ఇజ్రాయెల్ చేరువైంది.
  • ఇరాన్‌కు చెందిన సీక్రెట్‌ పోలీస్‌ యూనిట్‌ సావక్‌ (సావక్), ఇజ్రాయెల్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ మోసాద్ కలిసి ఇరాక్‌లోని కుర్దు వేర్పాటువాదులను అప్పట్లో బలోపేతం చేశాయి.
  • అప్పట్లో  ఇరాన్‌-ఇజ్రాయెల్‌తో తుర్కియే కూడా చాలా సన్నిహితంగా ఉండేది.
  • ఆనాడు ఇరాన్, ఇజ్రాయెల్, టర్కీ కలిసి ట్రైడెంట్‌ అనే కోడ్‌నేమ్‌తో ఒక గ్రూపును ఏర్పాటుచేశాయి. వీటి గూఢచార సంస్థలు అప్పట్లో కీలకమైన సైనిక సమాచారాలను ఇచ్చి పుచ్చుకునేవి.
  • 1960వ దశకంలో ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లో  ఇజ్రాయెల్‌ దౌత్యకార్యాలయం ఏర్పాటైంది.
  • 1970వ దశకం చివర్లో ఇరాన్‌ కోసం ఉపరితలంపై నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే అణుక్షిపణులు సిద్ధం చేసే ప్రాజెక్టును ఇజ్రాయెల్‌ చేపట్టింది. ఇందుకోసం అడ్వాన్స్‌గా అప్పటి ఇరాన్ షా ప్రభుత్వం భారీగా చమురును ఇజ్రాయెల్‌కు సప్లై చేసింది. ఇరాన్‌లో ఇస్లామిక్‌ విప్లవం వచ్చే వరకు ఈ ప్రాజెక్టు కొనసాగింది.
  • 1980-88 మధ్య జరిగిన ఇరాన్‌-ఇరాక్‌ యుద్ధం సమయం వరకు కూడా ఇరాన్, ఇజ్రాయెల్ కలిసే ఉండేవి.
  • ఇరాన్‌ వద్ద 1980వ దశకం నాటికే అమెరికా తయారీ ఎఫ్‌-4 ఫాంటమ్‌ ఫైటర్‌ జెట్లు ఉండేవి. ఇస్లామిక్‌ విప్లవం వచ్చిన  తర్వాత ఇరాన్‌కు యుద్ధ విమానాల స్పేర్‌ పార్టులు ఇవ్వడాన్ని అమెరికా ఆపేసింది.  దీంతో అప్పట్లో ఇజ్రాయెల్‌ వీటిని రహస్యంగా ఫ్రాన్స్‌కు, అక్కడినుంచి ఇరాన్‌కు పంపేది.
  • అమెరికాకు చెందిన 51 మంది దౌత్యవేత్తలు ఇరాన్‌లో బందీలుగా ఉన్నా ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాల టైర్లను అప్పట్లో ఇరాన్‌కు పంపింది. ఇరాక్‌ విజయాన్ని ఆపేందుకు ఇజ్రాయెల్ ఆనాడు అలా వ్యవహరించింది.
  • 1990వ దశకం నుంచి ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య సహకారం తగ్గిపోయింది.  వీటి స్నేహం కాస్త శత్రుత్వంగా మారిపోయింది.

Also Read :Isha Foundation : సన్యాసులుగా మారమని మేం ఎవరికీ చెప్పం: ఈశా ఫౌండేషన్‌


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Gaza
  • Iran
  • Iran Vs Israel
  • Israel.
  • Lebanon
  • Tel Aviv

Related News

India Rice Export To Iran

ఇరాన్‌కు బియ్యం ఎగుమతిలో చిక్కులు.. రూ. 2000 కోట్ల సరుకు నిలిపివేత!

సబ్సిడీ ధరల వల్ల సామాన్యులకు పెద్దగా ప్రయోజనం కలగడం లేదని, అక్రమ రవాణా పెరుగుతోందని ఇరాన్ భావిస్తోంది. అందుకే సబ్సిడీ మొత్తాన్ని నేరుగా పౌరుల ఖాతాల్లోకే వేయాలని నిర్ణయించింది.

  • US control over Venezuela.. Trump's strategy as an oil hub

    వెనిజువెలాపై అమెరికా పట్టు .. చమురు కేంద్రంగా ట్రంప్ వ్యూహం

  • Many countries strongly condemned the US action

    అమెరికా చర్యను తీవ్రంగా ఖండించిన పలు దేశాలు

Latest News

  • సినిమా టికెట్ల పెంపుపై హైకోర్టు ఆగ్రహం

  • హిందీ మార్కెట్‌లోకి ఆది సాయికుమార్.. శంబాల హిట్ అవుతుందా?!

  • రోహిత్ శ‌ర్మ‌పై ప్ర‌శంస‌లు కురిపించిన ఐసీసీ చైర్మ‌న్‌!

  • టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి గుడ్ బై..

  • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

Trending News

    • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

    • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

    • మీ మొబైల్ నంబర్ చివర సున్నా ఉందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd