Gold, silver price: ఆగస్టు 22 బంగారం, వెండి ధరలు
బంగారం అంటే ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. బంగారం, వెండి కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. ఈ క్రమంలో రోజువారీ బంగారం, వెండి ధరలను తెలుసుకుంటున్నారు
- Author : Praveen Aluthuru
Date : 22-08-2023 - 3:57 IST
Published By : Hashtagu Telugu Desk
Gold, silver price: బంగారం అంటే ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. బంగారం, వెండి కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. ఈ క్రమంలో రోజువారీ బంగారం, వెండి ధరలను తెలుసుకుంటున్నారు. ఈ రోజు మంగళవారం బంగారం, వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60 పెరిగి రూ.59,130కి చేరుకుంది. నిన్న రూ.59,070గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.54,200కి లభిస్తుంది. వెండి భారీగా లాభపడగా, కిలోకు రూ.1,200 పెరిగి రూ.74,500కి చేరుకుంది.
ఢిల్లీలో 24 క్యారెట్లు 59,220; 22K 54,300
ముంబై: 24 క్యారెట్లు 59,130; 22K 54,200
చెన్నై: 24 క్యారెట్లు 59,560; 22K 54,600
కోల్‌కతా: 24 క్యారెట్ 59,130; 22K 54,200
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. బంగారం 0.35 శాతం పెరిగి ఔన్స్‌కు 1,928.80 డాలర్లు, వెండి 0.41 శాతం పెరిగి 23.76 డాలర్లుగా ఉన్నాయి.