2000 Notes: 2000 రూపాయల నోటు మార్చుకోవడానికి గుర్తింపు కార్డు అవసరమా లేదా? సుప్రీంకోర్టు తీర్పు ఇదే..!
గుర్తింపు కార్డు చూపకుండా రూ.2000 నోట్ల (2000 Notes)ను మార్చుకోవడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం (జూలై 10) కొట్టివేసింది.
- By Gopichand Published Date - 04:18 PM, Mon - 10 July 23

2000 Notes: గుర్తింపు కార్డు చూపకుండా రూ.2000 నోట్ల (2000 Notes)ను మార్చుకోవడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం (జూలై 10) కొట్టివేసింది. పిటిషనర్ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ మాట్లాడుతూ గుర్తింపు కార్డు చూడకుండా నోట్లను మార్చడం ద్వారా అవినీతిపరులు, దేశ వ్యతిరేకులు లబ్ధి పొందుతున్నారని అన్నారు. ఈ పిటిషన్‌ను తిరస్కరించిన ప్రధాన న్యాయమూర్తి.. రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం విధానపరమైన అంశమని అన్నారు. ఇందులో మేం జోక్యం చేసుకోమని తెలిపింది. అంతకుముందు మే 29న ఢిల్లీ హైకోర్టు కూడా దీన్ని విధానపరమైన అంశంగా పేర్కొంటూ పిటిషన్‌ను తిరస్కరించింది.
పిటిషన్‌లో చేసిన డిమాండ్ ఏమిటి?
అవినీతి, మాఫియా లేదా దేశ వ్యతిరేక శక్తుల వద్ద రూ.3 లక్షల కోట్ల కంటే ఎక్కువ విలువైన రూ.2,000 నోట్లు ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు అశ్విని ఉపాధ్యాయ్ ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గుర్తింపు కార్డును చూడకుండానే నోటు మార్చుకోవడం ద్వారా వ్యతిరేక శక్తులు లబ్ధి పొందుతున్నారన్నారు. ఈ రోజు భారతదేశంలో బ్యాంకు ఖాతా లేని కుటుంబం లేదని పిటిషనర్ పేర్కొన్నారు. కాబట్టి రూ.2000 నోట్లను నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలన్నారు. ఆ వ్యక్తి తన ఖాతాలో మాత్రమే డబ్బు జమ చేస్తున్నాడో లేక మరొకరి ఖాతాలో జమ చేస్తున్నాడో చూడాలని కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు.
Also Read: 3 People Dont Need Passport : పాస్ పోర్ట్ లేకుండా ప్రపంచం చుట్టేసే ఆ ముగ్గురు ?
ఈ పిటిషన్‌ను రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే వ్యతిరేకించింది
రిజర్వ్ బ్యాంక్ కూడా ఈ పిటిషన్‌ను వ్యతిరేకించింది. ఢిల్లీ హైకోర్టులో వాదనల సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది పరాగ్ త్రిపాఠి, ఆర్థిక, ద్రవ్య విధానంలో కోర్టు జోక్యం చేసుకోదని అన్నారు. నోట్లను జారీ చేయడం, ఉపసంహరించుకోవడం రిజర్వ్ బ్యాంక్ హక్కు అని తెలిపారు.