Green Peas : పచ్చి బఠానీల ప్రయోజనాలు తెలుస్తే అస్సలు వదిలిపెట్టరు..!!
ఇంట్లో చపాతీలు చేసినప్పుడు..అందులోకి గ్రేవీ కర్రీ కావాల్సిందే. చాలామంది బంగాళదుంపలతో కర్రీ చేస్తుంటారు.
- By hashtagu Published Date - 07:49 PM, Thu - 13 October 22

ఇంట్లో చపాతీలు చేసినప్పుడు..అందులోకి గ్రేవీ కర్రీ కావాల్సిందే. చాలామంది బంగాళదుంపలతో కర్రీ చేస్తుంటారు. అందులో కొన్ని పచ్చి బఠానీలు వేస్తే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిఒక్కరూ ఇష్టపడి తింటుంటారు. అయితే పచ్చి బఠానీలు కేవలం రుచిని మాత్రమే కాకుండా మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యంగా బఠానీల్లో ప్రొటీన్లు, పీచుపదార్థాలు, విటమిన్ సి, విటమిన్ కే, పోలిక్ యాసిడ్స్ , ఫాస్పరస్, మాంగనీస్, కాపర్ వంటివి అధిక మొత్తంలో ఉంటాయి. కాబట్టి ఆరోగ్యానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు ఇందులో నుంచి లభిస్తాయి.
బచ్చిబఠానీలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
మధుమేహం ఉన్నవారికి:
పచ్చి బఠానీలలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇందులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. కాబట్టి రక్తంలో చక్కెరను అదుపులో ఉంచడంతోపాటు మధుమేహాన్ని నియంత్రిస్తుంది .
చర్మ సంరక్షణ కోసం:
చర్మ సంరక్షణ విషయానికి వస్తే.. పచ్చి బఠానీలు చర్మానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. ఇందులో విటమిన్ బి6, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఇది ఫ్రీ రాడికల్ ఎలిమెంట్స్ వల్ల దెబ్బతిన్న చర్మ కణాలను రక్షించడమే కాకుండా, చిన్న వయస్సులోనే చర్మం ముడతలు లేదా వృద్ధాప్య సంకేతాలను తొలగించడంలో సహాయపడతుంది.
ప్రోటీన్ కంటెంట్:
ఇతర రకాల పప్పులతో పోలిస్తే.. పచ్చి బఠానీ ప్రత్యేకం. ఇందులో ఉండే అధిక మొత్తంలో ఫైబర్ ప్రోటీన్ ప్రధాన కారణం. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. శరీరంలో జీవక్రియను పెంచడంలో ఎముకలను బలపేతం చేయడంతోపాటు రోగనిరోధకశక్తిని పెంచడంలోనూ సహాయపడతాయి.
కొలెస్ట్రాల్ నియంత్రణ కోసం:
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే గుండె పనితీరు దెబ్బతింటుందని మనందరికీ తెలుసు . దీని కారణంగా, రక్త ప్రసరణలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఏదైనా సందర్భంలో, రక్తపోటు సమస్యలు గుండె సంబంధిత సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగకుండా చూసుకోవాలి. పచ్చి బఠానీలు చాలా సహాయకారిగా పనిచేస్తాయి. వీటిని వారి రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే, శరీరంలోని రక్త ప్రసరణలో కనిపించే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్) స్థాయి నియంత్రిస్తుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డిఎల్) స్థాయిని పెంచుతుంది.