HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Best Facepack Tips In Summer Season

Summer Face Pack: సమ్మర్ లో ఈ ఫేస్ ప్యాక్స్ తో…ముఖం అందంగా మారడం ఖాయం..!!!

వేసవికాలం వచ్చేసింది. ఈ కాలంలో ముఖాన్ని కాపాడుకునేందుకు చేయని ప్రయత్నాలంటూ ఉండవు. రకరకాల సౌందర్య ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కానీ ఈ ఉత్పత్తుల ప్రభావం తరచుగా వేసవి వేడిని అధిగమించలేవు.

  • Author : Dinesh Akula Date : 27-03-2022 - 4:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
face serum
face serum

వేసవికాలం వచ్చేసింది. ఈ కాలంలో ముఖాన్ని కాపాడుకునేందుకు చేయని ప్రయత్నాలంటూ ఉండవు. రకరకాల సౌందర్య ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కానీ ఈ ఉత్పత్తుల ప్రభావం తరచుగా వేసవి వేడిని అధిగమించలేవు. కొంత సమయం తర్వాత ముఖం పేలగా మారుతుంది. అయితే కీర, గంధ, కలబంద, రోజ్ వాటర్, పుచ్చకాయ, బంగాళాదుంప వంటి సహజ పదార్థాలతో మీ ఇంట్లో ఈజీగా ఫేస్ ప్యాక్ ను రెడీ చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ తో ముఖం చల్లగా, తాజాగా ఉండటమే కాదు…ముఖాన్ని మరింత అందంగా మార్చేస్తుంది.

సమ్మర్ లో కొందరు వ్యక్తులు ఆహారంలో చల్లటి పదార్థాలను చేర్చుతుంటారు. ముఖంపై ఐస్ క్యూబ్స్ తో మర్దన చేస్తుంటారు. ముఖాన్ని చల్లగా ఉంచేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే వాటి ప్రభావం ముఖంపై కొంత సమయం వరకే ఉంటుంది. తర్వాత మళ్లీ మామూలుగా మారడం ప్రారంభిస్తుంది. అందుకే కొన్ని నేచరల్ ఫేస్ ప్యాక్స్ ను తయారు చేయడం వల్ల కలిగే మార్గాలు, వాటి ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కలబంద, దోసకాయ ఫేస్ ప్యాక్..
దోసకాయలో విటమిన్ సి, విటమిన్ ఎ, యాంటీ -ఆక్సిడెంట్ ఏజెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మృత చర్మ కణాలను తొలగించి..ముఖాన్ని తాజాగా మెరిసేలా చేస్తాయి. కలబంద యాంటీ ఏజింగ్, యాంటీ బాక్టీరియల్ ఎలిమెంట్స్ తో కూడిన మచ్చలు, ముడతలను తగ్గిండం ద్వారా ముఖాన్ని తేమగా ఉంచేలా పనిచేస్తుంది.
ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి 1 తురిమిన కీరదోసకాయలో 1 టీస్పూప్ కలబంద జెల్ మిక్స్ చేయాలి. ఇప్పుడీ పేస్టును ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో ముఖాన్ని కడగాలి.

బంగాళదుంప ఫేస్ ప్యాక్…
సమ్మర్ లో ముఖాన్ని చల్లగా ఉంచడంతోపాటు…బంగాళదుంపలు..ముఖంలోని మచ్చలను తొలగిస్తాయి. ముఖాన్ని మెరిసేలా చేయడంలో సమర్ధవంతంగా ఈ ప్యాక్ పనిచేస్తుంది. దీనికోసం బంగాళాదుంప రసంలోపచ్చిపాలు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ పేస్టును ముఖంపై, మెడపై అప్లే చేయాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో కడుగాలి. ఈ ఫేస్ ప్యాక్ వారానికి 3సార్లు ఉపయోగించవచ్చు.

రోజ్ వాటర్, గంధం ఫేస్ ప్యాక్…
ఎండాకాలంలో ముఖాన్ని చల్లగా ఉంచడంలో చందనం బాగా పనిచేస్తుంది. గంధాన్ని రోజ్ వాటర్ లో కలిపి రాసుకున్నట్లయితే ముఖం మెరిసిపోతుంది. గంధపు ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి 1 టీస్పూప్ గంధపు పొడికి 1 టీ స్పూన్ గులాబీని కలిపి పేస్టులా చేయండి. ఈ ఫేస్ ప్యాక్ కు ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు ఉంచి తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడగాలి.

పుచ్చకాయ ఫేస్ ప్యాక్…
పుచ్చకాయలో అధిక శాతం నీరే ఉంటుంది. చర్మంలోని అదనపు నూనెను గ్రహించడంతో రంధ్రాలు గట్టిగా ఉంచడంలోనూ సహాయపడుతుంది. దీనికోసం పుచ్చకాయ ముక్కను మెత్తగా చేసి ముఖానికి పట్టించి 20నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • face pack
  • health tips
  • summer tips

Related News

Diabetes

Diabetes: ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి? శరీరంలో వచ్చే మార్పులు ఇవే…

మన దేశంలో డయాబెటిస్ అనేది చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా డయాబెటిస్ చిన్న వయస్సు నుంచే ప్రారంభం అవుతోంది. అయితే డయాబెటిస్ వచ్చే ముందు ఒక దశ ఉంటుంది. దాన్నే ప్రీడయాబెటిస్ లేదా బోర్డర్‌లైన్ డయాబెటిస్ అంటారు. అంటే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతూ ఉందని అర్థం. ఇది టైప్ 2 డయాబెటిస్‌గా మారే అవకాశం ఉంది. జీవనశైలిలో మార్పులు లేకుండా, ప్రీ డయాబెటిస్ ఉన్నవారిలో టైప్ 2 డయా

  • Identify Autism This Way!

    Autism: ఆటిజం వ్యాధిని ఇలా గుర్తించండి!

  • Can diabetic patients eat watermelon?

    Watermelon : డయాబెటిక్ పేషెంట్లు పుచ్చకాయ తినవచ్చా?

Latest News

  • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

  • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

  • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

  • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

  • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd