Vitamin D Deficiency: విటమిన్ డి లోపం ఉంటే ఈ సమస్యలు తప్పవు..
భారతదేశంలో సంవత్సరం పొడవునా సూర్యరశ్మి ఉన్నా.. ఎదుగుతున్న పిల్లల్లో విడమిట్ 'డీ' లోపం పెరుగుతున్నట్లు ఓ అధ్యయనం తెలిపింది.
- By Maheswara Rao Nadella Published Date - 07:00 PM, Fri - 10 March 23

విటమిన్ ‘డీ’ ఎముకల ఎదుగుదల, కండరాల పటుత్వానికి అత్యంత కీలకం. రోగనిరోధక శక్తి పెంపుదలకు ఇది తోడ్పడుతుంది. ఆరోగ్యకరమైన దంతాలకు, ఎముకల బలానికి విటమిన్ డి అవసరపడుతుంది. ఇన్‌ఫెక్షన్లతో పోరాడటానికీ శరీరానికి విటమిన్ డి సహకరిస్తుంది. కండరాల కణాల అభివృద్ధికి దోహదపడుతుంది. మనదేశంలో సంవత్సరం పొడవునా సూర్యరశ్మి ఉన్నా.. ఎదుగుతున్న పిల్లల్లో విడమిట్ ‘డీ’ లోపం (Vitamin D Deficiency) పెరుగుతున్నట్లు ఓ పరిశీలనలో తేలింది. జాతీయ స్థాయిలో 10-19 ఏళ్ల మధ్య వయసు వారిలో దాదాపు ప్రతి నలుగురిలో ఒకరు విటమిన్ డీ లోపం (Vitamin D Deficiency) తో బాధపడుతున్నట్లు గుర్తించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ యూనిసెఫ్ సహకారంతో చేపట్టిన నివేదికలో.. 4 ఏళ్ల లోపు చిన్నారులు 13.8 శాతం మందిలో డీ విటమిన్ లోపం ఉన్నట్లు గుర్తించారు. 5-9 ఏళ్ల వయసు పిల్లల్లో 18.2 శాతం మందిలో విటమిన్ డీ లోపం ఉన్నట్లు తేలింది. చిన్నారులలో విటమిన్ డీ లోపం కారణంగా… ఎలాంటి సమస్యలు వస్తాయ్? వారికి రోజుకు ఎంతమొత్తంలో విటమిన్ డీ అవసరం? పిల్లల్లో విటమిన్ డీ లోపం దూరం చేయడానికి ఎలాంటి ఆహారం ఇవ్వాలో ఈ స్టోరీలో చూసేద్దాం.
సంవత్సరం లోపు పిల్లలకు:
పిల్లలకు మొదటి రెండు సంవత్సరాలు విటమిన్ ‘డి’ సప్లిమెంట్స్ ఇవ్వాలని ‘ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్(IAP)’ సూచిస్తోంది. పలు అంతర్జాతీయ సంస్థలు కూడా రోజుకు 400IU చొప్పున విటమిన్ ‘డి’ సప్లిమెంట్స్ ఇవ్వాలని అంటున్నాయి. బ్రెస్ట్ ఫీడింగ్, ఫార్ములా ఫీడింగ్, సెమీ బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా పాలు తాగే పిల్లలకూ సప్లిమెంటేషన్ ఇవ్వాలని పేర్కొంది. వీటి ద్వారాను పిల్లలకు విటమిన్ డి తక్కువగా అందుతుంది.
రోజుకు ఎంత విటమిన్ డీ అవసరం:
విటమిన్ డి లాభాలు:
- విటమిన్ డి ఎదుగుతున్న పిల్లలకు ఎముకులు బలంగా ఎదగడానికి.. కాల్షియం, ఫాస్పరస్ ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది.
- పిల్లలను ఉత్సాహంగా ఉంచుతుంది, అలసిపోకుండా చేస్తుంది.
- గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరచి, డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
- దంతాలు, చిగుళ్లకు విటమిన్ డి అవసరం.
- విటమిన్ డి తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది.
