Nishant Kumar: ఎవరీ నిశాంత్ కుమార్.. సీఎం నితీష్ కుమార్కు ఏమవుతారు?!
మీడియా నివేదికల ప్రకారం.. నిశాంత్ నికర విలువ ఆయన తండ్రి కంటే కూడా ఎక్కువ. ఆయన సుమారు రూ. 3.6 కోట్ల ఆస్తికి యజమాని అని నివేదికలు సూచిస్తున్నాయి.
- By Gopichand Published Date - 03:30 PM, Thu - 20 November 25
Nishant Kumar: నితీష్ కుమార్ మరోసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో నితీష్ కుమార్ కుటుంబం నుండి ఆయన నికర విలువ వరకు ప్రజలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అందరికంటే ఎక్కువగా చర్చ జరుగుతున్న ఒక పేరు నిశాంత్ కుమార్ (Nishant Kumar). అసలు నిశాంత్ కుమార్ ఎవరు? ఆయనకు నితీష్ కుమార్తో ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకుందాం.
నిశాంత్ కుమార్ ఎవరు?
నిశాంత్ కుమార్.. నితీష్ కుమార్ ఆయన భార్య మంజూ సిన్హా ఏకైక సంతానం. ఆయన 1975 సంవత్సరంలో జన్మించారు. దురదృష్టవశాత్తు ఆయన తల్లి మంజూ సిన్హా 2007లో మరణించారు.
నిశాంత్ కుమార్ చదువు
నిశాంత్ కుమార్ పాట్నాలోని సెయింట్ కారెన్స్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత ఆయన ముస్సోరీలోని మానవ్ భారతి ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్కు వెళ్లారు. అనంతరం ఆయన బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BIT), మెస్రా నుండి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
Also Read: CM Nitish Kumar: బీహార్ సీఎం నితీష్ కుమార్ సంపద ఎంతో తెలుసా?!
వివాహం
నిశాంత్ కుమార్ ఇంకా వివాహం చేసుకోలేదు. ఆయన ఇప్పటికీ అవివాహితుడుగానే ఉన్నారు.
వృత్తి
ఒక ముఖ్యమంత్రి కుమారుడిగా నిశాంత్ రాజకీయాలలో తన వృత్తిని ఎంచుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఆయన వేరే మార్గాన్ని ఎంచుకున్నారు. ఆయన వృత్తిరీత్యా ఇంజనీర్.
నికర విలువ
మీడియా నివేదికల ప్రకారం.. నిశాంత్ నికర విలువ ఆయన తండ్రి కంటే కూడా ఎక్కువ. ఆయన సుమారు రూ. 3.6 కోట్ల ఆస్తికి యజమాని అని నివేదికలు సూచిస్తున్నాయి.
రాజకీయ ప్రవేశం
నిశాంత్ కుమార్కు రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశం లేదు. 2017లో ఆయన మాట్లాడుతూ.. “నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు. ఈ రంగం గురించి నాకు ఏమీ తెలియదు” అని స్పష్టం చేశారు. అయినప్పటికీ నిశాంత్ ప్రభుత్వ కీలక నిర్ణయాలు, రాజకీయ పరిణామాలలో దగ్గరగా పాల్గొంటున్నట్లు సమాచారం. అలాగే ఆయన రామ్మనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ్ వంటి సోషలిస్ట్ ప్రముఖుల రచనలను కూడా అధ్యయనం చేశారు.