3 Killed : బెంగళూరులో దారుణం.. మద్యం మత్తులో భార్య, ఇద్దరు కూతుళ్లకు విషమిచ్చి…!
బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. కోననకుంటె పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు కూతుళ్లకు విషమిచ్చి
- By Prasad Published Date - 07:06 AM, Fri - 3 March 23

బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. కోననకుంటె పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు కూతుళ్లకు విషమిచ్చి హత్య చేశాడు. మృతులను విజయలక్ష్మి (28), నిషా (7), దీక్ష (5)గా పోలీసులు గుర్తించారు. కాన్సర్‌తో బాధపడుతూ డిప్రెషన్‌లో ఉన్న భర్త నాగేంద్ర కూడా మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే ప్రస్తుతం నాగేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగేంద్రకు క్యాన్సర్ రావడంతో ఇంటి నిర్వహణ బాధ్యతను అతని భార్య విజయలక్ష్మి తీసుకుంది. కొన్నాళ్లుగా నాగేంద్ర కూడా మద్యానికి బానిసయ్యాడు. నాగేంద్ర నిత్యం మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్యతో గొడవపడేవాడని పోలీసులు తెలిపారు. బుధవారం కూడా భార్య విజయలక్ష్మితో గొడవపడ్డాడు. గొడవ అనంతరం ఆహారంలో విషం కలిపి భార్య, ఇద్దరు కూతుళ్లకు వడ్డించడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం ఉదయం విజయలక్ష్మి సోదరుడు వారి ఇంటికి రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.