HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >Deputy Cm Pawan Kalyan2024

Look Back 2024 : జనసేనాధినేత పవన్ కళ్యాణ్ కు కలిసొచ్చిన 2024

Look Back 2024 : 2019 ఎన్నికలలో కేవలం ఒక్క సీటును గెలుచుకున్న జనసేన, 2024 ఎన్నికల్లో 21 శాసనసభ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలను గెలుచుకుని వంద శాతం విజయాన్ని నమోదు చేసింది

  • By Sudheer Published Date - 01:01 PM, Sat - 28 December 24
  • daily-hunt
Pawan2024
Pawan2024

మరో మూడు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి (2025) అడుగుపెట్టబోతున్నాం. 2024కు బై బై చెపుతూ..2025 కి గ్రాండ్ గా వెల్ కం చెప్పేందుకు అంత సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో 2024 విషయాలు , సాధించిన విజయాలు , ఎన్నికల విజయాలు ఓటములు ఇలా అన్ని విషయాల గురించి అంత మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఈ ఇయర్ మెగా ఫ్యామిలీ (Mega Family ) కి బాగా కలిసొచ్చింది. ప్రధానంగా జనసేనాధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు ఈ ఇయర్ లక్కీ ఇయర్ అని చెప్పాలి. 2019 ఎన్నికలలో కేవలం ఒక్క సీటును గెలుచుకున్న జనసేన, 2024 ఎన్నికల్లో 21 శాసనసభ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలను గెలుచుకుని వంద శాతం విజయాన్ని నమోదు చేసింది.

రాజకీయాలను సీరియస్‌గా తీసుకున్న పవన్ కళ్యాణ్.. వ్యూహాత్మకమైన ప్రణాళికలతో ముందుకెళ్లి తన రాజకీయ సత్తా ఏంటో నిరూపించారు. గత పదేళ్లుగా ఎలాంటి పదవులు లేకపోయినా ప్రజల కోసం పనిచేస్తూ..ప్రజల కష్టాలను తెలుసుకుంటూ వారికీ అండగా నిలుస్తూ వారిని దగ్గర చేసుకున్నారు. ఇదే సందర్బంగా గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, వారాహి యాత్ర ద్వారా ప్రజలతో మమేకమయ్యారు. ప్రతిపక్ష ఓటు చీల్చడం వల్ల ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయబోమన్న పవన్ మాట ప్రజలలో విశ్వాసం కలిగించింది.

బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన పవన్, సీట్ల పంపకాల విషయంలో కీలక నిర్ణయం తీసుకోని, పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలో విజయం సాధించారు. అలాగే సనాతన ధర్మ రక్షణకు జనసేన కట్టుబడి ఉందని పవన్ చేసిన ప్రకటన..ప్రజల్లో బాగా నాటుకుపోయింది. తిరుపతిలో జరిగిన సభలో పవన్ సనాతన ధర్మ పరిరక్షణపై డిక్లరేషన్ ప్రకటించి, ఆ అంశంపై మరింత స్పష్టత ఇచ్చారు. సనాతన ధర్మానికి కట్టుబడి ఉండడమే కాకుండా, ఇతర మతాలను గౌరవించడం ద్వారా పవన్ ధర్మపరమైన నేతగా పేరు తెచ్చుకున్నారు.

ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే తరపున ప్రచారం నిర్వహించిన పవన్ కళ్యాణ్, తెలుగువారు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో మహాయుతి కూటమి అభ్యర్థులను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ ప్రచారం పవన్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకొచ్చింది. ప్రధాని మోదీ ద్వారా ప్రశంసలు అందుకోవడం పవన్ జాతీయ నాయకుడిగా ఎదిగేందుకు దోహదపడింది. సార్వత్రిక ఎన్నికల నుంచి రాష్ట్ర రాజకీయాల్లో అత్యుత్తమ విజయాలను సాధించిన పవన్ కళ్యాణ్, 2024 సంవత్సరం తన రాజకీయ ప్రస్థానానికి కీలకంగా నిలుస్తుందని నిరూపించారు. ప్రజా సేవకుడిగా తన హామీలను నిలబెట్టుకుంటూ, అభివృద్ధి కార్యక్రమాలను చక్కగా అమలు చేస్తూ పవన్ తన మార్క్‌ను నిరూపించారు. 2024ను పవన్ రాజకీయ విజయాల సంవత్సరంగా అభివర్ణించవచ్చు. అలాగే మెగా ఫ్యామిలీ కి సైతం ఈ ఇయర్ ఎంతో కలిసొచ్చింది. ఓవరాల్ గా 2024 మెగా ఇయర్ గా అభిమానులు ఎప్పటికి గుర్తు పెట్టుకుంటారు.

Read Also : New Year Events : నూతన సంవత్సర వేడుకలపై హైదరాబాద్ పోలీసులు అలర్ట్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Pawan Kalyan
  • Pawan Kalyan 2024
  • Pawan Kalyan 2024 Lucky Year

Related News

Poisonous Fevers

Poisonous Fevers : ఏజెన్సీ గురుకులాలను వణికిస్తున్న విషజ్వరాలు

Poisonous Fevers : ఆంధ్రప్రదేశ్‌ ఏజెన్సీ ప్రాంతాల్లో గురుకుల విద్యార్థులను విషజ్వరాలు తీవ్రంగా వణికిస్తున్నాయి. ఇటీవల కురుపాం మండలంలోని ఒక ప్రభుత్వ గురుకుల పాఠశాలలో

  • Vizagsummit

    Vizag Summit : విశాఖ సమ్మిట్ పెట్టుబడులపైనే అందరి దృష్టి

  • Lokesh Pawan

    Pawan Kalyan Next Film : పవన్-లోకేశ్ కాంబోలో సినిమా?

  • Ips Sanjay

    IPS Sanjay : ఐపీఎస్ సంజయ్ రిమాండ్ పొడిగింపు

  • Star Hotel

    Amaravati Hotels : అమరావతికి స్టార్ హోటళ్ల కళ

Latest News

  • WhatsApp: వాట్సాప్‌లో స్పామ్, అనవసర మెసేజ్‌లకు ఇక చెక్!

  • Air Pollution: వాయు కాలుష్యం.. గర్భంలో ఉన్న శిశువు మెదడుపై తీవ్ర ప్రభావం!

  • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

  • CNG Cars: త‌క్కువ బ‌డ్జెట్‌లో సీఎన్‌జీ కారును కొనుగోలు చేయాల‌ని చూస్తున్నారా?

  • Sadar Sammelan: సదర్ సమ్మేళనానికి సర్వం సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి రాక!

Trending News

    • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd