Cyclone Michaung: తుఫాన్ బాధితులకు భారీ సాయం: సీఎం స్టాలిన్
డిసెంబర్ 3, 4 తేదీల్లో తమిళనాడును తాకిన మిక్జామ్ తుఫాను చెన్నైలో తీవ్ర ప్రభావం చూపింది.చెంగల్పట్టు, కాంచీపురం మరియు తిరువళ్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లోఅధిక వర్షాలు నమోదయ్యాయి.
- Author : Praveen Aluthuru
Date : 09-12-2023 - 6:25 IST
Published By : Hashtagu Telugu Desk
Cyclone Michaung: డిసెంబర్ 3, 4 తేదీల్లో తమిళనాడును తాకిన మిక్జామ్ తుఫాను చెన్నైలో తీవ్ర ప్రభావం చూపింది.చెంగల్పట్టు, కాంచీపురం మరియు తిరువళ్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లోఅధిక వర్షాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తీవ్ర నష్టం వాటిల్లింది.వర్షాలు మరియు వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు సహాయ సహకారాలు కొరకై ఈ రోజు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ నేతృత్వంలో రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, ముఖ్య కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సంప్రదింపుల సమావేశంలో వరద నష్టం, అందించాల్సిన పరిహారం మొత్తంపై చర్చించారు
వరదల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు పరిహారం మొత్తాన్ని 4 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచాలని ఆదేశించారు. దెబ్బతిన్న గుడిసెలకు ఇప్పటికే ఇస్తున్న రూ.5వేలను రూ.8వేలకు పెంచాలని ఆదేశించారు. తుఫాన్ ప్రభావితం అయిన ప్రతిఒక్కరికి 6 వేలు చొప్పున ఇవ్వనున్నారు. వర్షం కారణంగా దెబ్బతిన్న వరితో సహా ఇతర పంటలకు హెక్టారుకు రూ.13,500/- నుండి రూ.17 వేలకు పెంచాలని ఆయన ఆదేశించారు. శాశ్వత పంటలు మరియు చెట్లకు (33 శాతం మరియు అంతకంటే ఎక్కువ) నష్టం జరిగితే హెక్టారుకు 18 వేల రూపాయల నుండి 22,500 రూపాయలకు పరిహారం పెంచాలని ఆయన ఆదేశించారు. వర్షాభావ పంటలకు (33 శాతం మరియు అంతకంటే ఎక్కువ) హెక్టారుకు రూ.7,410/- నుండి రూ.8,500/-లకు పెంచాలని కూడా ఆయన ప్రతిపాదించారు.
Also Read: Navagrahas : మీరు కూడా అలాంటి పొరపాట్లు చేస్తున్నారా.. అయితే నవగ్రహాల ఆగ్రహానికి గురవ్వడం ఖాయం?