HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Life Style
  • ⁄These Are The Reasons For Hair Fall In Teenagers

Hair Fall in Teenagers: టీనేజ్‌‌ లో హెయిర్‌ ఫాల్‌కు కారణాలు ఇవే..!

ఈ రోజుల్లో టీనేజ్‌ అమ్మాయిలూ.. హెయిర్‌ ఫాల్‌ గురించి ఎక్కువగా కంప్లైంట్‌ చేస్తున్నారు. అసలు టీనేజ్‌ అమ్మాయిలలో జుట్టు రాలే సమస్యకు కారణాలు ఏమిటి.

  • By Maheswara Rao Nadella Published Date - 04:00 PM, Sat - 11 March 23
Hair Fall in Teenagers: టీనేజ్‌‌ లో హెయిర్‌ ఫాల్‌కు కారణాలు ఇవే..!

వయసు మీదపడిన తర్వాత.. మహిళలకు జుట్టు రాలే సమస్య సర్వసాధారం. ఎందుకంటే, వయసు పెరిగే కొద్దీ.. వాళ్లను అనారోగ్యాలు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. అయితే, ఈ మధ్యకాలంలో టీనేజర్లు, హెయిర్‌ ఫాల్‌ (Hair Fall) గురించి ఎక్కువగా కంప్లైంట్‌ చేస్తూ ఉంటున్నారు. ఇది పిల్లలను మాత్రమే కాదు, తల్లిని కూడా ఆందోళనకు గురిచేస్తుంది. రోజుకు.. కొంచెం జుట్టు ఊడిపోవడమే కామన్‌. కానీ, తలలో వేళ్లు పెట్టిన వెంటనే, దువ్వెనతో దువ్విన వెంటనే.. పాయపాయలుగా జుట్టు ఊడుతుంటే.. కంగారు మొదలవుతుంది. అమ్మాయిలు హెయిర్‌ ఫాల్‌ (Hair Fall) సమస్యను దురం చేసుకోవడానికి.. ఏవేవో హెయిర్‌ ప్యాక్‌లు, రెమిడీస్‌ ట్రై చేస్తూ ఉంటారు. కానీ, టీనేజ్‌లో జుట్టు రాలడం వెనకు కారణాలు తెలుసుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణాలు గుర్తించి, నివారణలు తీసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. చిన్నవయస్సులో జుట్టు రాలడానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.​

జన్యు కారణాల వల్ల:

కొన్నిసార్లు జన్యు పరమైన కారణాల వల్ల.. జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది. ఆండ్రోజెనెటిక్ అలోపేసియా, ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్ వంటి జన్యుపరమైన కారణాల వల్ల జుట్టు రాలుతుంది. ఈ కండీషన్స్‌లో జుట్టు రాలుతూ.. క్రమేపీ పలుచబడుతుంది. ఇది సాధారణంగా.. 30, 40 లో కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో టీనేజ్‌లోనూ ఈ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

పోషకలోపం:

టీనేజ్ అమ్మాయిలు.. ఎక్కువగా లుక్స్‌, బరువు మీద దృష్టి పెడుతూ ఉంటారు. దీంతో తక్కువ తినడం, క్రాష్ డైటింగ్ వంటివి పాటిస్తారు. దీని కారణంగా జీర్ణ సమస్యలు కూడా రావచ్చు. ఇవన్నీ హెయిర్‌ గ్రోత్‌కు సహాయపడే.. ఐరన్, విటమిన్ B12, విటమిన్ D, జింక్, బయోటిన్, ప్రొటీన్‌ వంటి పోషకాల లోపానికి దారితీస్తాయి. హెయిర్‌ ఫాల్‌తో బాధపడే టీనేజ్‌ అమ్మాయిలు.. పోషకాహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

పీసీఓఎస్‌ (Polycystic Ovarian Syndrome):

ప్రస్తుతం చాలా మంది టీనేజ్‌ అమ్మాయిలు పీసీఓఎస్‌తో బాధపడుతున్నారు. పీసీఓఎస్‌ కారణంగా.. అసాధారణ స్థాయిలో ఆండ్రోజన్స్ (పురుష హార్మోన్లు) ఉత్పత్తవుతుంటాయి. ఫలితంగా హార్మోన్ల స్థాయుల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతుంటాయి. ఈ హార్మోన్ల అసమతుల్యత చర్మం, జుట్టు నిర్మాణ కణజాలాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. జింక్‌ సప్లిమెంట్స్‌, జింక్‌ ఎక్కువగా లభించే కోడిగుడ్లు, చేపలు, నట్స్‌, గింజలు.. వంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల పీసీఓఎస్‌ ఉన్నవారిలో జుట్టు రాలే సమస్య దూరం అవతుందని నిపుణులు అంటున్నారు.

థైరాయిడ్‌:

థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి పెరగినా, తగ్గినా.. జుట్టు పెలుసుగా మారడం, హెయిర్‌ ఫాల్‌ ఎక్కువగా ఉండటం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

హెయిర్‌ ట్రీట్మెంట్స్‌:

టీనేజ్‌ అమ్మాయిలు హెయిర్ కలరింగ్‌, స్ట్రెయిటెనింగ్ అంటే చాలా ఇష్టపడతారు. కానీ, రెగ్యులర్‌గా హెయిర్ కలరింగ్, స్ట్రెయిటెనింగ్, స్మూత్నింగ్ వంటి కెమికల్‌ ట్రీట్మెంట్స్‌ తీసుకుంటుంటే.. హెయిర్ షాఫ్ట్ డైసల్ఫైడ్ బాండ్స్‌ విచ్ఛిన్నం అవుతాయి. దీని కారణంగా జుట్టు కుదుళ్లు బలహీనపడతాయి. ఇది హెయిర్‌ ఫాల్‌ సమస్యను పెంచుతుంది. వేడి నీటితో తలస్నానం చేయడం, కఠినమైన షాంపూలు వాడటం, జుట్టు తడిగా ఉన్నప్పుడు జడ వేసినా.. జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది.

