HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Five Tips For Your Beautiful Skin

Skin Care: మీ అందమైన చర్మం కోసం ఐదు చిట్కాలు

  • Author : Vamsi Chowdary Korata Date : 14-05-2026 - 11:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Five Tips for Your Beautiful Skin
Five Tips for Your Beautiful Skin

అందంగా, ఆరోగ్యంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు? అందంగా కనిపించాలని కొందరు బ్యూటీ పార్లర్కు వెళ్తుంటారు, మరి కొందరు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు, ఇంకా కొందరైతే స్కిన్ ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటారు. కానీ మన చర్మానికి ఏది మంచి చేస్తుందో, ఏది హాని కలిగిస్తుందో కొందరికి మాత్రమే తెలుసు. అందుకే మన hashtagu మీ కోసం, మీ అందమైన చర్మం కోసం కొన్ని టిప్స్ను మీ ముందుకు తీసుకువచ్చింది. మన చర్మానికి హాని కలిగించే ఆ అయిదు ఏమిటో తెలుసుకుందాం.

  1. సన్ లైట్

సన్ లైట్లో అనేక రేడియేషన్స్ ఉంటాయి. ఇవి చర్మం మీద పడటం వల్ల స్కిన్ మెరుపు పోయి నిర్జీవంగా తయారవుతుంది (హైపర్ పిగ్మెంటేషన్). చర్మం నలుపు రంగుకు మారడానికి కూడా ఇదొక కారణం. ఉదయం 7 గంటల లోపు సన్ లైట్లో UVA, బ్లూ లైట్స్ తక్కువగా ఉంటాయి. ఆ సమయంలోని లైట్ స్కిన్కు మంచిది. పైగా విటమిన్ డి కూడా చర్మానికి చాలా ముఖ్యం.

  1. షుగర్

షుగర్ గ్లైకేషన్ను వేగవంతం చేస్తుంది. మన చర్మాన్ని సున్నితంగా, టైట్గా ఉంచడానికి కొల్లాజెన్ ఫైబర్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఆ కొల్లాజెన్ ఫైబర్స్ బలహీనమవ్వడం వల్ల చర్మం ముడతలు పడుతుంది. దీన్నే గ్లైకేషన్ అని అంటారు. సాధారణంగా గ్లైకేషన్ వయసు మీద పడేకొద్దీ వేగవంతం అవుతుంది. కానీ వయసుతో సంబంధం లేకుండా షుగర్ గ్లైకేషన్ ప్రాసెస్ను వేగవంతం చేస్తుంది, అందుకే షుగర్ పదార్థాలకు దూరంగా ఉండాలి.

  1. పొల్యూషన్

పొల్యూషన్ కారణంగా జుట్టు మాత్రమే పోవడం కాదు, అనేక స్కిన్ సెల్స్ను డామేజ్ చేసి స్కిన్ గ్లోను తగ్గిస్తుంది. అందుకే సిటీల్లో ఉండే వాళ్లు పొల్యూషన్ నుండి తమ చర్మాన్ని కాపాడుకునేందుకు అనేక జాగ్రత్తలు పాటించాలి.

  1. స్ట్రెస్

స్ట్రెస్ కారణంగా జుట్టు రాలిపోతుందని మనందరికీ తెలుసు. స్ట్రెస్ కారణంగా కార్టిసోల్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ వల్ల

చర్మంపై పింపుల్స్, డార్క్ సర్కిల్స్ రావడం, జుట్టు రాలిపోవడం జరుగుతుంది. చర్మం కూడా ముడతలు పడుతుంది. రోజు 20 నిమిషాల వరకు ధ్యానం, వ్యాయామం చేయడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది.

  1. స్మోకింగ్ (ధూమపానం)

మీకు ఆరోగ్యమైన చర్మం కావాలంటే పొగాకుకు దూరంగా ఉండాలి. స్మోకింగ్ వల్ల కూడా కొల్లాజెన్ ఫైబర్స్ దెబ్బతింటాయి, ఫలితంగా డార్క్ సర్కిల్స్, చర్మం ముడతలు పడి వయసు ఎక్కువగా కనిపిస్తుంది.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Best Skin Care Tips
  • Life Style
  • oil skin care
  • Sensitive Skin Care
  • skin care

Related News

Does eating boiled eggs prevent heart problems?

Eggs Benefits: ఉడికించిన కోడిగుడ్లు తింటే గుండె సమస్యలు రావా..?

దాదాపు అందరూ గుడ్లను ఇష్టపడతారు. ఇవి రుచికరమైనవి మాత్రమే కాదు, పూర్తి పోషకాహారం కూడా. గుడ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు (మినరల్స్) వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. గుడ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు (Egg Benefits) ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. గుడ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు గుడ్లలో ఉండే ప్రోటీన్ కండరాలను నిర్మి

    Latest News

    • Importance of Marriage: పెళ్లికి ఆ మూడు రుణాలతో సంబంధం తెలుసా?

    • PM Modi: జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేయబోతున్న ప్రధాని మోడీ.

    • DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప‍్రమాణం

    • CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

    • Khushboo: సీఎం విజయ్‌ని కలిసి కూతురి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన ఖుష్బూ దంపతులు

    Trending News

      • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd