HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >There Is No Point In Succumbing To Any Pressure Prime Minister Modi Responds To Trump Tariffs

Tariffs : ఎలాంటి ఒత్తిడికీ లోనయ్యే ప్రసక్తే లేదు..ట్రంప్‌ టారిఫ్‌ల పై స్పందించిన ప్రధాని మోడీ

రైతుల సంక్షేమం మా ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత. దేశంలోని దాదాపు 60 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడుతోంది. వారి ప్రయోజనాల కోసం ఏదైనా ఒప్పందాన్ని త్యజించడానికైనా సిద్ధంగా ఉన్నాం. కానీ, రైతుల జీవితాలపై ప్రమాదం వచ్చే విధంగా ఎలాంటి విదేశీ ఒత్తిడికీ లోనయ్యే ప్రసక్తే లేదు అని తేల్చిచెప్పారు.

  • By Latha Suma Published Date - 10:57 AM, Thu - 7 August 25
  • daily-hunt
Prime Minister Modi
Prime Minister Modi

Tariffs :  వాషింగ్టన్‌-న్యూఢిల్లీ మధ్య వాణిజ్య సంబంధాల్లో కొత్త మలుపు తలెత్తింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై దిగుమతి సుంకాలను పెంచుతున్నట్లు ప్రకటించగా, భారత ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం గట్టిగా స్పందించారు. రైతుల సంక్షేమానికి మద్దతుగా నిలబడి రైతుల ప్రయోజనాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోము అని స్పష్టంచేశారు. అమెరికా డెయిరీ ఉత్పత్తులను దిగుమతులకు భారత్‌ గతంలో అనుమతి ఇవ్వకపోవడమే ఈ పరిణామాలకు మూలంగా చెబుతున్నారు. అమెరికా డెయిరీ పరిశ్రమకు భారీగా లాభాలు చేకూరేలా, తమ ఉత్పత్తులను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించింది. అయితే, వాటి దిగుమతులు భారత దేశీయ రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తాయనే కారణంతో భారత ప్రభుత్వం అవి నిరాకరించింది.

Read Also: United Airlines : అమెరికా వ్యాప్తంగా విమానాలు నిలిపివేత..ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం

ఈ నేపధ్యంలో ట్రంప్‌ ప్రభుత్వం భారత్‌పై విరుచుకుపడుతోంది. రష్యా చమురును కొనుగోలు చేస్తున్నారన్న కారణంతోనూ భారతంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు భారత దిగుమతులపై అమలులో ఉన్న 25 శాతం టారిఫ్‌ను, ట్రంప్‌ 50 శాతానికి పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో నరేంద్ర మోడీ వాణిజ్యమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్ష నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ..రైతుల సంక్షేమం మా ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత. దేశంలోని దాదాపు 60 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడుతోంది. వారి ప్రయోజనాల కోసం ఏదైనా ఒప్పందాన్ని త్యజించడానికైనా సిద్ధంగా ఉన్నాం. కానీ, రైతుల జీవితాలపై ప్రమాదం వచ్చే విధంగా ఎలాంటి విదేశీ ఒత్తిడికీ లోనయ్యే ప్రసక్తే లేదు అని తేల్చిచెప్పారు.

ఇది ప్రత్యక్షంగా ట్రంప్‌ పేరు ప్రస్తావించకుండా చేసిన వ్యాఖ్య అయినా, నేపథ్యం దృష్ట్యా ఇది అమెరికాపైనే ప్రధాని పరోక్ష ప్రతిస్పందనగా చెబుతున్నారు నిపుణులు. అంతర్జాతీయ వాణిజ్యంలో స్వార్థపూరితంగా వ్యవహరించే దేశాలకు భారత్‌ తలవంచే ప్రసక్తే లేదని ప్రధాని ఈ వ్యాఖ్యల ద్వారా సంకేతం పంపించారు. ఇదిలా ఉండగా, అమెరికా టారిఫ్‌ పెంపు నిర్ణయం భారత దిగుమతిదారులను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే పరికరాలు, ఆయిల్‌ ఉత్పత్తులు, మైదానం సంబంధించిన పరికరాలపై వ్యయం పెరగనుంది. దీని ప్రభావం ఖచ్చితంగా దేశీయ మార్కెట్‌పై పడనుంది. ఈ నేపథ్యంలో భారత్‌ తన స్వావలంబన విధానాన్ని మరింత బలపరచే దిశగా అడుగులు వేయనుందని స్పష్టమవుతోంది. దేశీయ పరిశ్రమలను, వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

కాగా, రష్యా నుంచి చమురు కొనుగోలును కొనసాగిస్తున్న భారత్‌పై అమెరికా కఠిన వైఖరి అవలంబించింది. భారతదేశం నుంచి వచ్చే దిగుమతులపై అదనంగా 25 శాతం టారిఫ్‌ (సుంకం) విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్) సంతకం చేశారు. గత వారం ప్రకటించిన 25 శాతం సుంకానికి ఇది అదనం కావడం గమనార్హం. ఈ కొత్త సుంకాలు ఉత్తర్వుపై సంతకం చేసిన 21 రోజుల తర్వాత అమెరికాలోకి ప్రవేశించే అన్ని అర్హత కలిగిన భారతీయ వస్తువులపై అమల్లోకి వస్తాయి. అయితే, ఈ గడువుకు ముందే రవాణాలో ఉండి, సెప్టెంబర్ 17వ తేదీలోపు కస్టమ్స్ క్లియరెన్స్ పొందే సరుకులకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు కల్పించారు. ఇప్పటికే ఉన్న సుంకాలను యథాతథంగా కొనసాగిస్తూ, ఈ కొత్త టారిఫ్‌లను అదనంగా విధించనున్నారు.

Read Also: Iron : మన శరీరంలో ఐరన్ శాతం ఎంత ఉండాలి? లేదంటే ఎంత డేంజర్ తెలుసా?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • American dairy production
  • Donald Trump
  • farmers
  • India Russia Oil
  • Indian imports tariff
  • pm modi

Related News

Donald Trump

Warning Bell : ట్రంప్ కు వార్నింగ్ బెల్!

Warning Bell : అమెరికాలో జరిగిన కీలక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు రిపబ్లికన్ పార్టీకి పెద్ద శోకాన్ని మిగిల్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క పాలనా విధానాలను సమర్థించని

  • India Cricket Team

    PM Modi: రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్న టీమిండియా మ‌హిళ‌ల జ‌ట్టు!

  • PM Kisan funds released.. Check if the money has been deposited in your account like this!

    PM Kisan : రైతులకు బిగ్ షాక్ ఇచ్చిన మోడీ

  • H1B Visa

    H1B Visa: హెచ్‌-1బీ వీసా దుర్వినియోగంపై ట్రంప్ సర్కార్ ప్రకటన!

  • Sardar Vallabhbhai Patel

    Sardar Vallabhbhai Patel: నేడు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి!

Latest News

  • Gudem Village Electrification : గిరిజనుల్లో వెలుగు నింపి..వారి హృదయాల్లో దేవుడైన పవన్ కళ్యాణ్

  • Bihar Election Polling : ఓటేసిన సీఎం నీతీశ్, తేజస్వీ యాదవ్ ఇతరులు

  • CBN : లండన్ పర్యటన ముగించుకుని అమరావతికి చేరుకున్న సీఎం చంద్రబాబు

  • Nara Lokesh : ప్రకాశం జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటనకు అపూర్వ స్పందన

  • RK Beach : వైజాగ్ బీచ్ లో బయటపడిన పురాతన బంకర్, భారీ శిలలు

Trending News

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

    • U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd