HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Are You Struggling With Excess Weight These Super Tips Are Just For You

Weight Loss: అధిక బరువుతో బాధపడుతున్నారా…? ఈ సూపర్ టిప్స్ మీకోసమే..!

  • Author : Vamsi Chowdary Korata Date : 12-06-2026 - 10:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Are you struggling with excess weight? These super tips are just for you!
Are you struggling with excess weight? These super tips are just for you!

ఆధునిక కాలంలో అధిక బరువుతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. శరీర బరువును తగ్గించుకునేందుకు వారు ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తుంటారు. కొంతమంది ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంటే.. మరికొంతమంది జిమ్ సెంటర్లలో కొవ్వు కరిగించుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయినా బరువు తగ్గని వారు చాలానే ఉన్నారు. ఎందుకంటే వీరు కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల బరువు పెరగడమే తప్ప, తగ్గడం అనేది ఉండదు. అందుకే అధిక బరువుతో బాధపడేవారు ముందుగా వంటగది నుంచే బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఎలా అంటారా… మీరు తీసుకునే కొన్ని రకాల ఆహార పదార్థాలు మీ బరువును పెంచేస్తాయి. అంతేకాదు… మీరు గంటలు గంటలుగా జిమ్ సెంటర్లలో వ్యాయామాలు చేసినా… మీ బరువు మాత్రం తగ్గదు.

బరువు తగ్గాలి అనుకునేవారు ఆహారం విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ముఖ్యంగా ఈ ఐదు రకాల ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. అప్పుడే మీరు అనుకున్నట్లు బరువు తగ్గే అవకాశం ఉంటుంది. మరి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

రెడ్ మీట్:

ఇందులో ప్రోటీన్లు, ఐరన్, విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయినా కూడా తరచుగా వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి మంచి కంటే చెడు ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా దీని వల్ల గుండె సంబంధిత వ్యాధులు, ప్రమాదకరమైన కొన్ని క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు దీనిని తీసుకోవడం వల్ల శరీరం సులభంగా బరువు పెరుగుతుంది. రెడ్ మీట్‌కు బదులుగా ఇతర ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకున్నట్లయితే శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు అందించవచ్చు. సీఫుడ్స్, మొక్కల ఆధారిత ఆహార పదార్థాలు, ఆర్గానిక్ ఫౌల్రీ ద్వారా మీ శరీరానికి కావాల్సినంత ప్రోటీన్లు, విటమిన్లు లభిస్తాయి.

చక్కెరతో కూడిన డ్రింక్స్:

దాహం వేస్తే చాలు ఏవో డ్రింక్స్ తాగేవారు చాలా మందే ఉన్నారు. కొన్ని రకాల డ్రింక్స్‌లో చక్కెర స్థాయి అధికంగా ఉంటుంది. ఇలాంటివి దాహాన్ని తీర్చడానికి ఉద్దేశించినవి కావని గ్రహించాలి. ఈ చక్కెర ఎక్కువ మొత్తంలో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. లెప్టిన్ నిరోధకత, ఇన్సులిన్ నిరోధకత పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు తీసుకోవాలనుకున్న వాటిలో చక్కెర కాకుండా బెల్లంతో తయారు చేసినవి అయితే బాగుంటుంది.

జంక్ ఫుడ్:

జంక్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్లకండి. ప్రాసెస్ చేసిన ఆహారం తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బరువు తగ్గాలనుకుంటే ప్రాసెస్ చేసిన ఆహారం లేదా జంక్ ఫుడ్ కు దూరంగా ఉండటం మంచిది. వీటికి బదులుగా కూరగాయలు, పండ్లు, బాదం, వాల్ నట్స్, సలాడ్స్ వంటివి తీసుకోవడం మంచిది.

ఆల్కహాల్:

అధిక బరువుతో బాధపడుతున్నవారు ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బరువు అమాంతం పెరిగే ప్రమాదం ఉంటుంది. ఆల్కహాల్ కు బదులుగా ఫ్రూట్ జ్యూస్ లాంటివి తాగడం ఉత్తమం.

వీటన్నింటితోపాటుగా చాక్లెట్లు, స్వీట్లకు కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్న వాటిని తీసుకోవడం వల్ల బరువు సులభంగా పెరుగుతారు. వీటికి బదులుగా డార్క్ చాక్లెట్స్ తినడం మంచిది. డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మానసిక స్థితి కూడా మెరుగుపడేలా చేస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • alcohol
  • avoid junk foods
  • benefits weight loss
  • junk foods
  • sugary drinks
  • weight loss tips

Related News

Are you gaining weight? Then try these without delay!

Weight Loss: బరువు పెరుగుతున్నారా? అయితే ఆలస్యం చేయకుండా వీటిని ప్రయత్నించండి..!

Weight Loss: ప్రస్తుతం చాలా మంది బరువు పెరగడం (Weight Gain) అనే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కార్యాలయాలలో గంటల తరబడి కూర్చోవడం వల్ల ప్రజలు అనేక సమస్యలకు గురవుతున్నారు. దీని వల్ల ఊబకాయం మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఊబకాయం ఒక తీవ్రమైన సమస్య. ఇది అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే సకాలంలో పెరుగుతున్న బరువును నియంత్రించు

  • Do you have a habit of drinking alcohol? If so, be careful with its consumption...!!

    Alcohol: మీకు ఆల్కహాల్ తాగే అలవాటు ఉందా..? అయితే వీటి వినియోగంలో జాగ్రత్త…!!

Latest News

  • Lakshmi Nivasam: లక్ష్మీ నివాసం ఇలా ఉంటుందా..?

  • Sting Energy Drink: స్కూళ్ల పరిధిలో ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ పై మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధం

  • Almond Oil: ప్రకాశవంతమైన చర్మం, ఒత్తైన జుట్టు మీ సొంతం కావాలంటే ఆ నూనె ఉపయోగించాల్సిందే!

  • Ayatollah Ali Khamenei: ఖమేనీ అంత్యక్రియలు మోసల్లా మసీదుకు తరలింపు

  • Vijayasai Reddy: అమరావతి రాజధానిపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హైకోర్టులో పిటిషన్

Trending News

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd