APNews : క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్‌ను ఆమోదిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
APNews : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రపంచ క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న దిశగా కీలక అడుగులు వేస్తోంది.
- By Kavya Krishna Published Date - 02:12 PM, Mon - 7 July 25

APNews : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రపంచ క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో “అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్”ను అధికారికంగా ఆమోదిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 30న విజయవాడలో జరిగిన క్వాంటమ్ వర్క్‌షాప్ సందర్భంగా ఈ డిక్లరేషన్‌ను ప్రకటించినట్టు ప్రభుత్వం పేర్కొంది.
జూన్ 30న నిర్వహించిన వర్క్‌షాప్ ద్వారా ప్రభుత్వ, పరిశ్రమ, విద్యా సంస్థలు, స్టార్టప్‌లు కలిసి కొత్త టెక్నాలజీల అభివృద్ధిపై చర్చలు జరిపినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. క్వాంటమ్ టెక్నాలజీలో దేశానికి ముందుండేలా, అమరావతిని ఇన్నోవేషన్, పరిశోధన, ప్రతిభ అభివృద్ధి, అంతర్జాతీయ భాగస్వామ్యాల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ ప్రణాళిక రూపొందించినట్టు వివరించింది.
ఈ చర్యల క్రమంలో, ప్రభుత్వం వచ్చే 12 నెలల్లో “క్వూ-చిప్-ఇన్” అనే అతి పెద్ద క్వాంటమ్ వ్యాలీ బెడ్‌ను అమరావతిలో ఏర్పాటు చేయనుంది. ఇది దేశంలోనే అతిపెద్దదిగా నిలవనుంది. క్వాంటమ్ కంప్యూటింగ్, సెక్యూరిటీ, డేటా ప్రాసెసింగ్ వంటి విభాగాల్లో శోధనలకూ, ఆవిష్కరణలకూ ఇది కేంద్రబిందువుగా మారనుంది.
ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో 2035 నాటికి అమరావతిని ప్రపంచ స్థాయి క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. కేవలం శాస్త్రీయ పరిశోధన మాత్రమే కాకుండా, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, మానవ వనరుల శిక్షణ వంటి అంశాల్లో కూడా ప్రాధాన్యతనిస్తామని వెల్లడించింది.
ఈ డిక్లరేషన్‌లో భాగంగా, 2026లో “అమరావతి క్వాంటమ్ అకాడమీ”ని ప్రారంభించనున్నారు. ఇందులో క్వాంటమ్ టెక్నాలజీపై ప్రత్యేక శిక్షణ, ఫెలోషిప్‌లు, పరిశోధనల అనుసంధానానికి అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొంది. విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్‌లు, అంతర్జాతీయ సంస్థల మధ్య భాగస్వామ్యానికి ఇది వేదికగా మారనుంది.
Tragedy : దర్శనే మాకు ఆదర్శం.. రేణుకాస్వామి హత్య తరహాలో మరో ఘటన