Vastu Tips: ఉదయం లేచిన వెంటనే పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి!
వాస్తు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి తన నీడను చూడకూడదు. ఇది అశుభం. ఇది వ్యక్తిలో భయం, ఒత్తిడి, గందరగోళ స్థితిని సృష్టిస్తుంది. జీవితంలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
- By Gopichand Published Date - 06:30 AM, Thu - 19 December 24
Vastu Tips: ప్రతి వ్యక్తి జీవితంలో ఉదయం లేవగానే కొన్ని పనులు చేస్తారు. కొన్ని పనుల వలన రోజంతా ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రోజంతా కష్టపడి పనిచేసినా ఆశించిన ఫలితాలు దక్కవు. దీని వెనుక కారణం వాస్తు దోషాల (Vastu Tips) నుండి ఉదయాన్నే కొన్ని కనిపించడం వరకు ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఉదయాన్నే కొన్ని వస్తువులు చూడటం అశుభం. ఇది మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఇవి ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటాయి. మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే దూరంగా ఉండవలసిన కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జంతువులు, పక్షుల చిత్రాలను చూడవద్దు
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఉదయం నిద్రలేచిన వెంటనే జంతువులు, పక్షుల చిత్రాలను చూడకూడదు. వీటిని చూడటం మానుకోవాలి. రోజు ప్రారంభంలో ఇలాంటి చిత్రాలను చూడటం ప్రతికూల శక్తిని సూచిస్తుంది.
అద్దంలో ముఖం చూసుకోవద్దు
ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే అద్దంలో ముఖం చూసుకోవద్దు. వాస్తు శాస్త్రం ప్రకారం నేరుగా అద్దాన్ని చూసుకోవడం అశుభం. ఉదయం పూట అద్దంలో చూసుకోవడం మానుకోవాలి.
Also Read: Shailajanath: మాజీ సీఎం జగన్‌ని కలిసిన కాంగ్రెస్ నేత శైలజానాథ్.. వైసీపీలోకి ఖాయమేనా?
నీడును చూడకూడదు
వాస్తు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి తన నీడను చూడకూడదు. ఇది అశుభం. ఇది వ్యక్తిలో భయం, ఒత్తిడి, గందరగోళ స్థితిని సృష్టిస్తుంది. జీవితంలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
గడియారం వైపు చూడకూడదు
ఉదయం నిద్రలేచిన వెంటనే గడియారం వైపు చూడకూడదు. ఆగిపోయిన గడియారాన్ని చూస్తూ రోజు ప్రారంభించడం ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇటువంటి పరిస్థితిలో ఆగిపోయిన గడియారాన్ని ఇంట్లో ఉంచకూడదు. ఇది అశుభమైనదిగా పరిగణించబడుతుంది.
దేవతామూర్తుల ఆరాధన
ఉదయం నిద్రలేచిన వెంటనే దేవతామూర్తులను పూజించడం శ్రేయస్కరం. ఇలా రోజు ప్రారంభించడం వల్ల భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. సానుకూలత వస్తుంది. పనులన్నీ పూర్తవుతాయి.