PM Modi: వక్ఫ్ బిల్లుపై ప్రధాని మోదీ అభిప్రాయం ఇదే.. ఏమన్నారంటే?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో వక్ఫ్ (సవరణ) బిల్లు 2025, ముస్లిం వక్ఫ్ (రద్దు) బిల్లు, 2024 ఆమోదం పొందినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
- By Gopichand Published Date - 10:50 AM, Fri - 4 April 25

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పార్లమెంటులో వక్ఫ్ (సవరణ) బిల్లు 2025, ముస్లిం వక్ఫ్ (రద్దు) బిల్లు, 2024 ఆమోదం పొందినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ చట్టాలు సామాజిక, ఆర్థిక న్యాయం, పారదర్శకత, సమగ్ర అభివృద్ధి వైపు ఒక ముఖ్యమైన అడుగుగా ఆయన అభివర్ణించారు. దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించడం వల్ల ముఖ్యంగా ముస్లిం మహిళలు, పేద ముస్లింలు, పస్మాండ ముస్లింల ప్రయోజనాలు దెబ్బతిన్నాయని ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’లో పేర్కొన్నారు. ఈ సవరణలు చాలా కాలంగా అణగదొక్కబడిన వారికి సహాయపడతాయని ఆయన ఉద్ఘాటించారు.
The passage of the Waqf (Amendment) Bill and the Mussalman Wakf (Repeal) Bill by both Houses of Parliament marks a watershed moment in our collective quest for socio-economic justice, transparency and inclusive growth. This will particularly help those who have long remained on…
— Narendra Modi (@narendramodi) April 4, 2025
పార్లమెంటు ఉభయ సభలలో ఈ బిల్లులు ఆమోదం పొందడం ఒక సమిష్టి కృషిలో మైలురాయిగా ఉంటుందని మోదీ అన్నారు. కొత్త చట్టాలు పారదర్శకతను ప్రోత్సహించడమే కాకుండా ప్రజల హక్కులను కూడా కాపాడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. “ప్రతి పౌరుడి గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా బలమైన, సమ్మిళిత భారతదేశాన్ని నిర్మించగలం” అని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటరీ చర్చలు, కమిటీ సమావేశాలలో పాల్గొని తమ అభిప్రాయాలతో ఈ చట్టాలను బలోపేతం చేసిన సభ్యులకు, అలాగే విలువైన సూచనలు పంపిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విస్తృత చర్చలు, సంభాషణల ప్రాముఖ్యత మరోసారి నిరూపితమైందని ఆయన అన్నారు.
Also Read: Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో నేటి వాతావరణ పరిస్థితి ఇదే.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..!
ఈ బిల్లులపై చర్చ 13 గంటలకు పైగా కొనసాగింది. రాజ్యసభలో 128-95 ఓట్ల తేడాతో బిల్లు ఆమోదం పొందగా, లోక్‌సభలో కూడా బుధవారం రాత్రి ఆమోదం లభించింది. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలను ఎగువ సభ తిరస్కరించింది. మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. 2006లో దేశంలో 4.9 లక్షల వక్ఫ్ ఆస్తుల నుండి కేవలం రూ.163 కోట్ల ఆదాయం వచ్చిందని, 2013లో మార్పుల తర్వాత కూడా ఆదాయం రూ.3 కోట్లు మాత్రమే పెరిగిందని తెలిపారు. నేడు 8.72 లక్షల వక్ఫ్ ఆస్తులు ఉన్నాయని, ఈ బిల్లు వాటి నిర్వహణకు నిబంధనలు చేర్చిందని ఆయన వివరించారు. “ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల్లో జోక్యం చేసుకోదు” అని రిజిజు స్పష్టం చేస్తూ ఈ బిల్లు ముస్లిం సమాజంలోని పేదలు, మహిళలు, పస్మాండల పరిస్థితిని మెరుగుపరుస్తుందని, ప్రతిపక్షాల అపోహలు నిరాధారమని అన్నారు.