Student Suicides : విద్యార్థుల ఆత్మహత్యలు జనాభా వృద్ధి రేటును మించిపోయాయ్
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ఆధారంగా ఐసీ3 సంస్థ ఈ అధ్యయనం(Student Suicides) నిర్వహించింది.
- By Pasha Published Date - 01:25 PM, Thu - 29 August 24

Student Suicides : ఇంటర్నేషనల్ కెరీర్ అండ్ కాలేజ్ కౌన్సెలింగ్ (ఐసీ3) అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. దేశంలో విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య.. మొత్తం ఆత్మహత్యల జాతీయ సగటు కంటే రెండింతలు ఎక్కువగా ఉందని వెల్లడైంది. ఈ సంఖ్య దేశ జనాభా వృద్ధిరేటును మించిపోయిందని తేలింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ఆధారంగా ఐసీ3 సంస్థ ఈ అధ్యయనం(Student Suicides) నిర్వహించింది. ఇందులో గుర్తించిన వివరాలతో ‘విద్యార్థుల ఆత్మహత్యలు-భారత్‌ను వణికిస్తున్న మహమ్మారి’ పేరిట ఒక నివేదికను విడుదల చేసింది.
We’re now on WhatsApp. Click to Join
సర్వే నివేదిక ప్రకారం..
- గత 20 ఏళ్లలో భారత్‌లో సాధారణ ఆత్మహత్యల రేటు 2 శాతం ఉండగా, విద్యార్థుల ఆత్మహత్యల రేటు 4 శాతంగా ఉంది.
- 2022లో మొత్తం విద్యార్థుల ఆత్మహత్యల్లో బాలలు/ యువకులు 53 శాతం మంది ఉన్నారు.
- 2021-22 మధ్య కాలంలో అబ్బాయిల్లో ఆత్మహత్యలు 6 శాతం తగ్గగా, విద్యార్థినుల్లో ఆత్మహత్యలు 7 శాతం పెరిగాయి.
- గత పదేళ్ల వ్యవధిలో 24 ఏళ్లలోపు వారి జనాభా 582 మిలియన్ల నుంచి 581 మిలియన్లకు తగ్గింది. అయితే ఈ ఏజ్ గ్రూపులోని విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య 6,654 నుంచి 13,044కి పెరిగింది.
- గత ఐదేళ్లలో విద్యార్ధినీ, విద్యార్థుల్లో ఆత్మహత్యలు సగటున 5 శాతం మేర పెరిగాయి.
- విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించిన జాబితాలో మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. రాజస్థాన్ 10వ స్థానంలో ఉంది.
- దేశంలో జరుగుతున్న విద్యార్థుల మొత్తం ఆత్మహత్యల్లో 29 శాతం దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే బయటపడ్డాయి.
- ఏదిఏమైనప్పటికీ దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతుండటం అనేది ఆందోళన కలిగించే అంశం. సరైన సమయంలో కనీస కౌన్సెలింగ్‌ను అందిస్తే మనం ఎంతోమంది ప్రాణాలను నిలపవచ్చు. ఈదిశగా ప్రభుత్వాలు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది.