DK Shivakumar : నేను సీఎం కావాలని ప్రజలు కోరుకోవడంలో తప్పులేదు
DK Shivakumar : కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన చర్చలు మళ్లీ వేడెక్కుతున్న తరుణంలో, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన తాజా వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
- By Kavya Krishna Published Date - 05:53 PM, Mon - 7 July 25

DK Shivakumar : కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన చర్చలు మళ్లీ వేడెక్కుతున్న తరుణంలో, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన తాజా వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. “ప్రజలు, కార్యకర్తలు, మఠాధిపతులు నాకు సీఎం కావాలని కోరుకుంటే అందులో తప్పేం ఉంది?” అంటూ డీకే ప్రశ్నించారు. కానీ పార్టీ క్రమశిక్షణే తనకు మించిందేనని స్పష్టం చేశారు.
APNews : క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్‌ను ఆమోదిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
ఈ వ్యాఖ్యలు ఆయన రంభపురి పీఠాధిపతి శ్రీ రాజదేశికేంద్ర శివాచార్య స్వామితో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో వచ్చాయి. ఆ కార్యక్రమంలో పీఠాధిపతి మాట్లాడుతూ, “2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో డీకే శివకుమార్ పాత్ర అత్యంత కీలకం. ఆయనకు మాన్యమైన పదవి దక్కాలి,” అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన డీకే శివకుమార్, “ప్రజలు, మఠాధిపతులు తమ అభిప్రాయాలు వ్యక్తపరచడం సహజం. కానీ పార్టీ నిర్ణయం తుదితీర్పుగా మేమంతా మన్నిస్తాం,” అని స్పష్టం చేశారు. “మనమంతా పార్టీకి కట్టుబడి ఉన్న సైనికులం. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పాటించాల్సిందే. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు కూడా ఇదే విషయం అనేకసార్లు చెప్పారు,” అని గుర్తు చేశారు.
Tahawwur Rana : ముంబై 26/11 ఉగ్రదాడి కేసులో కీలక మలుపు..నేరం అంగీకరించిన తహవ్వూర్ రాణా…
కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో ఓటు వేశారని, ఆ విశ్వాసానికి తగిన విధంగా పాలన అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవి కోసం అనవసరమైన ప్రచారం, రాజకీయ వాదోపవాదాలు నివారించాలని కార్యకర్తలు, మీడియా, ప్రతిపక్షాలను ఆయన కోరారు. ఇదిలా ఉండగా, ఇటీవల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం ఐదేళ్ల పాటు తానే సీఎంగా కొనసాగతానని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో, పార్టీ లోపల ఏ మాత్రం రాజకీయ అస్థిరత లేదని భావిస్తున్నారు. అయినా ప్రతీసారి డీకే శివకుమార్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కలిగిస్తుండడం గమనార్హం.