HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Do Eggs Cause Cancer What Is The Sensational Statement Made By Fssai

గుడ్లు క్యాన్సర్​కు కారణమవుతాయా? ..FSSAI చేసిన సంచలన ప్రకటన ఏంటి?

కొన్ని బ్రాండ్ల గుడ్లలో క్యాన్సర్‌కు కారణమయ్యే నిషేధిత యాంటీబయాటిక్ అయిన నైట్రోఫ్యూరాన్ ఆనవాళ్లు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

  • Author : Latha Suma Date : 26-12-2025 - 4:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Do eggs cause cancer? ..What is the sensational statement made by FSSAI?
Do eggs cause cancer? ..What is the sensational statement made by FSSAI?

. గుడ్లు పూర్తిగా సురక్షితమే: FSSAI స్పష్టం

. గుడ్ల పోషక విలువలు ఎంతో ముఖ్యమైనవి

. నిపుణుల మాట..పుకార్లకు భయపడొద్దు

Eggs : ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఆహార పదార్థాలపై అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. వ్యూస్, లైక్స్ కోసం కొందరు ఆధారాలు లేని అంశాలను అతిశయోక్తిగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా రోజూ మనం తీసుకునే ఆహారాలపై భయాన్ని కలిగించేలా కంటెంట్ తయారు చేస్తున్నారు. ఇదే కోవలో ఇటీవల గుడ్ల గురించి కూడా కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని బ్రాండ్ల గుడ్లలో క్యాన్సర్‌కు కారణమయ్యే నిషేధిత యాంటీబయాటిక్ అయిన నైట్రోఫ్యూరాన్ ఆనవాళ్లు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై ప్రజల్లో అనవసర ఆందోళన ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (FSSAI) స్పష్టత ఇచ్చింది.

దేశవ్యాప్తంగా అమ్ముడయ్యే గుడ్లు తినడానికి పూర్తిగా సురక్షితమని FSSAI తేల్చి చెప్పింది. గుడ్లు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం లేదని స్పష్టంగా పేర్కొంది. సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు ప్రజలను తప్పుదారి పట్టించేవని, వాటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని వెల్లడించింది. FSSAI మార్గదర్శకాల ప్రకారం పౌల్ట్రీ రంగంలో నైట్రోఫ్యూరాన్ వంటి యాంటీబయాటిక్స్ వాడకం చాలా ఏళ్ల క్రితమే నిషేధించారు. అరుదైన సందర్భాల్లో అత్యంత స్వల్ప ఆనవాళ్లు బయటపడినా, అవి అన్ని గుడ్లకు వర్తించవని సంస్థ తెలిపింది. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం ఇంత తక్కువ మోతాదు వల్ల క్యాన్సర్ లేదా ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేదని స్పష్టం చేసింది.

గుడ్లు అనేవి పోషకాల గనిగా పరిగణించబడతాయి. ఇందులో అధిక నాణ్యత గల ప్రోటీన్‌తో పాటు విటమిన్ A, B12, D, E వంటి కీలక విటమిన్లు ఉంటాయి. అలాగే ఐరన్, జింక్, సెలీనియం, కోలిన్ వంటి మినరల్స్ శరీరానికి ఎంతో అవసరం. గుడ్లు కండరాల బలానికి సహాయపడతాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఎముకలను దృఢంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచి అనేక వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడతాయి. సాధారణంగా రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు తినడం చాలా మంది ఆరోగ్యవంతులకు ప్రయోజనకరంగా ఉంటుందని పోషక నిపుణులు చెబుతున్నారు. పుకార్లకు భయపడొద్దు సీనియర్ డైటీషియన్ మాట్లాడుతూ గుడ్డు సంపూర్ణ ప్రోటీన్‌కు అద్భుతమైన మూలమని తెలిపారు. ఇది కండరాల నిర్మాణానికి, మెదడు అభివృద్ధికి, కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వివరించారు. FSSAI నివేదికతో గుడ్లపై వస్తున్న పుకార్లు పూర్తిగా తప్పని తేలిపోయిందన్నారు. రోజూ గుడ్లు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం లేదని స్పష్టం చేశారు. గుడ్లలో ఉండే కోలిన్ మెదడు పనితీరుకు, కాలేయ ఆరోగ్యానికి అత్యంత అవసరమని చెప్పారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలకు గుడ్లు చాలా ప్రయోజనకరమని తెలిపారు. ఆధారాలు లేని సోషల్ మీడియా ప్రచారాలను నమ్మి భయపడాల్సిన అవసరం లేదని, సరైన సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని నిపుణులు సూచిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cancer risk
  • Egg Myths
  • eggs
  • Eggs And Cancer Risk
  • Eggs Increase Cancer Risk
  • Fact Check
  • fssai
  • Health News
  • viral news

Related News

Leech Therapy

జలగ చికిత్స.. క్యాన్సర్‌ను నయం చేయగలదా?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. లీచ్ థెరపీ క్యాన్సర్‌కు పూర్తి చికిత్స కాదు. అయితే క్యాన్సర్ లక్షణాల నుండి ఉపశమనం పొందడానికి దీనిని ఉపయోగించవచ్చు.

  • New Tax Rules

    ఏప్రిల్ 1 నుండి మీ ఫోన్, సోషల్ మీడియాపై నిఘా? వైరల్ వార్తలో నిజమెంత?

  • Blue Turmeric

    ప్రియాంక గాంధీ చెప్పిన నీలి ప‌సుపు అంటే ఏమిటి? ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉంటాయా?

  • Garlic Water

    వెల్లుల్లి నీరు క్యాన్సర్‌ను నివారిస్తుందా?!

Latest News

  • బిజినెస్ రంగంలో అదానీ దూకుడు , మూడేళ్లలో 33 కంపెనీలు కొనుగోలు

  • చరణ్ – సుకుమార్ సినిమాలో హీరోయిన్ ఆమెనేనా..?

  • పచ్చి ఉల్లిపాయలను భోజనంతో తీసుకోవడం వల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు తెలుసుకుందామా?

  • అమరావతిలో మరో కీలక అధ్యాయం.. హైకోర్టు శాశ్వత భవన పనులకు శ్రీకారం

  • 2025లో అత్యధికంగా అమ్ముడైన కారు ఏదో తెలుసా?

Trending News

    • ఊడిపోయిన జుట్టును అమ్ముతున్నారా? తస్మాత్ జాగ్రత్త!

    • సచిన్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ.. మరో 3 సెంచరీలు చేస్తే చరిత్రే!

    • 2025లో బంగారం, వెండి ధరల జోరు.. కొత్త సంవ‌త్స‌రంలో ఎలా ఉండ‌బోతుంది?!

    • శ్రేయస్ అయ్యర్ గాయంపై బిగ్ అప్‌డేట్.. త్వరలోనే జ‌ట్టులోకి పునరాగమనం?

    • విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్, విరాట్ సెంచరీలు.. ప్రత్యక్ష ప్రసారం ఎందుకు లేదు?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd