Biryani ATM: బిర్యానీ ఏటీఎం ఎక్కడైనా చూసారా?
నోరూరించే బిర్యానీని అందించే ఏటీఎంలు ఉన్నాయంటే నమ్మడం లేదు కదా . చెన్నైకి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఈ వినూత్న ఐడీయాతో ముందుకొచ్చింది.
- Author : Maheswara Rao Nadella
Date : 14-03-2023 - 11:46 IST
Published By : Hashtagu Telugu Desk
నోరూరించే బిర్యానీని అందించే ఏటీఎంలు (Biryani ATM) ఉన్నాయంటే నమ్మడం లేదు కదా. చెన్నైకి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఈ వినూత్న ఐడీయాతో ముందుకొచ్చింది. సిటీలోని కొలత్తూర్ లో ఈ బిర్యానీ ఏటీఎంలను ప్రారంభించింది. బాయ్ వీటు కల్యాణం (బీవీకే) బిర్యానీ పాయింట్ దేశంలోనే తొలిసారిగా ఈ ఏటీఎంలను ఏర్పాటు చేసింది.
ఈ బిర్యానీ ఏటీఎంలు (Biryani ATM) ఎలా పనిచేస్తాయో తెలుసా?
సాధారణ ఏటీఎంల లోపల ఎలా ఉంటుందో ఈ బిర్యానీ ఏటీఎం కూడా అలాగే ఉంటుంది. మెషిన్ లోని మెనూలో నుంచి కావాల్సిన బిర్యానీని టచ్ స్క్రీన్ పై ఎంచుకుని, పేరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆపై బిర్యానీ ధరను కార్డు లేదా యూపీఐ స్కానర్ ద్వారా చెల్లించాలి. డబ్బు చెల్లించాక స్క్రీన్ పై కౌంట్ డౌన్ టైమర్ ఆన్ అవుతుంది. వేడి వేడి బిర్యానీ ఇంకెంత సేపట్లో వస్తుందో ఈ టైమర్ ద్వారా తెలుసుకోవచ్చు. నిర్ణీత సమయం పూర్తవగానే ఏటీఎం మెషిన్ కు ఉన్న చిన్న డోర్ ను తెరిచి లోపల ఉన్న బిర్యానీని తీసుకెళ్లిపోవడమే. దీనికి సంబంధించిన వీడియోను బీవీకే బిర్యానీ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇది కాస్తా వైరల్ గా మారి నెటిజన్ల ప్రశంసలు అందుకుంటుంది.
Also Read: Pawan Politics: ఏపీతో పవన్ ఆట, మచిలీపట్నంలో రిహార్సల్స్