- గుండె జబ్బులు, మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
పిల్లల్లో విటమిన్ డీ లోపం ఉంటే:
- పిల్లల్లో విటమిన్ డీ లోపం ఉంటే.. రికెట్స్, ఎముక వైకల్యం సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దాని వల్ల, ఎదిగే పిల్లల్లో, కాళ్ళు వంకర అవ్వడం , పుర్రె సొట్ట పడడం వంటి సమస్యలు వస్తాయి.
- కండరాలు బలం లేకుండా ఉండడం, కండరాలు, ఎముకల్లో నొప్పులు ఉంటాయి.
- విటమిన్ డి లోపం పిల్లలల్లో ధమని గోడల దృఢత్వాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది అధిక రక్తపోటుకు కారణమవుతుంది.
ఈ ఆహారాలు పెట్టండి:
ఆరు నెలలు దాటిన పిల్లలకు వారి ఆహారం ద్వారా.. విటమిన్ D లోపం భర్తీ చేయవచ్చు. వారి డైట్‌లో విటమిన్ డీ పుష్కలంగా ఉండే ఆహారాలు చేర్చండి.
పాలు..
పిల్లలకు 12 నెలలు దాటిన తర్వత ఆవు పాలు ఇవ్వచ్చు. రోజుకు ఒక గ్లాసు వెన్నతో కూడిన ఆవు పాలు తాగడం వల్ల రోజులో కావాల్సిన మొత్తంలో 20 శాతం దాకా విటమిన్ D లభిస్తుంది. పాలలో ఉండే కాల్షియం.. వారి ఎముకలను దృఢంగా ఉంచుతుంది. పెరుగులోనూ ప్రొటీన్లతో పాటు ‘డి’ విటమిన్ మెండుగా ఉంటుంది.
పుట్టగొడుగులు..
పుట్టగొడుగులలో విటమిన్ డి మెండుగా ఉంటుంది. దీంతో పాటు బి1, బి2, బి5, కాపర్.. వంటి పోషకాలు కూడా పుట్టగొడుగుల్లో అధికంగా ఉంటాయి. ఈ పోషకాలు పిల్లల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మీ పిల్లలకు పుట్టగొడుగుల సూప్ తయారు చేసి పెట్టవచ్చు.
ఆరెంజ్..
ఆరెంజ్‌లో విటమిన్ సి, డి సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి. మీ పిల్లలకు తరచుగా ఆరెంజ్ జ్యూస్ ఇస్తే.. వారికి విటమిన్ డీ అందుతుంది.
గుడ్డు పచ్చసొన..
గుడ్డు పచ్చసొనలో విటమిన్ డి మెండుగా ఉంటుంది. మీ పిల్లలకు రోజుకొక గుడ్డు సొన తినిపించండి. వారికి గుడ్డు సొన నచ్చకపోతే.. ఆమ్లెట్ వేస్తే ఇష్టంగా తింటారు. గుడ్డు పచ్చసొనలో 37 IU విటమిన్ డి ఉంటుంది.
కొవ్వు చేపలు..
కొవ్వు చేపలు విటమిన్ డి అద్భుతమైన మూలం. సాల్మన్, సార్డినెస్, మాకేరెల్ వంటి చేపలలో విటమిన్ డి మెండుగా ఉంటుంది. 100 గ్రాముల సాల్మన్ 526 IU విటమిన్ డిని అందిస్తుంది. 100 గ్రాముల సార్డినెస్‌లో 170 IU ఉంటుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి.
Also Read: Apple Music Classic: సంగీత ప్రియుల కోసం ప్రత్యేక యాప్ తయారు చేసిన యాపిల్.

Related News

Healthy Sleep Tips: 8 గంటల కంటే తక్కువ నిద్రపోతే PAD ముప్పు.. ఏమిటది..?
8 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి (PAD) వచ్చే ప్రమాదం ఉంటుందని స్వీడన్‌లో ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.