HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Tahawwur Rana Being Flown To India On Special Plane

Tahawwur Rana: రాత్రికల్లా భారత్‌కు ఉగ్రవాది తహవ్వుర్ రాణా.. ఇతడెవరు ?

ముంబై ఉగ్రదాడుల్లో తహవ్వుర్ రాణా(Tahawwur Rana) పాత్రకు సంబంధించిన అన్ని ఆధారాలను ఇప్పటికే అమెరికా కోర్టులకు భారత్ సమర్పించింది.

  • Author : Pasha Date : 09-04-2025 - 11:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tahawwur Rana Extradition To India Special Plane Us Pakistan

Tahawwur Rana: 26/11 ముంబై ఉగ్రదాడులు గుర్తున్నాయి కదూ!! 2008 సంవత్సరం నవంబరు 26 నుంచి 29 వరకు ఈ ఉగ్రదాడి కొనసాగింది.  9 మంది ఉగ్రవాదులు భారతదేశ వాణిజ్య రాజధానిపై జరిపిన ఈ టెర్రర్ ఎటాక్‌లో 175 మంది చనిపోగా, 300 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఈ ఉగ్ర దాడి కోసం తెర వెనుక నుంచి స్కెచ్ గీసిన ఉగ్రవాదుల్లో ఒకడు తహవ్వుర్ రాణా. అతగాడు ఇవాళ (బుధవారం) రాత్రి లేదా రేపు (గురువారం ) ఉదయంకల్లా భారత్‌కు చేరుకోనున్నాడు. భారతీయ అధికారుల బృందం తహవ్వుర్ రాణాను ప్రత్యేక విమానంలో అమెరికా నుంచి భారత్‌కు తీసుకొస్తోంది. ఈరోజు ఉదయమే వారి విమానం భారత్‌కు బయలుదేరిందట. అతగాడు భారత్‌కు రాగానే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), భారత గూఢచార విభాగం రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్)‌ విచారించే అవకాశం ఉంది. అయితే అంతకంటే ముందు తహవ్వుర్ రాణాకు వైద్య పరీక్షలు నిర్వహించి,  కోర్టులో ప్రవేశపెడతారని సమాచారం.   తహవ్వుర్ రాణా పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా జాతీయుడు. ఇప్పటివరకు వివిధ కేసుల్లో అతగాడు అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌ జైలులో శిక్షను అనుభవించాడు.

Also Read :Kasireddy Vs Liquor Scam: సిట్ ఎదుటకు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి .. ఏపీ లిక్కర్ స్కాంలో పాత్రేమిటి ?

అమెరికాలోనూ భారత్ వాదనే నెగ్గింది.. 

ముంబై ఉగ్రదాడుల్లో తహవ్వుర్ రాణా(Tahawwur Rana) పాత్రకు సంబంధించిన అన్ని ఆధారాలను ఇప్పటికే అమెరికా కోర్టులకు భారత్ సమర్పించింది. వాటన్నింటినీ పరిశీలించిన అమెరికా కోర్టులు.. తహవ్వుర్ రాణాను భారత్‌కు అప్పగించాలని ఆదేశించాయి. చాలా అమెరికన్ కోర్టుల్లో తహవ్వుర్ రాణా అప్పీల్ పిటిషన్లు వేసినా ఫలితం లేకపోయింది. అన్ని కోర్టులూ భారత్ వాదననే సమర్ధించాయి. తహవ్వుర్ రాణా తప్పు చేసి, శిక్ష నుంచి, విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని అమెరికన్ న్యాయస్థానాలు  మండిపడ్డాయి. మొత్తాన్ని న్యాయమే గెలిచింది. భారత్ వాదనే నెగ్గింది.

Also Read :MBiPC Benefits : ఇంటర్‌లో ఇక ఎంబైపీసీ గ్రూపు.. కొత్త మార్పులు, మార్కుల వివరాలివీ

మోడీ సమక్షంలో ట్రంప్ ప్రకటన

ఇటీవలే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించారు. ఆసందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘‘26/11 ముంబై ఉగ్ర దాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్‌‌కు మేం అప్పగించబోతున్నాం. త్వరలో మరింతమంది నేరగాళ్ల విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంటాం’’ అని వెల్లడించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • india
  • pakistan
  • Special Plane
  • Tahawwur Rana
  • Tahawwur Rana Extradition
  • us

Related News

New Currency

New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

భారత కరెన్సీ వ్యవస్థలో కీలక మార్పులకు భారతీయ రిజర్వు బ్యాంక్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగితపు నోట్ల స్థానంలో దశలవారీగా ప్లాస్టిక్ లేదా పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే అంశంపై ఆర్‌బీఐ అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కరెన్సీ నిర్వహణ ప్రణాళికల్లో భాగంగా ప్లాస్టిక్ నోట్ల అమలుపై ఆర్‌బీఐ దృ

  • CM Revanth

    CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

  • Asaduddin Owaisi

    Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

  • Arrest

    Advocate Murder Case : హైదరాబాద్ న్యాయవాది హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

  • Cng Gas

    CNG Price Hike :పెట్రోల్ నుంచి సీఎన్‌జీ వరకు.. వరుస ధరల పెంపులతో సామాన్యుడికి షాక్

Latest News

  • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd