Robert Vadra : పాలిటిక్స్‌లోకి రాబర్ట్ వాద్రా.. గ్రౌండ్ రెడీ ?
పై వ్యాఖ్యలను బట్టి రాజకీయాలపై రాబర్ట్ వాద్రా(Robert Vadra)కు చాలా ఆసక్తి ఉందని స్పష్టమవుతోంది.
- By Pasha Published Date - 05:00 PM, Wed - 16 April 25

Robert Vadra : ఇప్పటికే కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఆమె లోక్‌సభ ఎంపీ. తదుపరిగా ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారు. గత రెండు రోజులుగా రాబర్ట్ వాద్రా చెబుతున్నదీ అదే. గాంధీ కుటుంబంలో ఉన్నందున తాను రాజకీయాల్లోకి వచ్చినట్టేనని.. త్వరలోనే పాలిటిక్స్‌లోకి వస్తానని రాబర్ట్ వాద్రా ప్రకటించారు.
Also Read :Justice BR Gavai: తదుపరి సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్.. నేపథ్యమిదీ
ఇవాళ రాబర్ట్ వాద్రా ఏమన్నారంటే..
తాజాగా ఇవాళ(బుధవారం) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను ఇప్పటికే సామాజిక కార్యకర్తను. 1999 సంవత్సరం నుంచే ప్రజలతో కలిసి పనిచేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో చేశాను. ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నాను. ప్రజల గొంతుకగా వ్యవహరిస్తున్నాను. ప్రజలు నన్ను రాజకీయాల్లో చూడాలని భావిస్తున్నారు. త్వరలోనే రాజకీయాల్లోకి తప్పకుండా ప్రవేశిస్తాను’’ అని వెల్లడించారు. హర్యానాలోని గురుగ్రామ్ ల్యాండ్ డీల్ కేసులో తనను రెండు రోజులుగా ఈడీ విచారిస్తుండటంపై స్పందిస్తూ వాద్రా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవాళ(బుధవారం) ఉదయం 11 గంటలకు సతీమణి ప్రియాంకాగాంధీతో కలిసి దిల్లీలోని ఈడీ కార్యాలయానికి వాద్రా వెళ్లారు. మధ్యాహ్నం 1.10 గంటలకు ఆయనను లంచ్ కోసం ఈడీ అధికారులు వదిలారు. భోజనం చేసి వాద్రా తిరిగొచ్చాక మళ్లీ విచారణ మొదలైంది.
Also Read :Dogs Crematorium : ఇక కుక్కలు, పిల్లులకూ శ్మశానవాటిక.. సర్వీసుల వివరాలివీ
రాబర్ట్ వాద్రా గ్రౌండ్ వర్క్ ఇలా ..
పై వ్యాఖ్యలను బట్టి రాజకీయాలపై రాబర్ట్ వాద్రా(Robert Vadra)కు చాలా ఆసక్తి ఉందని స్పష్టమవుతోంది. ప్రజాప్రతినిధిగా మారాలని ఆయన వేచిచూస్తున్నారు. ఈక్రమంలోనే ఏ అవకాశం వచ్చినా అంది పుచ్చుకునేందుకు వాద్రా రెడీ అవుతున్నారు. ఉత్తరప్రదేశ్ లేదా హర్యానా నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టే అవకాశం ఉంది. తన రాజకీయ ప్రవేశం కోసం గత కొన్నేళ్లుగా రాబర్ట్ వాద్రా గ్రౌండ్‌ను ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఆయన స్పిరిచ్యువల్ టూర్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లోని ప్రముఖ దర్గాలు, మందిరాలు, గురుద్వారాలను రాబర్ట్ వాద్రా సందర్శిస్తున్నారు. ఆయా కార్యక్రమాల ద్వారా కాంగ్రెస్ పార్టీ నేతలతో నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్‌లోకి ప్రవేశించాక.. ఈ నెట్‌వర్క్‌తో జాతీయ స్థాయి రాజకీయాల్లోనూ చక్రం తిప్పాలనే దీర్ఘకాలిక వ్యూహంతో వాద్రా ఉన్నారు.
ప్రియాంకాగాంధీకి పెరగనున్న పట్టు
ఒకవేళ రాబర్ట్ వాద్రా కూడా కాంగ్రెస్‌లోకి వస్తే.. హస్తం పార్టీపై ప్రియాంకాగాంధీకి పట్టు మరింత పెరిగేే అవకాశం ఉంటుంది. పరోక్షంగా రాబర్ట్ వాద్రా కోరుకుంటున్నది కూడా అదే. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీలో ప్రియాంకకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇటీవలే గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఏఐసీసీ సమావేశాల్లో దీనిపై సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారట. అయితే ప్రియాంకకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనే దానిపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం చేయడంలో ప్రియాంక కీలకంగా వ్యవహరిస్తారని అంటున్నారు.