HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Do Not Give Permission For Jagan Foreign Tour Cbi Has Asked The Court

CBI : జగన్‌ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: కోర్టును కోరిన సీబీఐ

యూకేలో చదువుతున్న తన కుమార్తె వద్దకు వెళ్లడానికి తనకు అవకాశం ఇవ్వాలని జగన్ సీబీఐ కోర్టుకు మనవి..

  • By Latha Suma Published Date - 03:19 PM, Wed - 21 August 24
  • daily-hunt
Do Not Give Permission For
Do not give permission for Jagan foreign tour: CBI has asked the court

CBI Court: బ్రిటన్‌ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ (jagan) సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు వాదానలు జరిగాయి. సీబీఐ తన వాదనలు వినిపిస్తూ జగన్‌ విదేశీ పర్యటనకు అనుమతి నివ్వవద్దని కోర్టును కోరింది. యూకేలో చదువుతున్న తన కుమార్తె వద్దకు వెళ్లడానికి తనకు అవకాశం ఇవ్వాలని జగన్ సీబీఐ కోర్టుకు మనవి చేశారు. సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి. రఘురాం సీబీఐ వివరణ కోరుతూ విచారణ వాయిదా వేశారు. బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ విదేశాలకు వెళ్లడానికి అనుమతి ఇవ్వకూడదని, ఆయన పైన నమోదైన అక్రమాస్తుల కేసు విచారణ ఇంకా పెండింగ్ లో ఉందని, కేసు విచారణ చాలా ఆలస్యం అవుతుందని సీబీఐ కోర్టుకు చెప్పింది. మాజీ సీఎం జగన్ విదేశాలు వెళ్లడానికి అవకాశం ఇవ్వకూడదని సీబీఐ కోర్టుకు మనవి చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

వాదనలు విన్న సీబీఐ కోర్టు ఈనెల 27వ తేదీకి విచారణ వాయిదా వేసింది. ఇప్పటికే అక్రమాస్తుల కేసు విచారణ ఆలస్యం అవుతుందని గతంలో సీఎం హోదాలో ఉన్న జగన్ కేసు విచారణకు హాజరు కాలేదని ఇప్పుడు ఆయన మరోసారి విదేశీ పర్యటనలో ఉంటే కేసు విచారణ ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని సీబీఐకి చెందిన ఓ అధికారి అంటున్నారని తెలిసింది. ఇదే కేసులో నెంబర్ టూగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా విదేశాలకు వెళ్లడానికి ప్రత్యేక కోర్టు అనుమతి కోరారు.

మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తరఫున ఆయన న్యాయవాది అశోక్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. యూరప్ లో వచ్చే నెల 6వ తేదీ తేదీ నుండి రెండు నెలల పాటు పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోర్టుకు మనవి చేశారు. గతంలో కూడా విజయసాయి రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లడానికి కోర్టు అనుమతి ఇచ్చిందని, ఇప్పుడు కూడా అనుమతి ఇవ్వాలని ఆయన న్యాయవాది అశోక్ రెడ్డి కోర్టుకు మనవి చేశారు.

అయితే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇస్తే కోర్టు విచారణ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని, ఇప్పటికే కేసు విచారణ ఆలస్యం అయ్యిందని సీబీఐ అధికారులు ప్రత్యేక కోర్టుకు మనవి చేశారు. విజయసాయి రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వకూడదని సీబీఐ అధికారులు కోర్టుకి మనవి చేశారు. వాదనలు విన్న కోర్టు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విదేశీ పర్యటన పై దాఖలు అయిన పిటిషన్ విచారణ ఈనెల 30వ తేదీకి వాయిదా వేసింది.

Read Also: Gruha Jyothi Scheme : గృహజ్యోతి, రుణమాఫీ స్కీమ్స్ అందని వారికి గుడ్ న్యూస్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CBI court
  • foreign tour
  • Vijayasai reddy
  • ys jagan
  • ysrcp

Related News

Vijayasai Reddy attends CID inquiry

VSR : మళ్లీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విజయసాయి

VSR : తాను రాజకీయాలకు దూరంగా ఉండటానికి గల కారణాన్ని విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ చుట్టూ ఉన్న కోటరీ (సమూహం) ఆయనను డైవర్ట్ చేస్తోందని ఆయన ఆరోపించారు

  • Cbn Jagan

    Krishna River Water : చంద్రబాబుకు గుడ్ న్యూస్ చెప్పిన వైఎస్ జగన్.!

Latest News

  • Dwaraka Tirumala : ద్వారకాతిరుమలలో అంతరాలయ దర్శనానికి టికెట్

  • Orientia Tsutsugamushi : ఏపీ ప్రజలను వణికిస్తున్న ప్రమాదకర పురుగు..ఇది కుడితే అంతే సంగతి !!

  • IND vs SA : మీరు ఉన్నప్పుడే కదా వైట్‌వాష్ ..అశ్విన్‌కు సునీల్ గవాస్కర్ అదిరిపోయే కౌంటర్!

  • Telangana Global summit 2025 : 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా సీఎం మాస్టర్ ప్లాన్

  • Grama Sarpanch Nomination : తొలిరోజు నామినేషన్లు ఎన్నో తెలుసా?

Trending News

    • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

    • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

    • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

    • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd