HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Hyderabad Police Alert New Year Parties Drug Free Celebrations

New Year Events : నూతన సంవత్సర వేడుకలపై హైదరాబాద్ పోలీసులు అలర్ట్

New Year Events : న్యూయర్ వేడుకలపై రంగంలోకి దిగిన నార్కొటిక్స్ బ్యూరో పోలీసులు.. స్థానిక పోలీసులు, ఎక్సైజ్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. వేడుకల్లో ఎటువంటి డ్రగ్స్ కు వినియోగించకుండ చర్యలు తీసుకోవాలని యజమానులకు ఆదేశించారు.

  • Author : Kavya Krishna Date : 28-12-2024 - 12:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
New Year Events
New Year Events

New Year Events : హైదరాబాద్ నగరంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు, రిసార్ట్లపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఈ సందర్భంగా నార్కొటిక్స్ బ్యూరో, స్థానిక పోలీసులు, ఎక్సైజ్ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో తనఖీ చర్యలు చేపట్టారు. ఈ మెరుగైన తనిఖీలు డ్రగ్స్ వినియోగం నియంత్రణపై దృష్టి సారించారు. ఈవెంట్ నిర్వహణలో భాగంగా ఏ రకమైన డ్రగ్స్ వినియోగం జరుగకుండా పబ్ యజమానుల నుంచి అండర్‌టేకింగ్ తీసుకున్నారు.

నార్కొటిక్స్ బ్యూరో – ఎక్సైజ్ అధికారులు కీలక చర్యలు

తెలంగాణ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన కోసం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నార్కొటిక్స్ డ్రగ్స్ ను అరికట్టడంలో ఎక్సైజ్ శాఖ పెద్దగా కృషి చేస్తోంది. గంజాయి, డ్రగ్స్ ఎక్కువగా వినియోగించే ప్రాంతాలను గుర్తించి, పబ్‌లపై ప్రత్యేక బృందాలతో ప్రత్యేక ఆపరేషన్‌లు చేపట్టారు. గంజాయి నిర్మూలనలో భాగంగా ‘ఆపరేషన్ ధూల్‌పేట్’ని కూడా నిర్వహించారు.

బంజారాహిల్స్ పరిధిలోని ప్రముఖ పబ్‌లు, హోటళ్లు, బార్లలో తనిఖీలు చేపట్టారు, వాటిలో టాస్‌, హోయిస్ట్, పార్క్ హయత్, లీలా హైదరాబాద్ స్టార్ హోటల్ అండ్ బార్‌లతో పాటు ఇతర ప్రదేశాలు ఉన్నాయి. ఉప్పల్ పరిధిలో వేవ్ పబ్, రాజేంద్ర నగర్‌లోని సిలెబర్ టెర్రేస్ కిచెన్‌లోనూ తనిఖీలు నిర్వహించారు. ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్ పరిధి లోని పబ్‌లు, బార్లలోనూ ఆపరేషన్లు జరిగాయి. సరూర్ నగర్, మోకిల, గచ్చిబౌలి, రాయదుర్గం, నార్సింగి పరిధిలోని పబ్‌లు, బార్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

హెచ్చరికలు , నిబంధనలు

ఈ తనిఖీలు జరిగే క్రమంలో పబ్ యజమానులకు కఠిన హెచ్చరికలు జారీ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. పబ్‌లలో డ్రగ్స్ వినియోగం కనిపించినా, వాటిని సీజ్ చేసి లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. అలాగే, మందు సరఫరా సమయాన్ని తప్పించకుండా, సమయానికి మద్యపాన వస్తువులను సరఫరా చేయాలని స్పష్టం చేశారు. సమయానికి మించి మందులు సరఫరా చేయడం లేదా ఇతర నిబంధనలు ఉల్లంఘించడం అయితే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

పోలీసులు నూతన సంవత్సరం వేడుకల్లో ఎటువంటి అపశృతి చోటుచేసుకోకుండా, పబ్ నిర్వాహకులు జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. అలా చేయకపోతే, చర్యలు తప్పవని తెలిపారు.

 
TGSRTC : ఏపీ వాసులకు గుడ్‌ న్యూస్‌.. సంక్రాంతికి స్పెషల్‌ బస్సులు ఎన్నంటే..!
 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bars
  • drug control
  • Drug-Free
  • Event Management
  • excise department
  • hyderabad
  • Narcotics Bureau
  • new year
  • Police Alert
  • pubs
  • Special Operations
  • telangana

Related News

Hyderabad Minor Girl instagram Trap Case

డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..

Hyderabad Minor Girl  ప్రేమ పేరుతో 20 మంది మైనర్ బాలికలను మోసగించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఓ కేటుగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ధనవంతుడిగా నటిస్తూ అమ్మాయిల వ్యక్తిగత ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేయడం ఇతని శైలి అని పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్‌కు చెందిన డబ్బున్న బాలిక నుంచి రూ. 13 లక్షలు కాజేయడంతో పాటు మరో యువతిని శారీరక వేధింపులకు గురిచేసినట్లు తేలిం

  • Pig Gives Birth To Elephant

    పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

  • Hyderabad Woman Disappears After Dispute Over Eating Curd

    పెరుగు తినమని చెప్పినందుకు ఇల్లు వదిలి వెళ్లిపోయిన భార్య

  • Dhoni Srh Match

    2026 IPL SRH – CSK Match : రేపటి మ్యాచ్ లో ధోని ఆడుతున్నాడా..?

  • Twins Same Marks in Intermediate Results 2026

    ఇంటర్ ఫలితాల్లో ఒకే మార్కులు సాధించిన కవలలు

Latest News

  • TGSRTC : రేపటి నుంచి RTC బంద్..ప్రయాణికులకు కష్టాలు తప్పవా ?

  • IPL 2026 : SRH హ్యాట్రిక్ కొట్టబోతుందా..? ఉప్పల్ స్టేడియం లో నేడు పరుగుల వారదేనా ?

  • IPL 2026 : ఇక ముంబై ని ఆపడం కష్టమేనా ?

  • IPL 2026 – CSK : సంజూను కెప్టెన్ చేయాలంటూ డిమాండ్ !

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

Trending News

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd