Neet : నీట్ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరి అరెస్టు : సీబీఐ
- By Latha Suma Published Date - 09:51 PM, Tue - 9 July 24

NEET-UG case : నీట్-యూజీ పేపర్ లీక్ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ మరో ఇద్దరిని అరెస్టు చేసింది. బీహార్‌లోని పట్నాకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకోగా..వీరిలో ఒకరు నీట్ అభ్యర్థి కావడం గమనార్హం. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు చేసిన వారి సంఖ్య 11కి చేరినట్లు సీబీఐ అధికారులు మంగళవారం వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న వారిలో నలందకు చెందిన నీట్-యుజీ అభ్యర్థి సన్నీతో పాటు రంజిత్ కుమార్ అనే విద్యార్థి తండ్రి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు పేపర్ లీక్ కేసులో బిహార్‌లో ఎనిమిది మంది, అలాతూర్, గోధ్రాకు చెందిన ఒక్కొక్కరు, కుట్ర చేసినట్లు తేలడంతో దేహ్రాదూన్ నుంచి ఒకరిని అరెస్టు చేసినట్లు సీబీఐ పేర్కొంది.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ విషయం దూమారం రేపుతుంది. అభ్య ర్థులతో ఒత్తిడితో ఈ అంశంపై కేంద్రం సీబీఐ ఎంక్వయిరీ వేసింది. కేసు విచారణ జరుపుతోన్న సీబీఊ కేసుతో సంబంధం పలువురిని అరెస్టు చేసి విచారిస్తుంది. అదేవిధంగా పరీక్ష నిర్వహణలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నందున్న రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని 38 మంది అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
Read Also:CM Revanth Challenge : హరీష్.. కేటీఆర్ నా సవాల్ కు సిద్ధమా..? -రేవంత్ రెడ్డి
కాగా, ఇప్పటికే హజారీబాగ్‌లోని ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయగా.. అక్కడ కాలిపోయిన ప్రశ్నపత్రాలను బిహార్ పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఆరు ఎఫ్‌ఐఆర్‌లను సీబీఐ అధికారులు నమోదు చేశారు. మరోవైపు, ఈ వ్యవహారంలో దాఖలైన పలు పిటిషన్లపై సోమవారం విచారించిన సుప్రీంకోర్టు.. నీట్ ప్రశ్నపత్రం లీకైన మాట వాస్తవమేనని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అన్ని అంశాలను పరిశీలించాక మళ్లీ పరీక్ష నిర్వహించే అంశాన్ని చివరి ఆప్షన్‌గానే భావిస్తామని పేర్కొంది. తిరిగి ఈ కేసును జులై 11కి వాయిదా వేసింది.
Read Also: Free Sand in AP : చంద్రబాబుకు జై కొట్టిన కొడాలి నాని