Morning Key Works : ఉదయాన్నే లేచి ఈ పని చేయడం లేదా? ఐతే మీ ప్రాణాలను రిస్క్ లో పెట్టినట్టే?
Morning key Works : ఒకప్పుడు మన పూర్వీకులు ఉదయాన్నే లేచి వ్యవసాయ పనులు, ఇతర కఠినమైన శారీరక శ్రమ చేసేవారు. దానివల్ల వారికి ఎంతో శారీరక శక్తి, మానసిక ఉల్లాసం లభించేవి.
- By Kavya Krishna Published Date - 09:41 PM, Wed - 13 August 25

Morning key Works : ఒకప్పుడు మన పూర్వీకులు ఉదయాన్నే లేచి వ్యవసాయ పనులు, ఇతర కఠినమైన శారీరక శ్రమ చేసేవారు. దానివల్ల వారికి ఎంతో శారీరక శక్తి, మానసిక ఉల్లాసం లభించేవి. కానీ నేటి కాలంలో ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. లేవగానే ఫోన్ లో తలపెట్టేస్తున్నారు. ఇలాచేయడం వలన వారి ఆరోగ్యాన్ని వాళ్లే పాడుచేసుకుంటున్నారు. ఉదయాన్నే వ్యాయామం చేయకపోతే అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. ఉదాహరణకు, నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు వస్తాయి.రోజంతా చురుకుగా ఉండాల్సిన శరీరం నిస్తేజంగా మారుతుంది.
Sushil Kumar: ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ
ఉదయం వ్యాయామం చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
ఉదయాన్నే వ్యాయామం చేయకపోవడం వలన శారీరక సమస్యలు మాత్రమే కాకుండా మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయి.రోజువారీ పనులలో ఆసక్తి తగ్గడం, జ్ఞాపకశక్తి మందగించడం, ఏకాగ్రత లోపించడం వంటివి జరుగుతాయి. దీర్ఘకాలంలో అధిక రక్తపోటు, గుండెపోటు వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. వ్యాయామం చేయకపోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి, ఊబకాయం వస్తుంది. ఇది శరీరానికి అత్యంత ప్రమాదకరమైన సమస్య. ముఖ్యంగా ఉదయాన్నే వ్యాయామం చేస్తే శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, కానీ వ్యాయామం చేయకపోతే అది నెమ్మదిస్తుంది.
జీర్ణసమస్యలు అధికం..
వ్యాయామం లేని జీవితం వల్ల జీర్ణక్రియ సమస్యలు కూడా వస్తాయి.తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. ఇవి చిన్న సమస్యలుగా కనిపించినా, దీర్ఘకాలంలో పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. వ్యాయామం వల్ల శరీరంలోని జీర్ణవ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. కానీ దానిని చేయకపోతే, శరీరం నిదానంగా మారి ఈ సమస్యలన్నింటినీ ఆహ్వానిస్తుంది. అప్పుడు చిన్న వయసులోనే అనేక రోగాలతో బాధపడాల్సి వస్తుంది. దీనివలన ఎముకలు వీక్ అవడం, కడుపు అంతా పట్టేసినట్టు ఉండటం, తలనొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. రోజంతా భారంగా గడుస్తుంది.
వ్యాయామం చేయకపోతే రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీనివల్ల తరచూ జలుబు, దగ్గు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీరం బలహీనంగా మారి, చిన్న చిన్న అనారోగ్యాలను కూడా తట్టుకోలేని స్థితికి చేరుకుంటుంది. దీంతోపాటు, శరీరంలోని అవయవాలు కూడా తమ సామర్థ్యాన్ని కోల్పోతాయి. ముఖ్యంగా, గుండె మరియు ఊపిరితిత్తులు బలహీనపడతాయి. దీంతో రోగాల బారిన పడే అవకాశం పెరుగుతుంది.
అందుకే, ఉదయాన్నే వ్యాయామం చేయడం అనేది మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అత్యంత ముఖ్యమైన విషయం. రోజుకు కనీసం 30 నిమిషాలు నడవడం లేదా జాగింగ్ చేయడం వల్ల మన శరీరం, మనస్సు రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. దీర్ఘకాలిక రోగాల నుండి తప్పించుకోవడానికి ఇది ఒక మంచి మార్గం. కేవలం ఆరోగ్యం కోసం మాత్రమే కాకుండా, మన చురుకుదనం, జ్ఞాపకశక్తి, మరియు మానసిక ఉత్సాహం కూడా పెరుగుతాయి. కాబట్టి, ఈరోజు నుండి వ్యాయామం చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకుందాం.
Sports Governance Bill: రాష్ట్రపతి వద్దకు జాతీయ క్రీడా పరిపాలన బిల్లు.. బీసీసీఐపై ప్రభావం ఎంత?