Tushar Gandhi: గాంధీజీ ముని మనవడి పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
‘‘గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం రూ.1200 కోట్లతో సబర్మతీ ఆశ్రమాన్ని పునర్ నిర్మిస్తే దాని టోపోగ్రఫీ మారిపోతుంది. నైతికత దెబ్బతింటుంది’’ అని ఆరోపిస్తూ తుషార్ గాంధీ(Tushar Gandhi) సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
- By Pasha Published Date - 03:28 PM, Tue - 1 April 25

Tushar Gandhi: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో జాతిపిత మహాత్మా గాంధీ సబర్మతీ ఆశ్రమం ఉంది. దీన్ని రూ.1200 కోట్లతో ఆధునికీకరించాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని 2022 సంవత్సరంలో గుజరాత్ హైకోర్టు సమర్ధించింది. దీన్ని మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై ఇవాళ విచారణ జరిపిన భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
Also Read :PM Modi 75 : సెప్టెంబరు 17 నాటికి మోడీకి 75 ఏళ్లు.. రిటైర్మెంట్ ఏజ్ అదేనా ?
మీ భావోద్వేగాలతో ముడిపెట్టొద్దు.. తుషార్‌కు సుప్రీంకోర్టు సూచన
‘‘గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం రూ.1200 కోట్లతో సబర్మతీ ఆశ్రమాన్ని పునర్ నిర్మిస్తే దాని టోపోగ్రఫీ మారిపోతుంది. నైతికత దెబ్బతింటుంది’’ అని ఆరోపిస్తూ తుషార్ గాంధీ(Tushar Gandhi) సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. ‘‘మీ భావోద్వేగాలను ఈ అంశంతో ముడిపెట్టొద్దు’’ అని తుషార్‌కు సూచించింది. ‘‘మనం ముందుకు వెళ్తున్నాం. మన దేశం ముందుకు వెళ్తోంది. ఇలాంటి అంశాలను ఇతర కోణాల్లో చూడాలి’’ అని పేర్కొంటూ తుషార్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తాము అన్ని అంశాలను నిశితంగా పరిశీలించామని, సబర్మతీ ఆశ్రమం పునర్నిర్మాణం ప్రతిపాదనలో అభ్యంతరం చెప్పడానికి ఏమీ లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
Also Read :Sunita Williams : భారత్‌కు సునితా విలియమ్స్.. ఇస్రోతో కలిసి పనిచేయనున్నారా ?
సబర్మతీ ఆశ్రమం ఇలా ఏర్పడింది..
గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చాక కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాత గుజరాత్‌లోనే స్థిరపడాలని అనుకున్నారు.దీంతో గాంధీజీ స్నేహితుడు జీవన్‌లాల్ దేశాయ్.. తన బంగ్లాలో ఉండమని గాంధీజీని కోరారు. అందుకు గాంధీజీ అంగీకరించారు. అక్కడ ఉండసాగారు. దీంతో జీవన్‌లాల్ బంగ్లా సత్యాగ్రహ ఆశ్రమంగా మారింది. పశుపోషణ, వ్యవసాయం, గ్రామ పరిశ్రమలు వంటి కార్యకలాపాలు అక్కడ ఉండేవి కావు. దీంతో ఆశ్రమాన్ని మరొక ప్రదేశానికి తరలించడానికి ప్రణాళికలు రూపొందించారు. సబర్మతీ నది ఒడ్డునే ఆశ్రమం కోసం మరో ప్రదేశాన్ని ఎంచుకున్నారు. అక్కడ 35 ఎకరాల్లో సత్యాగ్రహ ఆశ్రమం నిర్మించారు. నదికి సమీపంలో ఉన్నందున దీనికి సబర్మతీ ఆశ్రమం అని పేరు పెట్టారు. ఈ ఆశ్రమ నిర్మాణ పనులను ఇంజనీర్ చార్లెస్ కొరియాకు అప్పగించారని అంటారు. సబర్మతీ ఆశ్రమం.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సబర్మతీ నది ఒడ్డున 36 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీన్ని ఒకప్పుడు సత్యాగ్రహ ఆశ్రమం అని పిలిచేవారు. ఈ ఆశ్రమానికి ఒకవైపు సబర్మతీ నది, మరోవైపు శ్మశాన వాటిక, సమీపంలో జైలు ఉన్నాయి. సబర్మతీ ఆశ్రమం 1915 మే 25న ఉనికిలోకి వచ్చింది.