HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Vikash Yadav Indias Ex Raw Official Wanted In Gurpatwant Pannun Case Was Arrested By Delhi Police

Vikash Yadav : ఉగ్రవాది పన్నూ హత్యకు కుట్రకేసు.. ‘రా’ మాజీ అధికారి వికాస్ అరెస్టు !

వికాస్‌ (Vikash Yadav) తనను నగరంలోని ఓ హోటల్‌కు పిలిచి..  దాడి చేయడంతో పాటు కిడ్నాప్‌, దోపిడీకి యత్నించాడని  ఢిల్లీలోని రోహిణి ఏరియాకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

  • By Pasha Published Date - 02:46 PM, Sat - 19 October 24
  • daily-hunt
Vikash Yadav India Ex Raw Official Gurpatwant Pannun

Vikash Yadav : అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంటున్న ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు కుట్ర కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కుట్రలో భారత్‌కు చెందిన గూఢచార సంస్థ ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) మాజీ ఉద్యోగి వికాస్ యాదవ్ (39) హస్తం ఉందని అమెరికా ప్రభుత్వం ఆరోపిస్తోంది.  దీనిపై అమెరికా అనవసర రాద్ధాంతం చేస్తున్న తరుణంలో ఢిల్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Also Read :Dhana Trayodashi : 29న ధన త్రయోదశి.. ఆ రోజు యమదీపం వెలిగించడం వెనుక పురాణగాథ ఇదీ

వికాస్ యాదవ్ గతంలో భారత ప్రభుత్వ అధికారిగా అమెరికాలో విధులు నిర్వర్తించేవారు. అమెరికాలోని  భారత విదేశీ ఇంటెలీజెన్స్ విభాగం, రా విభాగాలను నిర్వహించే కేబినెట్‌ సెక్రటేరియట్‌లో ఆయన  ఉద్యోగిగా సేవలు అందించేవారు.  అయితే వికాస్‌ను, ఆయన అనుచరుడిని  2023 సంవత్సరం డిసెంబరు 18న ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వికాస్‌ (Vikash Yadav) తనను నగరంలోని ఓ హోటల్‌కు పిలిచి..  దాడి చేయడంతో పాటు కిడ్నాప్‌, దోపిడీకి యత్నించాడని  ఢిల్లీలోని రోహిణి ఏరియాకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగానే వికాస్‌ యాదవ్‌‌‌పై కేసును నమోదు చేసి, అరెస్టు చేశారని ఆయా కథనాల్లో ప్రస్తావించారు. ఎట్టకేలకు ఈ ఏడాది మార్చిలో పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఛార్జ్‌షీట్ దాఖలైన మరుసటి నెలలోనే వికాస్‌ యాదవ్‌కు బెయిల్ మంజూరైంది.

Also Read :Drone Attack : ప్రధాని నివాసంపై డ్రోన్ ఎటాక్.. ఏం జరిగిందంటే.. ?

అమెరికాలో ఉంటున్న ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూ హత్యకు కుట్ర కేసును అతడు ఎదుర్కొంటున్న వేళ ఈవివరాలు వెలుగులోకి రావడం గమనార్హం. వికాస్‌ యాదవ్‌ పరారీలో ఉన్నాడని అమెరికా అంటుండగా.. ఇప్పుడు అతడి ఆచూకీపై క్లారిటీ రావడం కీలకమైన అంశం. దీనిపై అమెరికా ఎలా స్పందిస్తుంది ? వికాస్ యాదవ్ అప్పగింతకు భారత్‌పై దౌత్యపరమైన ఒత్తిడిని పెంచుతుందా ? అనేది వేచిచూడాలి. మరోవైపు అమెరికాలోని న్యూయార్క్‌ కోర్టులోనూ వికాస్‌యాదవ్‌‌పై ఇప్పటికే ఛార్జ్‌షీట్‌ దాఖలైంది.  మనీలాండరింగ్‌ చేయడం, పన్నూ హత్యకు కుట్ర పన్నేందుకు వ్యక్తులను నియమించడం, పన్నూ హత్యకు ప్రణాళిక రచించడం వంటి అభియోగాలను అమెరికా దర్యాప్తు సంస్థలు మోపాయి. వికాస్‌యాదవ్‌‌‌ అమెరికాలో విధుల్లో ఉండగా.. పన్నూను హత్య చేసేందుకు నిఖిల్‌ గుప్తాతో కలిసి కుట్ర పన్నాడని అమెరికా ఆరోపిస్తోంది.  చెక్‌ రిపబ్లిక్‌ జైలులో ఉన్న నిఖిల్‌‌ను ఇటీవలే అమెరికాకు అప్పగించారు. ఈ కేసు వ్యవహారంపై ఇటీవలే భారత ప్రభుత్వానికి అమెరికాలోని న్యూయార్క్ కోర్టు సమన్లు జారీ చేయడం వివాదానికి దారితీసింది. దీనిపై భారత్ అప్పట్లో మండిపడింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • canada
  • crime
  • Delhi police
  • ex RAW official
  • Gurpatwant Pannun
  • india
  • RAW
  • us
  • Vikash Yadav

Related News

Red Fort

Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

Shocking : దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట ప్రాంగణంలో ఒక సంచలనాత్మక దొంగతనం చోటు చేసుకుంది. జైన సమాజం నిర్వహిస్తున్న మతపరమైన ఆచారాల సమయంలో అమూల్యమైన కలశం మాయమైపోవడం భద్రతా ఏర్పాట్లపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది.

  • Trade War

    Trade War : భారత్‌పై అమెరికా వాణిజ్య కార్యదర్శి తీవ్ర వ్యాఖ్యలు

  • Upendra Dwivedi

    Operation Sindoor : యుద్ధం మూడురోజుల్లోనే ముగిసిందని అనుకోవడం తప్పు : ఆర్మీ చీఫ్‌ ద్వివేదీ

  • Trump Is Dead

    Trump Tariffs : టారిప్స్ పై ఆందోళన అవసరం లేదు – పీయూష్

  • Tablighi Jamaat

    Tablighi Jamaat: తబ్లిగి జమాత్ చీఫ్ మౌలానా సాద్‌కు ఊరట.. ఐదేళ్ల తర్వాత క్లీన్ చిట్!

Latest News

  • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

  • AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

  • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

  • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

  • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd