Acid Attack : ముగ్గురు కాలేజీ విద్యార్థినులపై యాసిడ్ దాడి.. యువకుడి దుశ్చర్య
Acid Attack : కర్ణాటకలోని కడబ ప్రభుత్వ ఇంటర్ కాలేజీలో దారుణం జరిగింది.
- By Pasha Published Date - 01:23 PM, Mon - 4 March 24

Acid Attack : కర్ణాటకలోని కడబ ప్రభుత్వ ఇంటర్ కాలేజీలో దారుణం జరిగింది. పరీక్ష రాసేందుకు కాలేజీకి వచ్చిన ముగ్గురు ఇంటర్ సెకండియర్ విద్యార్థినులపై అబిన్ అనే 23 ఏళ్ల యువకుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. కాలేజీ ఆవరణలో కూర్చొని పరీక్షలకు ప్రిపేరవుతున్న ముగ్గురు విద్యార్థినుల దగ్గరికి చేరుకున్న అతడు .. తొలుత ఓ విద్యార్థినిపై యాసిడ్‌ను విసిరాడు. దీంతో ఆ అమ్మాయికి తీవ్ర గాయాలయ్యాయి.ఈక్రమంలో ఆమె పక్కనే కూర్చున్న మరో ఇద్దరు విద్యార్థినులపైనా యాసిడ్ పడింది. దీంతో వారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారందరిని వెంటనే కడబ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.
We’re now on WhatsApp. Click to Join
యాసిడ్ దాడికి పాల్పడిన యువకుడు అబిన్ కేరళ వాస్తవ్యుడు. అతడు కర్ణాటకలోనే ఎంబీఏ చదువుతున్నాడని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. దీంతో వెంటనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి అనంతరం తప్పించుకునేందుకు నిందితుడు యత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తన ప్రేమకు నో చెప్పినందు వల్లే అతడు ఓ విద్యార్థినిపై యాసిడ్ దాడి (Acid Attack) చేశాడని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : CM Revanth – PM Modi : ప్రధాని మోడీ మా పెద్దన్న.. కేంద్రంతో ఘర్షణ పెట్టుకోం: సీఎం రేవంత్
కుక్క మొరిగిందని యాసిడ్ ఎటాక్..
కుక్క అరుపులతో విసుక్కొని ఏకంగా ఆ కుక్క యజమానిపై యాసిడ్ దాడి చేశాడో వ్యక్తి. ఈ ఘటన కర్ణాటకలోని చిక్కమగళూరులోని ఎన్. ఆర్. పురంలో గతేడాది డిసెంబరులో జరిగింది. యాసిడ్ దాడి కారణంగా కుక్క యజమాని సుందర్ రాజ్ ఎడమ కంటికి తీవ్రగాయాలయ్యాయి. అతని కన్ను దెబ్బ తినే అవకాశం ఉందని వైద్యులు అప్పట్లో తెలిపారు. సుందర్ రాజ్ పక్కింటిలో జేమ్స్ అనే వ్యక్తి ఉండేవాడు. కొంతకాలంగా సుందర్ రాజ్ కుటుంబ సభ్యులకు, జేమ్స్ కుటుంబ సభ్యులకు చిన్నచిన్న గొడవలు జరిగేవి. సుందరాజ్ ఇంటిలోని కుక్క గట్గిగా మొరగడంతో పక్కింటి జేమ్స్ ఆ కుక్కను తిట్టాడు. దీంతో యజమాని సుందర్ రాజ్ కూడా అతని ఇంటిలోని కుక్కను తిట్టడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో తననే సుందర్ రాజ్ తిడుతున్నాడని జేమ్స్ రగిలిపోయాడు. ఇంటిలోకి వెళ్లి యాసిడ్ తీసుకొచ్చిన జేమ్స్.. కుక్క యజమాని సుందర్ రాజ్ ముఖంపై పోశాడు.