HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Make Your Walk More Effective For Weight Loss

Walk And Weight Loss: బరువు తగ్గడానికి 5 సులువైన మార్గాలు

జీవన శైలిలో మార్పులు రావడం వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ బరువు పెరుగుతున్నారు.

  • Author : HashtagU Desk Date : 29-08-2022 - 7:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Weight Loss
Weight Loss

జీవన శైలిలో మార్పులు రావడం వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ బరువు పెరుగుతున్నారు. పిల్లలకు పాఠశాలల్లో ఆటల్లేవు, యువకులకు, పెద్దవారికి వ్యాయామంలేదు. కూర్చొని పనిచేసే ఉద్యోగాలే అవడంతో శారీరక శ్రమ ఉండటంలేదు. దాంతో అందరి శరీర బరువు పెరిగిపోతోంది. ఈ బరువు తగ్గించుకోవడానికి నిపుణులు అయిదు సులభమైన మార్గాలు చెబుతున్నారు.

1.ముందు ఆహారాన్ని ఎక్కువసార్లు తినడం తగ్గించుకోవాలి. అలా అని కడుపు మాడ్చుకోవలసిన అవసరంలేదు. శక్తి తగ్గకుండా, నీరసం రాకుండా పండ్లు, పండ్ల రసం తీసుకోండి. మంచినీరు కూడా ఎక్కువ తాగాలి.
2.కార్బోహైడ్రేట్స్, షుగర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవద్దు. మంచి ప్రొటీన్ గల ఆహారం తీసుకోండి. మీరు తీసుకునే ఆహారంలో కూరగాయలు,ఆకు కూరలు ఎక్కువగా ఉండేవిధంగా చూసుకోండి.వంటలకు కొబ్బరి నూనె వాడటం ఉత్తమం.
3.వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. అలా అని వారం రోజులూ చేయవలసిన అవసరంలేదు. వారంలో మూడు లేదా నాలుగు రోజులు చేస్తే చాలు. ప్రతిరోజూ చేసేవారు తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు. ఇంటి పనులు, తోట పనులు స్వయంగా చేసుకోవడం ఉత్తమం.
4. వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ వంటివి చేయాలి. బరువు తగ్గడానికి నడక చాలా ఉత్తమమైనది. నడవగలిగినవారు ఎత్తుగా ఉండే ప్రదేశాలపైకి నడిస్తే మంచిది. ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి.గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
5.మీ నడకలో మార్పులు చేసుకోవచ్చు. అంటే కొద్దిసేపు వేగంగా నడిచి, తరువాత కొద్ది సేపు జాగింగ్ చేసి, ఆ తరువాత నెమ్మదిగా నడవవచ్చు. ఇలా మీ ఇష్టానుసారం మధ్యమధ్యలో మార్పులు చేసుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం నడిచేటప్పుడు వేసుకునే పాదరక్షలు మంచి పట్టు కలిగి ఉండేవిధంగా చూసుకోవాలి.
ఈ అయిదింటిని పాటిస్తే మీరు సులభంగా బరువు తగ్గుతారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brisk walk
  • exercise
  • good and healthy food
  • walk
  • weight loss

Related News

    Latest News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

    • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

    • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

    • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

    • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

    Trending News

      • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

      • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

      • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

      • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

      • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd