Hyderabad Poor Drainage System: రోడ్లు మోరీలైతున్నయ్.. అస్తవ్యస్తంగా హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థ
మంగళవారం కొద్దిపాటి వర్షానికే జీడిమెట్ల, వీఎస్‌టీ రాంనగర్ జంక్షన్, నల్లకుంట, తార్నాక, మెట్టుగూడ, సికింద్రాబాద్ స్టేషన్ రోడ్డు, శ్రీనగర్ కాలనీ, మల్కాజ్‌గిరి, బాలానగర్, నిజాంపేట్, రెడ్‌హిల్స్, నాంపల్లి సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
- By Praveen Aluthuru Published Date - 03:35 PM, Wed - 21 August 24

Hyderabad Poor Drainage System: నగరంలో వర్షం పడితే ఇక అంతే. రోడ్లన్నీ జలమయం అవుతాయి. రహదారులు నిండుకుండని తలపిస్తాయి. ఆయా ప్రాంతాల్లో చెరువులు ఉప్పొంగిపోతాయి. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇంట్లోకి వచ్చేస్తుంది. డ్రైనేజి నిండి మురుగు నీరు ప్రధాన రహదారులపై దర్శనమిస్తుంది. వర్షాకాలంలో నిత్యం సమస్యగా మారుతుంది. ఈ పరిస్థితి నిన్న మంగళవారం మళ్లీ కనిపించింది, దారులు ముంపునకు గురయ్యాయి. సరస్సులు నిండిపోయాయి. వర్షపు నీటి కాలువలు నాసిరకంగా ఉండడం, నాలాలు పనిచేయకపోవడం ద్వారా ఒక్కసారిగా వర్షపు నీరు బయటకు రావడంతో సమస్య తీవ్రరూపం దాల్చింది.
కొద్దిపాటి వర్షానికే జీడిమెట్ల, వీఎస్‌టీ రాంనగర్ జంక్షన్, నల్లకుంట, తార్నాక, మెట్టుగూడ, సికింద్రాబాద్ స్టేషన్ రోడ్డు, శ్రీనగర్ కాలనీ, మల్కాజ్‌గిరి, బాలానగర్, నిజాంపేట్, రెడ్‌హిల్స్, నాంపల్లి సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రస్తుతం ఉన్న మురికినీటి కాలువలను వెడల్పు చేయడంతోపాటు నిర్వహణ పనులు సకాలంలో చేపట్టకపోవడమే ప్రధాన కారణం. ఈ సమస్యపై సంసిద్ధత లేకపోవడం వల్ల పౌరులు అసౌకర్యానికి గురవుతున్నారు.
నిన్న భారీ వర్షానికి నగరం ఉక్కిరిబిక్కిరి అయింది. తార్నాక దారులన్నీ నీటితో నిండిపోవడంతో స్థానికులు నరకం అనుభవించారు. మురికినీటి కాలువలకు మరమ్మతులు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ జలమండలికి పలుమార్లు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోని వైనం. వర్షం వచ్చిన ప్రతిసారీ ఆ ప్రాంతంలో నీరు నిలిచిపోవడంతో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు ఇళ్లలోకి కూడా నీరు ప్రవహిస్తుంది. పైపులైన్లు పాతవి కావడంతో వాటిని మార్చాల్సిన అవసరం ఉందని నాంపల్లికి చెందిన నివాసితులు వాపోతున్నారు.
ఇంకుడు గుంతలు, డ్రెయిన్లు శుభ్రం చేయాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పరిష్కరించడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలతో పరిస్థితి విషమించడంతో స్థానికులు ఈ మార్గాన్ని ఉపయోగించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలానికి కనీసం మూడు నెలల ముందు డ్రెయిన్లు, మురుగునీటి వ్యవస్థలను ఏటా శుభ్రం చేస్తే బాగుంటుంది అని నిజాంపేటకు చెందిన కాలనీ వాసులు అంటున్నారు. ప్రధాన రహదారులే నేటితో నిండిపోతున్న క్రమంలో కాలనీలో పరిస్థితిని అధికారులు పట్టించుకోకపోవడంతో మరణాలు సంభవిస్తున్నాయి. నగర డ్రైనేజి వ్యవస్థను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
Also Read: CBI : జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: కోర్టును కోరిన సీబీఐ