ఆరోగ్య సమస్యలు:

టైఫాయిడ్, డెంగ్యూ, కోవిడ్-19 , ఏవైనా దీర్ఘకాలిక అనారోగ్యం, శస్త్ర చికిత్సలు చేయించుకోవడం వల్ల టెలోజెన్ ఎఫ్లూవియం అనే పరిస్థితికి దారితీయవచ్చు, ఇది జుట్టు రాలిపోయే రివర్సిబుల్ కండిషన్.

ఒత్తిడి:

పరీక్షలు, తోటివారితో సమస్యలు వంటి కారణాల వల్ల టీనేజర్లు కూడా ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారు. టీనేజ్ అమ్మాయిలలో ఒత్తిడి పెరగడం వల్ల జుట్టు రాలడంతోపాటు మొటిమలు సమస్య కూడా ఎదురవుతుంది.

స్కాల్ప్ డిజార్డర్స్:

చుండ్రు సమస్య కారణంగానూ జుట్టు రాలడం ఎక్కువ అవుతుంది. అలోపేసియా అరేటా వంటి ఇతర పరిస్థితుల కారణంగానూ హెయిర్‌ ఫాల్‌ ఉంటుంది. దీనిలో రోగనిరోధక వ్యవస్థ వెంట్రుకల కుదుళ్లపై దాడి చేస్తుంది.

ఈ జాగ్రత్తలు తీసుకోండి:

  1. ఐరన్, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. మీ ఆహారంలో ఖర్జూరాలు, ఆకు కూరలు, కాయధాన్యాలు, చికెన్, చేపలు, గుడ్డు, నట్స్‌ (ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు) ఎక్కువగా తీసుకోండి.బిగుతుగా ఉండే హెయిర్‌ స్టైల్‌, హీటింగ్ టూల్స్ వాడకాన్ని తగ్గించండి.
  2. చుండ్రు సమస్యను నియంత్రించడానికి స్కాల్ప్ చేయడం, యాంటీ-డాండ్రఫ్ షాంపూలను ఉపయోగించండి.
  3. జుట్టు రాలే సమస్స ఎక్కువగా ఉంటే వైద్యుడిని సంప్రదించడం మేలు.

Also Read:  Vitamin D Deficiency: విటమిన్‌ డి లోపం ఉంటే ఈ సమస్యలు తప్పవు..

Telegram Channel

Tags  

  • benefits
  • hair
  • hair fall
  • health
  • Life Style
  • reasons
  • teenagers
  • tips
  • Tricks
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Copper: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే?

Copper: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే?

సాధారణంగా వెండి,బంగారం,వజ్రాలతో తయారుచేసిన ఆభరణాలను ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. వజ్రాల కంటే వెండి

  • April 1 Coming: ఆ లోపు పూర్తి చేయాల్సిన ముఖ్యమైన ఆర్థిక పనులివే

    April 1 Coming: ఆ లోపు పూర్తి చేయాల్సిన ముఖ్యమైన ఆర్థిక పనులివే

  • Chaitra Navratri Special: సాత్విక, రాజస, తామస ఆహారం మధ్య తేడా? ప్రయోజనాలు?

    Chaitra Navratri Special: సాత్విక, రాజస, తామస ఆహారం మధ్య తేడా? ప్రయోజనాలు?

  • Dreams: కలలో ఈ 5 విషయాలను చూస్తే.. ఇక మీకు మంచిరోజుల క్యూ

    Dreams: కలలో ఈ 5 విషయాలను చూస్తే.. ఇక మీకు మంచిరోజుల క్యూ

  • First Day @ Office: ఆఫీస్ లో మొదటి రోజు.. 4 తప్పులు చేయొద్దు సుమా..!

    First Day @ Office: ఆఫీస్ లో మొదటి రోజు.. 4 తప్పులు చేయొద్దు సుమా..!

Latest News

  • Rashmika: రష్మిక చేసే పనికి షాక్ లో అభిమానులు.. అసలేం జరిగిందంటే!?

  • New Rule: టాస్ తర్వాతే తుది జట్టు.. ఐపీఎల్ లో కొత్త రూల్

  • Aus vs IND: తోక తెంచలేకపోయారు… చెన్నై వన్డేలో భారత్ టార్గెట్ 270

  • World Cup 2023: ఆ 964 కోట్లు భారం బీసీసీఐ పైనే… పాక్ జట్టు వీసాలపైనా బోర్డు హామీ

  • Covid 19: దేశవ్యాప్తంగా మరోసారి విజృంభిస్తున్న కోవిడ్.. కేంద్ర ప్రభుత్వం అలర్ట్?

Trending

    • Odisha Temple: ఎలుకలతో దేవతమూర్తులకు నిద్రాభంగం.. అలర్ట్ అయిన పూజారులు!

    • Unfit Cops: పంజాబ్ పోలీసులపై హైకోర్టు సీరియస్… 80 వేల మంది ఏం చేస్తున్నారంటూ !

    • Umesh Chandra:వైఎస్ రాజారెడ్డికి సంకెళ్లు వేసిన గ్రేట్ ఐపీఎస్

    • MS Dhoni: ధోని గురించి ఎవరికీ తెలియని రహస్యం చెప్పిన రాబిన్ ఊతప్ప..!

    • Rohit Sharma: రోహిత్ శర్మ బ్యాటింగ్ లోనే కాదు.. డ్యాన్స్ లో కూడా ఆదరగొట్టాడు.. వీడియో వైరల్..!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: