HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Coconut Oil Can Also Be Used Like This

Coconut Oil: కొబ్బరి నూనెని ఇలా కూడా వాడోచ్చు..

కొబ్బరి నూనె అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ కొబ్బరినూనెలో ఎన్నో ప్రత్యేక గుణాలు ఉంటాయి.

  • Author : Maheswara Rao Nadella Date : 01-12-2022 - 7:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Coconut Oil For Constipation
Coconut Oil For Constipation

కొబ్బరి నూనె అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ కొబ్బరినూనెలో ఎన్నో ప్రత్యేక గుణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఎన్నో లాభాలను అందిస్తాయి. చర్మాన్ని తాజాగా, హైడ్రేటెడ్‌గా ఉంచడంలో కొబ్బరినూనె బాగా పనిచేస్తుంది. మాయిశ్చరైజర్స్ రాక ముందు అందరూ దీనినే వాడేవారు. అప్పట్నుంచి ఇప్పటివరకూ కొబ్బరి నూనెని రకరకాలుగా వాడడం మనకి అలవాటుగా మారింది. దీన్ని వాడడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దా౦.

డీప్ కండీషన్:

గోరువెచ్చని కొబ్బరినూనెని షాంపూ చేసే ముందు రాసి మసాజ్ చేయడం మంచిది. ఇది మీ జుట్టు పొడి బారడం, చివర్లు చిట్లడం, ఎండవల్ల కలిగే ఇబ్బందులని దూరం చేస్తుంది.

బాడీ మాయిశ్చరైజర్:

కొబ్బరినూనె స్కిన్ హైడ్రేట్, మాయిశ్చర్‌గా ఉంచేందుకు వాడొచ్చు. దీని వాడడం వల్ల చర్మం పొడిబారే సమస్య తగ్గుతుంది. అయితే కొంతమంది దీనిని ముఖానికి వాడతారు. ఇది రికమండెడ్ కాదని చెబుతున్నారు నిపుణులు. కొంతమంది చర్మతత్వానికి ఇది పడకపోవచ్చు.

మేకప్ రిమూవర్:

కొబ్బరినూనెని మేకప్ తీసేయడానికి వాడొచ్చు. ఇందులోని ఇంప్యూరిటీస్ మేకప్ పార్టికల్స్‌ని చర్మం నుంచి తీసేస్తాయి. అదే విధంగా చర్మంపై ఓ లేయర్‌ని ఏర్పరుస్తాయి.

జుట్టు పొడిబారడం:

చాలా మంది జుట్టు పొడిబారి నిర్జీవంగా మారుతుంది. అలాంటి సమస్యకి కొబ్బరి నూనె చక్కని పరిష్కారం చూపుతుంది. 3 నుంచి 5 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెలో 15 నుంచి 20 చుక్కల రోజ్‌మేరీ ఆయిల్ వేయాలి. దీనిని బాగా మిక్స్ చేసి స్కాల్ప్, హెయిర్ రూట్స్‌కి బాగా అప్లై చేసి మసాజ్ చేయండి. షవర్ క్యాప్ పెట్టుకోండి. ఓ గంట తర్వాత మైల్డ్ షాంపూ చేయండి. ఇది జుట్టుని పట్టుకుచ్చులా మారుస్తుందని డా గితిక మిట్టల్ గుప్తా, ఆస్తేటిక్ ఫిజిషియన్, ఎమ్‌డి ఇసాక్ లుక్సె చెబుతున్నారు.

ఫ్రిజినెస్ దూరం:

కొన్ని సార్లు జుట్టు ఫ్రీజీగా మారుతుంది. చూడ్డానికి అస్సలు బాగోదు. అలాంటి టైమ్‌లో కొద్దిగా కొబ్బరి నూనెని అరచేతుల్లో వేసి బాగా రబ్ చేసి ఫ్రిజీగా ఉన్న జుట్టుకి మసాజ్ చేస్తే బలంగా మారతాయి.

బాడీ స్క్రబ్:

కొబ్బరినూనెని బాడీ స్క్రబ్‌లా కూడా వాడొచ్చు. ఇందుకోసం మీ స్క్రబ్‌లో కొద్దిగా కొబ్బరినూనెని చేర్చి బాగా కలిపి స్క్రబ్ చేయండి. దీంతో స్క్రబ్ వల్ల వచ్చే ఇరిటేషన్ వంటి సమస్యలు ఉండవు.

చుండ్రు దూరం:

కొబ్బరిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి జుట్టులోని చుండ్రుని దూరం చేసేందుకు సాయపడతాయి.

షేవింగ్‌కి ముందు, తర్వాత:

చాలా మంది షేవింగ్ చేస్తుంటారు. అప్పుడు ముందు తర్వాత కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని అప్లై చేయడం వల్ల చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. అయితే ముందు రాసేటప్పుడు మరీ ఎక్కువగా రాయకూడదు. చర్మం జారి ప్రమాదం జరిగే అవకాశం ఉందని గుర్తుపెట్టుకోండి.

లిప్ స్క్రబ్:

చాలా మంది పెదాలు పగిలి నిర్జీవంగా కనిపిస్తాయి. అలాంటప్పుడు కొబ్బరినూనెని స్క్రబ్‌లా పెదాలపై రాయొచ్చు. దీని వల్ల మీ పెదాలు సాఫ్ట్‌గా తేనెలూరినట్లుగా ఉంటాయి. దీనిని రెగ్యులర్‌గా రాస్తుంటే లిప్‌బామ్ కూడా అవసరం లేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • coconut oil
  • health
  • health benefits
  • Life Style

Related News

Don't worry about low sperm count... follow these Ayurvedic tips and you'll be at the peak of virility...!!

Sperm Count In Men: స్పెర్మ్ కౌంట్ తగ్గిందని బాధపడకండి… ఆయుర్వేదంలో ఈ చిట్కాలు పాటిస్తే మీరే మగమహారాజు…!!

ఇటీవలి కాలంలో చాలా మంది పురుషులు స్పెర్మ్ లోపం సమస్యను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా మగ వంధ్యత్వం, సంతానం లేకపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. మారిన జీవనశైలి, ఒత్తిడితో కూడిన జీవితం కారణంగా పురుషులలో స్పెర్మ్ లోపం సమస్య కనిపిస్తుంది. దీని వల్ల జీవితంలో ఒడిదుడుకులు రావడం సహజం. కానీ పురుషుల్లో వచ్చే ఈ స్పెర్మ్ లోపానికి హోమ్ రెమెడీస్‌తో పరిష్కారం దొరుకుతుందని వైద్యులు చెబుత

  • If belly fat is increasing, it means this hormone is high!

    Hormone: బెల్లీ ఫ్యాట్ పెరుగుతుందంటే ఈ హార్మోన్ ఎక్కువగా ఉన్నట్లే..!

  • Do you have a habit of drinking alcohol? If so, be careful with its consumption...!!

    Alcohol: మీకు ఆల్కహాల్ తాగే అలవాటు ఉందా..? అయితే వీటి వినియోగంలో జాగ్రత్త…!!

  • With which substances does performing *Abhishekam* to Neelakantha yield results?

    Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

Latest News

  • Spirituality: లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో మీకు తెలుసా?

  • ప్రాణం తీసిన కొబ్బరి బొండం

  • Relationship: శృంగారం చేసిన తర్వాత పురుషులు ఏమనుకుంటారో తెలుసా?

  • Owaisi college: ఒవైసీ విద్యాసంస్థపై హైకోర్టు సీరియస్!

  • Prakash Raj: రావణ్ మళ్ళీ మళ్ళీ అరెస్ట్ పై ప్రకాష్ రాజ్ ఫైర్

Trending News

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd