Kerala Landslide Victims: మూడు గంటలపాటు భరతనాట్యం.. రూ.15,000 సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చిన బాలిక..!
హరిణి శ్రీ అనే 13 ఏళ్ల బాలిక వయనాడ్ కొండచరియల బాధితుల సహాయార్థం మూడు గంటలపాటు నిరంతరం భరతనాట్యం ప్రదర్శించి వచ్చిన రూ.15వేలను సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చిందని పేర్కొన్నారు.
- By Gopichand Published Date - 11:41 AM, Fri - 9 August 24

Kerala Landslide Victims: కేరళలోని వయనాడ్‌లో జూలై 30న సంభవించిన కొండచరియలు (Kerala Landslide Victims) విరిగిపడటంతో భారీ విధ్వంసం సంభవించింది. ఈ విపత్తులో 300 మందికిపైగా మరణించారు. కాగా తమిళనాడుకు చెందిన 13 ఏళ్ల బాలిక కొండచరియలు విరిగిపడిన బాధితుల కోసం నిధిని సేకరించేందుకు నిరంతరం మూడు గంటల పాటు భరతనాట్యం ప్రదర్శించింది. బాలికను హరిణి శ్రీగా గుర్తించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కలిసిన ఆమె ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధి (సీఎండీఆర్‌ఎఫ్)కి రూ.15,000 విరాళంగా అందజేశారు. ఆమె తన భరతనాట్యాన్ని సీఎం విజయన్‌కు చూపించగా అది చూసిన ముఖ్యమంత్రి బాలికను ఆశీర్వదించారు.
కేరళ ప్రభుత్వం ఈ సమాచారాన్ని పోస్ట్ చేసింది
కేరళ ప్రభుత్వ సమాచార ప్రజా సంబంధాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో పోస్ట్ ఈ విషయాన్ని పోస్ట్ చేసింది. తమిళనాడుకు చెందిన హరిణి శ్రీ అనే 13 ఏళ్ల బాలిక వయనాడ్ కొండచరియల బాధితుల సహాయార్థం మూడు గంటలపాటు నిరంతరం భరతనాట్యం ప్రదర్శించి వచ్చిన రూ.15వేలను సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చిందని పేర్కొన్నారు.
A 13-year-old girl child from Tamil Nadu, Harini Sri, performed #Bharatanatyam for 3 hrs straight to raise funds for #Wayanadlandslide to #standwithwayanad. She donated ₹15,000, including her savings, to #CMDRF. pic.twitter.com/v8FmbkZ1ie
— Kerala Government | കേരള സർക്കാർ (@iprdkerala) August 8, 2024
Also Read: CM Chandrababu: విశాఖ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ
వయనాడ్ కొండచరియలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్
గత నెలలో వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో నష్టపోయిన వారికి సహాయం చేయడానికి తమిళనాడులో క్రౌడ్ ఫండింగ్ ఫెస్ట్‌తో అనేక కార్యక్రమాలు చేపట్టారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన సంఘటనల తర్వాత రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష నాయకులు ఈ విషాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి వయనాడ్ కొండచరియలను జాతీయ విపత్తుగా ప్రకటించడం వల్ల సహాయక చర్యల కోసం అదనపు నిధులు విడుదలవుతాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఈ కొండచరియలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేరళ ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. విపత్తుపై విచారణ జరిపి నివేదిక సమర్పించేందుకు కేంద్ర హోంమంత్రి తొమ్మిది మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ విపత్తును ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చిందని విజయన్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 10వ తేదీ శనివారం వయనాడ్‌లో పర్యటించనున్నారు.