Hair fall Causes: జుట్టు ఎక్కువ మొత్తంలో రాలుతోందా.. కారణం ఏంటో తెలుసుకోండి?
ఈ రోజుల్లో చాలామంది స్త్రీ పురుషులు హెయిర్ ఫాల్ బాధపడుతున్నారు. హెయిర్ ఫాల్ అవ్వడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయన్న విషయం మ
- By Nakshatra Published Date - 09:43 PM, Mon - 28 August 23
ఈ రోజుల్లో చాలామంది స్త్రీ పురుషులు హెయిర్ ఫాల్ బాధపడుతున్నారు. హెయిర్ ఫాల్ అవ్వడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ హెయిర్ ఫాల్ కారణంగా జుట్టు పల్చగా అవ్వడంతో పాటు బట్టతల సమస్య కూడా వస్తూ ఉంటుంది. కాలుష్యం, ఆహార అలవాట్లు, ఒత్తిడి, బ్యూటీ ప్రోడక్ట్స్ ఇలా అనేక కారణాల వల్ల హెయిర్ ఫాల్ సమస్య వస్తూ ఉంటుంది. జుట్టు రాలడం, చుండ్రు, గజిబిజి జుట్టు, నిర్జీవంగా ఉండే జుట్టు, స్ప్లిట్ ఎండ్స్, తక్కువ జుట్టు సన్నని జుట్టు ఇలా జుట్టుకు సంభందించి అనేక అంతులేని సమస్యలు ఉన్నాయి.
అందులో ముఖ్యంగా హెయిర్ ఫాల్ సమస్య మరింత ఇబ్బంది పడుతూ ఉంటుంది. చాలామందికి కుచ్చులు కుచ్చులు గా వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. అయితే అలా ఎందుకు జరుగుతుందో అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఉంటే.. అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మెనోపాజ్, డయాబెటిస్, అధిక బరువు వంటి హార్మోన్ల అసమతుల్యత సడెన్ హెయిర్ ఫాల్కు కారణం కావచ్చు. హార్మోన్ల అసమతుల్యత జుట్టు నిర్మాణ కణజాలాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మీరు హార్మోన్ల అసమతుల్యతతో బాధపడుతుంటే మీ డైట్లో తాజా పండ్లు, కూరగాయలు, నట్స్, తృణధాన్యాలు ఎక్కువగా చేర్చుకోవడం మంచిది.
కొన్ని రకాల మెడిసిన్స్ హెయిర్ ఫాల్కు కారణం అవుతాయి. ముఖ్యంగా బ్లడ్ థినర్స్, యాంటీ డిప్రెసెంట్స్, కొలెస్ట్రాల్ తగ్గించే మెడిసిన్స్ వాడేవారిలో హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువగా ఉంటుంది. కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధుల కారణంగా జుట్టు ఎక్కువగా రాలుతూ ఉంటుంది. అలోపేసియా, లూపస్ ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉన్నవారికి హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువగా ఉంటుంది. శరీరంలో టెలోజెన్ అనే హార్మోన్ పెరిగితే జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది. ఇది హెయిర్ ఫాల్కు ప్రధాన కారణం అని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి ఎక్కువ అయినా శరీరంలో దీని ఉత్పత్తి పెరుగుతుంది. ఒత్తిడి కారణంగా హెయిర్ ఫాల్కు, బట్టతలకి కారణమయ్యే కార్టిసాల్ ఉత్పత్తిని కూడా పెరుగుతుంది. అదేవిదంగా థైరాయిడ్ సమస్య ఉన్నవారికి జుట్టు రాలే సమస్య అధికంగా ఉంటుంది. హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ హెయిర్ ఫాల్ ఎక్కువగా జరుగుతుంది.
Related News
Hair Loss: అధికంగా హెయిర్ ఫాల్ అవుతోందా.. అయితే ఇలా చేయాల్సిందే?
ప్రస్తుత రోజుల్లో జుట్టు ఎక్కువగా రాలిపోవడం అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. దీని కారణంగా చాలామంది పొట్టి జుట్టు, పలుచని జుట్టు లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కొందరిలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలా అధికంగా హెయిర్ ఫాల్ అవుతుంటే అలాంటి సమయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. మరి హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలో ఇప్ప