Papaya Juice: ఉదయాన్నే పరగడుపున బొప్పాయి జ్యూస్ తాగవచ్చా.. తాగితే ఏమవుతుందో మీకు తెలుసా?
Papaya Juice: ఉదయాన్నే పరగడుపున బొప్పాయి చూసి తాగితే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో, ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- Author : Anshu
Date : 27-09-2025 - 9:49 IST
Published By : Hashtagu Telugu Desk
Papaya Juice: బొప్పాయి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ బొప్పాయిని ఇష్టంగా తింటూ ఉంటారు. బొప్పాయిలో విటమిన్లు ఎ, సి, బి, ఇ, పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం, ఫోలేట్ లాంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. తరచుగా బొప్పాయి తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయట. చాలామంది ఉదయాన్నే బొప్పాయి తినడం లేదా జ్యూస్ తాగడం లాంటివి చేస్తుంటారు.
మరి ఉదయాన్నే పరగడుపున బొప్పాయి జ్యూస్ తీసుకుంటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఉదయం లేచిన వెంటనే పరగడుపున బొప్పాయి జ్యూస్ తాగితే శరీరానికి ఎన్నో అద్భుతమైన లాభాలు కలుగుతాయట. బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ A, C, ఫైబర్ శరీరానికి శక్తి లభిస్తుందట. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని, కడుపులోని టాక్సిన్స్ ను తొలగించి జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుందని చెబుతున్నారు. అదేవిధంగా ఫైబర్ అధికంగా ఉండే బొప్పాయి జ్యూస్ ను ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందట.
మలబద్ధకం సమస్య తగ్గుతుందని, బొప్పాయి లోని పపైన్ అనే ఎంజైమ్ దీనికి సహాయపడుతుందని చెబుతున్నారు. కాగా విటమిన్ సి, అలాగే ఇంకా చాలా యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న బొప్పాయి జ్యూస్ తాగడం వల్ల ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుందట. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని చెబుతున్నారు. ఫైబర్ అధికంగా ఉండే బొప్పాయి జ్యూస్‌ను డైట్‌లో చేర్చుకోవడం ఆకలిని తగ్గించి, బరువు తగ్గడానికి మేలు చేస్తుందట. ఇందులో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అధిక బరువు తగ్గించుకోవాలి అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. కాగా అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా, బొప్పాయి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుందట. డయాబెటిక్ పేషెంట్స్ కి ఇది ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. విటమిన్లు సి, ఇ పుష్కలంగా ఉన్న బొప్పాయి చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందం కూడా పెరుగుతుందట. యవ్వనంగా కనిపిస్తారని చెబుతున్నారు.