HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Real Dogs Sitting In Parliament Renuka Chaudhary

Renuka Chaudhary: కాంగ్రెస్ ఎంపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. నిజ‌మైన కుక్కలు పార్ల‌మెంట్‌లో ఉన్నాయంటూ!

మరోవైపు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, ముఖ్యంగా లోక్‌సభలో దేశవ్యాప్తంగా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు పదేపదే నినాదాలు, నిరసనలు చేపట్టారు.

  • Author : Gopichand Date : 01-12-2025 - 4:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Renuka Chaudhary
Renuka Chaudhary

Renuka Chaudhary: కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి (Renuka Chaudhary) సోమవారం పార్లమెంటు ఆవరణలోకి ఒక కుక్కపిల్లను తీసుకురావడంపై తీవ్ర చర్చ జరిగింది. ఇతర ఎంపీల అభ్యంతరాలను ఆమె తోసిపుచ్చారు. “నిజమైన కుక్కలు పార్లమెంట్‌లో కూర్చుని, ప్రతిరోజూ ప్రజలను కరుస్తున్నాయి” అని ఆమె వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది.

కుక్కపిల్లను తీసుకొచ్చిన కారణం

తాను పార్లమెంట్‌కు వస్తున్న మార్గంలో ఆ కుక్కపిల్లను రక్షించానని రేణుకా చౌదరి వివరించారు. దారిలో స్కూటర్-కారు ఢీకొన్న ఘటనను చూశానని, ఆ సమయంలో ఆ కుక్కపిల్ల రోడ్డుపై తిరుగుతోందని చెప్పారు. దానికి ప్రమాదం జరగకుండా చూసేందుకు దాన్ని తన కారులో తీసుకువచ్చానని, అది తన వాహనంలోనే ఉండి, ఆమె దిగిన కొద్దిసేపటికే తిరిగి వెళ్లిపోయిందని తెలిపారు.

“దీని గురించి ఏదైనా చట్టం ఉందా? నేను వస్తున్న దారిలో స్కూటర్, కారు ఢీకొన్నాయి. ఈ చిన్న కుక్కపిల్ల రోడ్డుపై తిరుగుతోంది. దానికి చక్రం తగులుతుందేమోనని అనుకున్నాను. అందుకే దాన్ని తీసుకుని కారులో పెట్టుకుని, పార్లమెంట్‌కు వచ్చి తిరిగి పంపించేశాను. కారు వెళ్లిపోయింది. కుక్క కూడా వెళ్లిపోయింది. మరి ఈ చర్చ దేనికి?” అని రేణుకా చౌదరి ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు.

Also Read: Wedding : పెళ్లి వేదికపై వరుడికి షాక్ ఇచ్చిన పెళ్లి కూతురు

పాలకపక్షంపై విమర్శలు

NDA ఎంపీల పేరు చెప్పకుండా రేణుకా చౌదరి పాలక పక్షంపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. “నిజంగా కరిచేవాళ్లు పార్లమెంట్‌లో కూర్చుని ఉన్నారు” దాని గురించి ఎలాంటి చర్చ జరగడం లేదని ఆమె అన్నారు. “నిజంగా కరిచేవాళ్లు పార్లమెంట్‌లో కూర్చుని ఉన్నారు. వాళ్లే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మూగ జంతువును మేం చూసుకుంటే ఇదే పెద్ద సమస్యగా, చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వానికి చేయడానికి వేరే పనే లేదా? నేను ఆ కుక్కను ఇంటికి పంపించి, అక్కడే ఉంచమని చెప్పాను. ప్రతిరోజూ పార్లమెంట్‌లో కూర్చుని మమ్మల్ని కరిచే వాళ్ల గురించి మేం మాట్లాడడం లేదు” అని ఆమె ఘాటుగా స్పందించారు.

మరోవైపు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, ముఖ్యంగా లోక్‌సభలో దేశవ్యాప్తంగా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు పదేపదే నినాదాలు, నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతిపక్షం సభలో “ఓట్ చోర్, గద్దీ చోడ్” (ఓటు దొంగ, గద్దె దిగు) అనే నినాదాలు లేవనెత్తింది. దీంతో స్పీకర్ స్థానంలో ఉన్న ఎంపీ సంధ్యా రాయ్ సభను వాయిదా వేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Congress MP
  • Hot Comments
  • national news
  • parliament
  • pm modi
  • Renuka Chaudhary

Related News

Indus Water

పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చిన భార‌త్‌!

పహల్గామ్ దాడి తర్వాత స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్‌ను హెచ్చరిస్తూ.. "నీరు, రక్తం పక్కపక్కనే ప్రవహించలేవు" అని స్పష్టం చేశారు. దుల్హస్తీ స్టేజ్-2 ప్రాజెక్ట్ ద్వారా సుమారు 260 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

  • Narasapuram Lace

    నరసాపురం లేసుల కళా వైభవం.. చంద్రబాబు విజన్, మోదీ ప్రశంసల జల్లు!

  • Mann Ki Baat

    మన్ కీ బాత్ 129వ ఎపిసోడ్.. 2025లో విజయాలు, భారత్ గర్వించదగ్గ క్షణాలీవే!

  • Fake Voters

    ముందు గుర్తింపు.. తర్వాతే ఓటు.. రాజస్థాన్ ఎన్నికల కమిషన్ కొత్త నిబంధన!

  • PM Modi

    లక్నోలో ‘రాష్ట్ర ప్రేరణా స్థల్’ను ప్రారంభించిన ప్రధాని మోదీ!

Latest News

  • కొత్త ఏడాదిలో కేంద్రం బిగ్ షాక్.. భారీగా పెరగనున్న సిగరెట్లు, బీడీ, పాన్ మసాలా ధరలు..

  • అరుదైన రికార్డ్ సాధించిన కాణిపాకం దేవస్థానం.. ఆలయానికి ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌

  • కరెంట్ ఛార్జీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

  • కిరాయి ఉంటున్న ఇంట్లో గంజాయి మొక్కపెంపకం

  • కొత్త సినిమాకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్, డైరెక్టర్ ఎవరంటే !!

Trending News

    • జనవరి 1న బ్యాంకుల పరిస్థితి ఏంటి?

    • 2026కు స్వాగతం ప‌లికిన న్యూజిలాండ్‌.. న్యూ ఇయ‌ర్‌కు తొలుత స్వాగ‌తం ప‌లికిన దేశం ఇదే!

    • నూతన సంవత్సరం ఇలాంటి గిఫ్ట్‌లు ఇస్తే మంచిద‌ట‌!

    • జ‌న‌వ‌రి నుండి జీతాలు భారీగా పెర‌గ‌నున్నాయా?!

    • ఈరోజు మద్యం సేవించి వాహనం నడిపితే జరిగితే ఈ శిక్ష‌లు త‌ప్ప‌వు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd