HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Waqf Bill To Be Tabled In Lok Sabha Tomorrow

Kiren Rijiju : రేపు లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు

ముస్లిం సమాజం హక్కులను పరిగణనలోకి తీసుకోకుండా, ఈ బిల్లును అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విమర్శిస్తున్నారు. ఈ బిల్లు ద్వారా వక్ఫ్ అపరిమిత అధికారాలను కట్టడి చేస్తామని బీజేపీ చెబుతోంది.

  • Author : Latha Suma Date : 01-04-2025 - 5:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Waqf Bill to be tabled in Lok Sabha tomorrow
Waqf Bill to be tabled in Lok Sabha tomorrow

Kiren Rijiju : వక్ఫ్ బిల్లు బుధవారం రోజున లోక్‌సభ ముందు రాబోతోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ బిల్లును ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తోంది. వక్ఫ్ బిల్లు పార్లమెంట్‌కు రాబోతున్న నేపథ్యంలో, బుధవారం ఉదయం రాహుల్ గాంధీ ఇండియా కూటమి నేతలతో సమావేశమవుతారని తెలుస్తోంది. ఇక, కాంగ్రెస్ సహా ఇతర ఇండియా కూటమి పార్టీలన్నీ ఈ బిల్లును తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ముస్లిం సమాజం హక్కులను పరిగణనలోకి తీసుకోకుండా, ఈ బిల్లును అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విమర్శిస్తున్నారు. ఈ బిల్లు ద్వారా వక్ఫ్ అపరిమిత అధికారాలను కట్టడి చేస్తామని బీజేపీ చెబుతోంది.

Read Also: Painting Exhibition: రూ.వెయ్యికే 8.5 కోట్ల విలువైన చిత్రం.. తలలు పట్టుకున్న నిర్వాహకులు

ఇక, ఈరోజు లోక్ సభలో అధికార, విపక్షాల మధ్య మాటాల యుద్ధం నడిచింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. వక్ఫ్ ఆస్తులను నియంత్రించడంతో పాటు వివాదాలను పరిష్కరించడంలో ప్రభుత్వానికి అధికారం ఇచ్చే బిల్లుపై చర్చ నుంచి తప్పించుకోవడానికే ప్రతిపక్షాలు వాకౌట్ ను ఒక సాకుగా చెబుతున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లుపై చర్చించేందుకు ఎనిమిది గంటలు కేటాయించింది అని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ బిల్లుకు క్రైస్తవ సమాజం కూడా మద్దతు ఇస్తోంది అని గుర్తు చేశారు.

కేరళకు చెందిన కాథలిక్ బిషప్స్ కౌన్సిల్ రాష్ట్రానికి చెందిన ఎంపీలు అందరు వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారని పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం ఈ బిల్లును రాజ్యాంగ విరుద్ధమని, ముస్లిం సమాజ ప్రయోజనాలకు విరుద్ధమని అభివర్ణించిందని ఆయన తెలిపారు. ఇక, ఏప్రిల్ 4వ తేదీతో ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ముగియనుండటంతో రేపు వక్ఫ్ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టడానికి కేంద్రం యోచిస్తుంది. వక్ఫ్ బిల్లును అడ్డుకునేందుకు విపక్షాలు వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, ఎంఐఎం వంటి పార్టీలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా నిలిచినట్లు వెల్లడైంది. మరొక వైపు, ఎన్డీయే భాగస్వామ్య పార్టీల సభ్యులందరూ రేపు సభకు హాజరుకావాలని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.

Read Also: Supreme Court : బాధితులకు ఆశ్రయం పొందే హక్కు లేదా ?: యూపీ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Kiren Rijiju
  • lok sabha
  • muslim community
  • nda govt
  • rahul gandhi
  • Waqf Amendment Bill

Related News

Ktr Comments Revanth

నా మీద కాదు, మీ సీఎం పై అరవ్వండి అంటూ కాంగ్రెస్ శ్రేణులకు కేటీఆర్ సూచన

రాహుల్ గాంధీని తాను కొత్తగా ఏం అనలేదని, గతంలో రేవంత్ చెప్పిన మాటలనే తిరిగి అన్నానని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. కాంగ్రెస్ నేతలు తనపై ఫైరవ్వడంపై ఆయన స్పందించారు. 'రాహుల్ పప్పు కాదు ముద్ద పప్పు అని గతంలో రేవంత్ అన్నాడు

  • Party spokesperson's key comments on TVK-Congress alliance

    టీవీకే–కాంగ్రెస్ పొత్తు పై పార్టీ అధికార ప్రతినిధి కీలక వ్యాఖ్యలు

Latest News

  • వావ్ ఎయిర్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయోచ్ !!

  • ప్రభాస్ “రాజాసాబ్” ఫైనల్ టాక్

  • పాలకూర ప్రతిరోజూ తింటే ఎన్నో ప్రయోజనాలు..!

  • మహిళా మంత్రులకు కేసీఆర్‌ ఆత్మీయ పలకరింపు..పసుపు, కుంకుమ, చీర, తాంబూలాలతో సత్కారం

  • భారత ఉద్యోగ విపణిలో ఏఐ విప్లవం

Trending News

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

    • మీ మొబైల్ నంబర్ చివర సున్నా ఉందా?

    • టీమిండియాకు కొత్త స‌మ‌స్య‌.. స్టార్ ఆట‌గాడికి గాయం!?

    • కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క,కొండా సురేఖ.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd