HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Hindi Hoardings Films Songs Banned Dmks Language Sentiment

Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

  • Author : Vamsi Chowdary Korata Date : 17-10-2025 - 1:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mk Stalin Hindi
Mk Stalin Hindi

తమిళనాడు ప్రభుత్వం సంచలన బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, ప్రజల్లో తమిళ సెంటిమెంట్ పెంచే ఉద్దేశంతో ఎంకే స్టాలిన్ సర్కార్ కొత్త బిల్లును తీసుకువచ్చేలా కనిపిస్తోంది. రాష్ట్రంలో హిందీని రుద్దడాన్ని నిషేధించే లక్ష్యంతో తమిళనాడు ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతిపాదిత చట్టంపై చర్చించడానికి నిన్న రాత్రి న్యాయ నిపుణులతో అత్యవసర సమావేశం జరిగినట్లు సమాచారం.ఈ బిల్లు తమిళనాడు అంతటా హిందీ హోర్డింగులు, బోర్డులు, సినిమాలు, పాటలను నిషేధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇది రాజ్యాంగానికి లోబడి ఉంటుందని డీఎంకే వర్గాలు చెబతున్నాయి. డీఎంకే సీనియర్ నేత టీకెఎస్ ఎలంగోవలన్ ఈ బిల్లుపై వ్యాఖ్యానిస్తూ..“మేము రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏమీ చేయము. మేము దానికి కట్టుబడి ఉంటాము. హిందీని విధించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము” అని అన్నారు. అయితే, బీజేపీ నేత వినోజ్ సెల్వం ఈ చర్యను మూర్ఖత్వంతో కూడుకున్నదిగా అభివర్ణించారు. భాషను రాజకీయ సాధనంగా ఉపయోగిస్తోందని డీఎంకేపై మండిపడ్డారు.తిరుపరంకుండ్రం, కరూర్ దర్యాప్తు వంటి సంబంధిత సమస్యల్ని మళ్లించేందుకు డీఎంకే ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరో ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి భాష సెంటిమెంట్‌ని రేకెత్తించాలని డీఎంకే చూస్తోందని పలువురు చెబుతున్నారు. ఇన్నాళ్లు డీఎంకే, ఏఐడీఎంకే మధ్యలోనే పోటీ నెలకొని ఉండేది. ఈ సారి మాత్రం విజయ్ టీవీకే రూపంలో ఎంట్రీ ఇవ్వడంతో పోరు త్రిముఖంగా మారింది. విజయ్‌కి వస్తున్న స్పందన చూసి ఒకింత డీఎంకే భయానికి లోనవుతుందని టీవీకే ఆరోపిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • #ThalapathyVijay
  • AIADMK-BJP Alliance
  • CM MK Stalin
  • DMK in Tamil Nadu
  • hindi
  • hindi ban
  • hindi language
  • Tamil Nadu elections
  • tvk

Related News

Manchu Manoj's Emotional Post About Vijay

Manchu Manoj: విజయ్‌పై మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్

తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంది. వామపక్ష పార్టీలు, విదుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) మద్దతు ప్రకటించడంతో టీవీకే కూటమి మ్యాజిక్ ఫిగర్‌ను అందుకుంది. ఈ నేపథ్యంలో విజయ్ త్వరలోనే గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్ప

  • Cm Thalapathy Vijay

    Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

  • Kamal Haasan Outraged at Governor

    Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

  • Rajinikanth met M. K. Stalin at his residence

    Rajinikanth: స్టాలిన్‌తో రజనీకాంత్ భేటీ.. క్లిష్ట సమయంలో అండగా ఉంటానని హామీ ఇచ్చిన రజనీ

  • cm vijay with trisha

    Trisha Krishnan: టీవీకే పార్టీలో త్రిష కీలక పాత్ర

Latest News

  • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

  • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

  • TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd