HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Do You Know The History Of Apple

Apple: ఆపిల్ చరిత్ర మీకు తెలుసా?

  • Author : Vamsi Chowdary Korata Date : 02-05-2026 - 9:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Apple
Apple

ఆపిల్ పండు అంటే ఎర్రగా, దోరగా, నునుపుగా చూస్తేనే కసుక్కున కొరికేయాలన్నంత అందంగా ఉంటుంది. అందుకే ఎవరైనా చిన్నపిల్లలు అందంగా ఉంటే.. ఆపిల్ పండులా ఉన్నావే అంటుంటారు. కానీ అలాంటి ఆపిల్కు తొలుత ఈ రంగు కానీ, రుచి కానీ, ఆకారం కానీ ఉండేవి కావట. పైగా వాటి పుట్టినిల్లు కూడా ఏ అమెరికానో, బ్రిటనో కాదు. వాటి నిజమైన పుట్టిల్లు కజకిస్తాన్లోని తియాన్ షెన్ కొండలు. కెనడా శాస్త్రవేత్తల పరిశోధనలో ఇలాంటి నిజాలు చాలా వెలుగుచూశాయి. ఆపిల్ పుట్టిల్లు గురించి తెలిస్తే.. అక్కడ ఆ పండ్లు తొలుత ఎలా ఉండేవి.. ఎలా పండేవి అన్న ప్రశ్నలు ఒకదాని వెంట మరొకటి వచ్చేస్తాయి. నిజం చెప్పాలంటే ఆపిల్ పుట్టిన తొలినాళ్లలో చిన్న సైజులో ఉండేది. పైగా ఇప్పటిలా తియ్యగా కానీ, పుల్లగా కానీ ఉండేది కాదు. బాగా చేదుగా ఉండేది. అప్పటి నుంచి వేల సంవత్సరాలపాటు దాని సాగులో చాలా పద్ధతులు మార్చి చూశారు. ఆ పండు ఆకారం, రుచి, రంగు, వాసన.. ఇలాంటి వాటన్నింటిలోనూ చాలా ప్రయోగాలు చేశారు. దానివల్లే ఇప్పుడున్న ఆపిల్ తయారైంది.

కజకిస్తాన్లోని అతి పెద్ద నగరం ఏది అంటే.. అల్మాటీ అని చెబుతాను. దాని పేరు నుంచే యాపిల్కు ఆ పేరు వచ్చింది. అల్మాటీ అంటే కజక్ భాషలో యాపిల్ కొండ అనే అర్థం ఉంది. ఇక యాపిల్ చరిత్ర ఎప్పుడు మొదలైందీ అంటే.. లాంగ్ లాంగ్ ఎగో అని చెప్పాలి. అంటే గత ఐదువేల ఏళ్ల కిందటి నుంచి ఇది సాగులో ఉంది. అప్పట్లో దీని విత్తనాలు ఆసియాకు సరఫరా అయ్యింది సిల్క్ రూటు ద్వారానే. ఆ తరువాత ప్రపంచమంతటికీ చేరాయి. అప్పట్లో ఈ పండ్లు చేదుగా ఉండేవి. కజకిస్తాన్ కొండల్లో యాపిల్ చెట్లు చాలా సహజంగా పెరుగుతాయి. వాటికి అక్కడున్న వాతావరణం కరెక్టుగా సరిపోతుంది. కాకపోతే ఆ పండ్లు చిన్నవిగా, చేదుగా, ఇంకా చెప్పాలంటే ఆమ్ల స్వభావంతో ఉంటాయి.

అడవి జాతి ఆపిల్స్తో పోల్చి చూస్తే.. ఇప్పుడున్న ఆపిల్స్ బరువు 3.6 రెట్లు ఎక్కువ. ఆమ్లత్వం కూడా 43 శాతం తక్కువ ఉంటుంది. చేదు గుణానికి కారణంగా చెప్పే ఫినోలిక్ కాంపౌండ్ కూడా 68 శాతం తగ్గిపోయింది. పైగా గత రెండు శతాబ్దాల్లో టెక్నాలజీని ఉపయోగించి ఆపిల్లో కొత్త రకాలను తయారుచేశారు. ఎక్కువ కాలం నిలువ ఉండేలా, తీపి శాతం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి అడవి జాతి ఆపిల్స్కు, ఇప్పుడున్న ఆపిల్స్కు అసలు ఎందులోనూ పోలిక లేదు. బహుశా వీటి ఆకారం, రుచి, రంగు.. ఇలా లేకపోతే.. ఆపిల్ను ఎవరూ ఇష్టపడేవారు కాదేమో!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • apple
  • Apple Fruit
  • best health benefits
  • unknown facts

Related News

Boys should not eat these foods—if they do, they're in for serious trouble!

Men Food: అబ్బాయిలు ఈ ఆహార పదార్థాలు తినకూడదు.. తింటే ఇక అంతే సంగతులు!

మనిషి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి అంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవాలి. మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే మనం తెలిసి తెలియక కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటాం. అందులో ముఖ్యంగా మగవారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. మరి ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సోయాబీన్స్‌లో ఉండే ఫైటో ఈస్ట్రోజెన్లు ప్రాథమిక

  • Excessive intake of Vitamin D is dangerous.

    Vitamin D: విటమిన్ డి ఎక్కువగా తీసుకుంటే ప్రమాదం

Latest News

  • Breaking News: హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

  • White Bedsheets: హోటల్స్‌లో వైట్ కలర్ బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ ఎందుకు వాడతారో మీకు తెలుసా?

  • Hormone: బెల్లీ ఫ్యాట్ పెరుగుతుందంటే ఈ హార్మోన్ ఎక్కువగా ఉన్నట్లే..!

  • LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

  • Andhra Pradesh: పెన్షన్ల కోసం వేచి చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్..

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd