Curry Leaves: కరివేపాకుతో ఇలా చేస్తే చాలు మీ జుట్టు ఒత్తుగా నల్లగా పెరగాల్సిందే?
- By Sailaja Reddy Published Date - 12:30 PM, Sun - 18 February 24

కరివేపాకు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ కరివేపాకు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో కరివేపాకు ఎంతో ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. జుట్టు రాలడం తగ్గించి ఎదుటి నల్లగా మార్చడంతో పాటు గుబురుగా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. మరి అయితే శిరోజ సంరక్షణకు కరివేపాకును ఎలా వాడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తాజా కరివేపాకును కొబ్బరి నూనె ఒక గిన్నెలో తీసుకోవాలి.
రెండింటిని కలిపి నలుపు రంగు మిశ్రమం వచ్చేవరకు మరిగించాలి. చల్లబరిచి జుట్టుకుదురులకు పట్టించాలి. ఒక గంట సేపు ఇలా ఉంచాలి. అనంతరం తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చొప్పున 15 నుంచి నెల రోజుల పాటు ఇది వాడితే మంచి ఫలితం కనిపిస్తోంది. ఈ మిశ్రమం జుట్టు త్వరగా తెల్లబడడం లేకుండా చేస్తుంది.అలాగే ఒక ఎయిర్ మాస్క్ కూడా చూద్దాం. దీనికోసం కొద్దిగా కరివేపాకు ఆకులను తీసుకొని వాటిని మెత్తని పేస్టులా తయారు చేసుకోవాలి. దీన్ని గడ్డ పెరుగుతో కలిపి జుట్టుకు కట్టించాలి. 20 నుంచి 25 నిమిషాల పాటు అలా వదిలేయాలి.
తరువాత తల స్నానం చేయాలి. వారానికి ఒకసారి ఈ విధంగా చేస్తే వెంట్రుకల పెరుగుదలలో ఆశించిన స్థాయిలో ఫలితం కనిపిస్తోంది. కరివేపాకు టీ. నీటిలో కరివేపాకు ఆకులను మరిగించి ఆ రసానికి నిమ్మరసం చక్కెర కలపాలి. దీన్ని రోజు వారం పాటు తాగాలి. ఇదే శిరోజాల అభివృద్ధిని పెంచుతుంది. ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విధంగా మీరు కూడా కరివేపాకును ఇలా ఉపయోగిస్తూ మీ జుట్టు రాలకుండా నల్లగా, దృఢంగా ఉండేలా చూసుకోండి.