HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Off Beat
  • >Crematorium For Dogs And Cats Available In Gujarats Ahmedabad City

Dogs Crematorium : ఇక కుక్కలు, పిల్లులకూ శ్మశానవాటిక.. సర్వీసుల వివరాలివీ

గుజరాత్‌లోని అహ్మదాబాద్(Dogs Crematorium) నగరం దానిలిమ్డా ప్రాంతంలో ఉన్న కరుణా మందిర్‌లో పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక శ్మశాన వాటికను నిర్మిస్తున్నారు.

  • By Pasha Published Date - 02:24 PM, Wed - 16 April 25
  • daily-hunt
Dogs Crematorium Cats Crematorium Ahmedabad City Gujarat Dogs Last Rites Cng Furnace

Dogs Crematorium : కుక్కల కోసం శ్మశానవాటిక.. ఔను మీరు చదివింది నిజమే.  డాగ్స్ కోసం, క్యాట్స్ కోసం శ్మశాన వాటిక రెడీ అవుతోంది. ఎక్కడో తెలుసా ? గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో. దీన్ని ఏదో స్వచ్ఛంద సంస్థ నిర్మించడం లేదు. స్వయంగా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ కుక్కల శ్మశాన వాటికను నిర్మిస్తోంది. ఇందుకోసం దాదాపు రూ.30 లక్షల దాకా ఖర్చు పెడుతోంది.

Also Read :Aurangzebs Tomb: ఔరంగజేబ్ సమాధిపై ఐరాసకు మొఘల్ వారసుడి లేఖ.. ఎవరతడు ?

కుక్కలు, పిల్లుల శ్మశాన వాటిక వివరాలివీ.. 

  • గుజరాత్‌లోని అహ్మదాబాద్(Dogs Crematorium) నగరం దానిలిమ్డా ప్రాంతంలో ఉన్న కరుణా మందిర్‌లో పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక శ్మశాన వాటికను నిర్మిస్తున్నారు.
  • కుక్కల కళేబరాలను దహనం చేసి బూడిదగా మార్చడానికి అధునాతన సీఎన్‌జీ ఫర్నేస్‌ వ్యవస్థను ఇందులో ఏర్పాటు చేస్తున్నారు.
  • ఇక్కడి ఫర్నేస్‌లో ఒకేసారి రెండు కుక్కలను దహనం చేయొచ్చు.
  • ఇకపై అహ్మదాబాద్ నగరం పరిధిలో చనిపోయే పెంపుడు కుక్కలు, పిల్లులను ఈ శ్మశాన వాటికలోనే దహనం చేస్తారు.
  • ఈ సిటీ పరిధిలో పెంపుడు కుక్కలు, పిల్లులు కలిగిన వాళ్లంతా ఈ సేవను వాడుకోవచ్చు.
  • సీఎన్‌జీ ఫర్నేస్ ద్వారా పర్యావరణహితమైన పరిస్థితుల్లో చనిపోయిన శునకాలు, పిల్లులను దహనం చేస్తారు.
  • తాము ఎంతో ప్రేమగా పెంచుకునే పెంపుడు జంతువులకు గౌరవపూర్వక అంత్యక్రియ జరగాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటారు. అందుకే ఈ శ్మశాన వాటికను ఏర్పాటు చేస్తున్నామని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికార వర్గాలు చెబుతున్నాయి.
  • ఈ శ్మశాన వాటిక సర్వీసులను వాడుకోవాలని భావించే.. పెంపుడు జంతువుల యజమానులంతా మున్సిపల్ కార్పొరేషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  • అహ్మదాబాద్ నగరం పరిధిలో దాదాపు 60,000 పెంపుడు కుక్కలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు 6వేల పెంపుడు కుక్కల యజమానులు మాత్రమే మున్సిపల్ కార్పొరేషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
  • నగరంలో వేలాది పెంపుడు పిల్లులు కూడా ఉన్నాయి. వాటి యజమానులు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంది.
  • రానున్న రోజుల్లో వారంతా రిజిస్ట్రేషన్ కోసం మున్సిపల్ కార్పొరేషన్ వద్దకు క్యూ కట్టే ఛాన్స్ ఉంది.
  • ఈ రిజిస్ట్రేషన్ కోసం కొంత ఛార్జీని అధికారులు వసూలు చేయనున్నారు. ఫలితంగా మున్సిపల్ కార్పొరేషన్‌కు కొత్త ఆదాయ మార్గం తెరుచుకుంటుంది.
  • ఇక అహ్మదాబాద్‌లో చనిపోయే కుక్కలు, పిల్లులను శ్మశాన వాటికకు తీసుకెళ్లడానికి ప్రత్యేక వాహన సర్వీసును కూడా తీసుకురానున్నారు. ఇందుకోసం ఆయా పెంపుడు జంతువుల పోషకులు కొంత మొత్తాన్ని మున్సిపల్ కార్పొరేషన్‌కు చెల్లిస్తే సరిపోతుంది.

Also Read :ATMs In Trains: రైళ్లలోనూ ఏటీఎంలు.. రైల్వేశాఖ ట్రయల్ సక్సెస్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ahmedabad
  • Ahmedabad City
  • Cats Crematorium
  • CNG Furnace
  • Dogs Crematorium
  • Dogs Last Rites
  • gujarat

Related News

    Latest News

    • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

    • PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

    • Khairatabad Ganesh : గంగమ్మ ఒడికి బయలుదేరిన ఖైరతాబాద్ మహాగణపతి

    • Trade War : భారత్‌పై అమెరికా వాణిజ్య కార్యదర్శి తీవ్ర వ్యాఖ్యలు

    • Operation Sindoor : యుద్ధం మూడురోజుల్లోనే ముగిసిందని అనుకోవడం తప్పు : ఆర్మీ చీఫ్‌ ద్వివేదీ

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd