HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Shocking Twist In Neet Paper Leak Scandal He Is From The Cbi

NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో షాక్ ఆయన సీబీఐ..

  • Author : Vamsi Chowdary Korata Date : 13-05-2026 - 10:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CBI Shocked by the NEET Paper Leak Scandal
CBI Shocked by the NEET Paper Leak Scandal

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET-UG) 2026 పేపర్ లీకేజీ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. ఈ కుంభకోణం వెనుక భారీ అంతర్రాష్ట్ర నెట్‌వర్క్ ఉన్నట్లు దర్యాప్తులో తేలుతోంది. రాజస్థాన్ నుంచి గురుగ్రామ్, నాసిక్ వరకు దీని మూలాలు విస్తరించి ఉండగా, సీబీఐ విచారణతో కీలక సూత్రధారులు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు.

విచారణ అధికారుల కథనం ప్రకారం రాజస్థాన్‌లోని జమ్వా రామ్‌గఢ్‌కు చెందిన మంగీలాల్, దినేష్ బివాల్ అనే ఇద్దరు సోదరులు ఈ లీకేజీలో కీలకపాత్ర పోషించారు. వీరు పరీక్షకు వారం రోజుల ముందు, ఏప్రిల్ 26న గురుగ్రామ్‌లోని ఓ డాక్టర్ నుంచి రూ.30 లక్షలకు నీట్ ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసినట్లు తేలింది. ఆ తర్వాత సికార్‌లో నీట్ కోసం సిద్ధమవుతున్న తమ కుటుంబంలోని ఓ విద్యార్థికి ఆ పేపర్‌ను ఇచ్చారు.

పేపర్ లీక్ కుంభకోణానికి రాజస్థాన్‌లోని సికార్ కేంద్రంగా మారినట్లు విచారణలో స్పష్టమైంది. సోదరుల నుంచి పేపర్ పొందిన ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ఏజెంట్ రాకేష్ కుమార్ మందవారియా దానిని పలువురికి విక్రయించాడు. తన వద్ద పనిచేసే కేరళలో ఎంబీబీఎస్ చదువుతున్న సికార్ విద్యార్థికి రూ.30,000కు పేపర్‌ను అమ్మేశాడు. ఆ విద్యార్థి పరీక్షకు ఒకరోజు ముందు “నాన్నా, సికార్ నుంచి ఓ స్నేహితుడు పంపాడు. దీన్ని మీ హాస్టల్‌లోని అమ్మాయిలకు ఇవ్వండి. రేపటి పరీక్షలో ఇదే వస్తుంది” అని సందేశం పెట్టి సికార్‌లో పీజీ హాస్టల్ నడుపుతున్న తన తండ్రికి పంపాడు. దీంతో ఆ పేపర్ హాస్టల్‌లోని విద్యార్థులకు చేరింది.

ఈ లీకేజీకి మూలం నాసిక్‌లోని ప్రింటింగ్ ప్రెస్ అని, అక్కడి నుంచి ఓ ‘చైన్ నెట్‌వర్క్’ ద్వారా గురుగ్రామ్ డాక్టర్‌కు చేరినట్లు రాజస్థాన్ పోలీసులు అనుమానిస్తున్నారు. సికార్ నుంచి ఈ పేపర్ జమ్మూకశ్మీర్, బీహార్, కేరళ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చేరినట్లు ఆధారాలు లభించాయి. ఏజెంట్ రాకేష్ కుమార్ సుమారు 700 మంది విద్యార్థులకు పేపర్‌ను పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో మే 3న జరిగిన నీట్ పరీక్షను ప్రభుత్వం రద్దు చేసింది. కేసును సీబీఐకి అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ, పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే రాకేష్ కుమార్ మందవారియా, యశ్ యాదవ్‌తో పాటు నాసిక్‌లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి పరీక్ష తేదీలను 7 నుంచి 10 రోజుల్లో ప్రకటిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తెలిపింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • gurugram
  • Medical Entrance Exams
  • National Testing Agency
  • NEET Exam
  • NEET Exam Paper Leakage
  • NEET Paper Leak
  • NEET Paper Leakage
  • rajasthan
  • The National Testing Agency

Related News

Ban on Telegram app: Delhi High Court's key verdict

Telegram Banned: టెలిగ్రామ్ యాప్‌పై బ్యాన్‌.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

నీట్‌ రీ-ఎగ్జామ్‌కు ముందు టెలిగ్రామ్‌ యాప్‌పై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. పరిస్థితుల దృష్ట్యా కేంద్రం తీసుకున్న చర్య సమంజసమేనని స్పష్టం చేసింది. ఈ అంశంపై శుక్రవారం విచారణ జరిపిన కోర్టు ‘‘అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో తప్పు కనిపించడం లేదు’’ అని పేర్కొంది. సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్‌ 69ఏ ప్

  • Big alert for candidates: NEET 're-exam' date fixed.

    NEET: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. నీట్‌ ‘రీ–ఎగ్జామ్‌’ డేట్ ఫిక్స్

Latest News

  • Kodali Nani: ఏపీ హైకోర్టుకు మాజీ మంత్రి కొడాలి నాని

  • Rain Alert: తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్షసూచన

  • AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

  • Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

  • Stock Market: స్టాక్ మార్కెట్ జోరు..లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd