HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Essential Vegetables For A Healthy Pregnancy Diet

‎Pregnancy Diet: తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్రెగ్నెన్సీ టైంలో వీటిని తప్పకుండా తినాల్సిందే!

‎Pregnancy Diet: ప్రెగ్నెన్సీ సమయంలో మన డైట్ లో కొన్ని రకాల కాయగూరలు చేర్చుకోవడం వల్ల తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని పుట్టే బిడ్డ కూడా చాలా అందంగా, ఆరోగ్యంగా పుడుతుందని చెబుతున్నారు.

  • Author : Anshu Date : 16-10-2025 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pregnancy Diet
Pregnancy Diet

Pregnancy Diet: స్త్రీల గర్భవతిగా ఉన్నప్పుడు తప్పకుండా కొన్ని రకాల విషయాలను పాటించాలని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా తీసుకునే ఆహారం విషయంలో తప్పకుండా జాగ్రత్త అవసరం అని చెబుతున్నారు. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో ఇవి తినకూడదు, అవి తినకూడదని పెద్దలు ఎన్నో ఆంక్షలు విధిస్తుంటారు. కానీ ఈ సమయంలో కడుపులో ఉన్న బిడ్డా, తల్లీ ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం కొన్ని కూరగాయల్ని ఖచ్చితంగా తినాలట. ప్రెగ్నెన్సీ సమయంలో మంచి పోషకాహారాన్ని తినడం చాలా అవసరమని, ఎందుకంటే పోషకాలతోనే కడుపులో బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుందని చెబుతున్నారు. అందుకే గర్భిణులు రోజూ తినే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఇది గర్భిణీ స్త్రీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు.
‎
‎ఆకుపచ్చని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట. ముఖ్యంగా గర్భిణులకు చాలా మంచిదని చెబుతున్నారు. కూరగాయల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఇ, కాల్షియం, ఫైబర్, ఫోలెట్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తల్లీ, బిడ్డ ఇద్దరినీ ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయట. ముఖ్యంగా ఈ పోషకాలు పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి సహాయపడతాయని చెబుతున్నారు. చిలగడదుంపలను ప్రెగ్నెన్సీ సమయంలో ఖచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి వంటి పోషకాలు మెండుగా ఉంటాయట. ఇవి తల్లికి అవసరమైన శక్తిని అందిస్తాయట.
‎
‎అలాగే కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి కూడా సహాయపడతాయని చెబుతున్నారు. ఈ చిలగడదుంపలో ఉండే ఫోలెట్ శిశువు మెదడు అభివృద్ధికి సహాయపడుతుందట. అలాగే పుట్టుకతో వచ్చే లోపాలను నివారించేందుకు తోడ్పడుతుందని దీనిలో ఉండే బీటా కెరోటిన్ శరీరంలో విటమిన్ ఎ గా మారి శిశువు కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుందని చెబుతున్నారు. బీట్‌రూట్‌లో కూడా పోషకాలు మెండుగా ఉంటాయి. దీనిలో ఉండే విటమిన్లు, ఫైబర్ లు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయట. బీట్ రూట్ లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ ను పెంచుతుందట. అలాగే అనిమియా వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని, దీనిలో ఉండే ఫోలెట్ శిశువు మెడదు, స్పైనల్ కార్డ్ అభివృద్ధికి సహాయపడుతుందని చెబుతున్నారు.
‎అంతేకాదు దీనిలో ఉండే నైట్రేట్ గర్భిణులకు హైబీపీని తగ్గిస్తుందట.
‎
‎బీట్ రూట్ ను తింటే రక్తం శుద్ధి అవుతుందట. ట్యాక్సిన్స్ బయటకు పోతాయని, దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ గర్భిణులకు మలబద్దకం సమస్య నుంచి బయటపడేస్తుందని చెప్తున్నారు. క్యాప్సికం కూడా గర్భిణుల ఆరోగ్యానికి చాలా మంచిదట. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యవస్థను సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుందట. ఇది మలబద్దకం సమస్యను తగ్గించడానికి కూడా సహాయపడుతుందని, దీనిలో ఉండే విటమిన్ విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. ‎అలాగే శరీరంలో ఐరన్ శోషణకు సహాయపడుతుందట. అలాగే ఫోలెట్ శిశువు మెదడు, నరాల వ్యవస్థ అభివృద్ధికి సహాయపడుతుందట. ఈ కూరగాయలో ఉండే ఐరన్, పొటాషియం, కాల్షియం ఎముకల్ని బలంగా ఉంచడానికి శిశువు ఎదుగుదలకు తోడ్పడుతాయని, రక్తహీనత సమస్య కూడా తగ్గితుందని చెబుతున్నారు. అలాగే బ్రోకలీ కూడా గర్భిణులకు చాలా మంచిదట. దీనిలో విటమిన్ సి, విటమిన్ కె, ఫోలెట్ వంటి ఎన్నో రకాల పోషకాలు మెండుగా ఉంటాయని ఇవి తల్లీ, బిడ్డను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • beetroot
  • calcium
  • Capsicum
  • health tips
  • Immunity
  • Iron
  • potassium
  • Pregnancy Diet
  • pregnant lady
  • vegatables

Related News

Guava vs. Avocado.. Which is better for health..?

జామ వర్సెస్ అవాకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..?.. రెండింటిలో ఏది బెస్ట్..?

100 గ్రాముల జామకాయలో సుమారు 68 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో విటమిన్ C అధికంగా ఉండటంతో పాటు ఫైబర్, ఫోలేట్, పొటాషియం, లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి.

  • How do you make lemon water? What are the benefits of it?

    నిమ్మకాయ నీరు ఎలా తయారు చేస్తారు?..వీటితో వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

  • These are the amazing benefits of eating sprouts daily..!

    ఆరోగ్యానికి శక్తినిచ్చే మొలకలు: రోజూ తీసుకుంటే క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఇవే..!

  • Nuts And Seeds, specialty of nuts, Brain, digestion, Long term health benefits, Immunity, Fats, carbohydrates, proteins, vitamins, minerals

    గింజలతో సంపూర్ణ ఆరోగ్యం..రోజువారీ ఆహారంలో ఇవి తప్పనిసరి..!

  • What are the benefits of eating sapota fruit? Who should not eat it?

    సపోటా పండు తినటం వల్ల ఉపయోగం ఏమిటి?..ఎవరు తినకూడదు?

Latest News

  • చెవిరెడ్డి భాస్కర్‌ కు భారీ ఊరట ! 226 రోజుల తర్వాత బెయిల్‌

  • ఒక్కసారిగా పడిపోయిన హెరిటేజ్ షేర్లు.. చంద్రబాబు సతీమణికి రూ. 80 కోట్లకుపైగా లాస్!

  • మేడారం భక్తులకు శుభవార్త..మగవారికి ఉచిత బస్సు ప్రయాణం

  • ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు..

  • Big Breaking News..కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు

Trending News

    • పంజాబ్ సరిహద్దుల్లో భారీ కుట్ర భగ్నం.. 43 కిలోల హెరాయిన్, గన్, బులెట్లు, గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్న విలేజ్ డిఫెన్స్ కమిటీ

    • అజిత్ పవార్‌ విమానం కూలిపోయే ముందు కాక్‌పిట్ నుంచి గుండెలు పిండేసే ఆఖరి మాటలివే!

    • అజిత్ పవార్ విమాన ప్రమాదానికి ముందు పైలట్ తన అమ్మమ్మకు పంపిన చివరి మెసేజ్ ఇదే !

    • స్మార్ట్‌ఫోన్ యూజర్లు జాగ్రత్త.. బయటకు వెళ్లేటప్పుడు వై-ఫై ఆన్ చేసి ఉంచుతున్నారా?

    • కేంద్ర బ‌డ్జెట్ 2026.. యువ‌త‌కు రూ. 7 వేల వ‌ర‌కు స్టైపెండ్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd