HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Rcb Victory Parade Bengaluru 2024

DK Shivakumar : ఆర్సీబీ గెలుపు కర్ణాటక ప్రజల గర్వాన్ని పెంచింది

DK Shivakumar : 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికిస్తూ ఐపీఎల్ ట్రోఫీని ఎట్టకేలకు రాయల ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కైవసం చేసుకున్న నేపథ్యంలో, బెంగళూరు నగరం సంబరాల జోరులో మునిగిపోయింది.

  • Author : Kavya Krishna Date : 04-06-2025 - 2:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dk Shivakumar
Dk Shivakumar

DK Shivakumar : 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికిస్తూ ఐపీఎల్ ట్రోఫీని ఎట్టకేలకు రాయల ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కైవసం చేసుకున్న నేపథ్యంలో, బెంగళూరు నగరం సంబరాల జోరులో మునిగిపోయింది. విజయోత్సవ ర్యాలీ కోసం అభిమానులు తీవ్రంగా ఎదురుచూస్తున్న వేళ.. RCB జట్టు గెలుపు వేడుకలు, విజయర్యాలీపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ బుధవారం స్పష్టం చేశారు.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌పై సంచలన విజయం సాధించిన అనంతరం, విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జట్టు బుధవారం బెంగళూరుకు చేరుకుంటోంది.

ఇవాళ జరగనున్న విజయర్యాలీకి సంబంధించి ఇప్పటికే జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకుందని సమాచారం. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య, విధానసౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ర్యాలీ జరగనుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

విజయం అనంతరం దేశవ్యాప్తంగా అభిమానం ఉరకలెత్తింది. ఇప్పుడు దృష్టి మొత్తం బెంగళూరుపై పడింది. వేలాది మంది అభిమానులు తమ అభిమాన జట్టుకు గ్రాండ్ వెల్‌కమ్ ఇవ్వేందుకు సిద్ధమవుతున్నారు.

విజయోత్సవాల్లో క్రికెట్ దిగ్గజాలు ఏబీ డివిల్లియర్స్, క్రిస్ గేల్ కూడా పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో RCB జట్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. “RCB మన గర్వకారణం. వారి గెలుపు కర్ణాటక ప్రజల గర్వాన్ని పెంచింది. మ్యాచ్‌లో ప్రతి క్షణాన్ని నేను చూశాను. ప్రభుత్వ తరపున, ప్రజల తరపున వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. తగిన విధంగా వారికి గౌరవ వందనం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో పోలీస్ అధికారులతో పాటు మేము చర్చలు జరుపుతున్నాం” అని పేర్కొన్నారు.

“ఇంకా ర్యాలీకి సంబంధించిన సమయాన్ని, ప్రదేశాన్ని, ఏర్పాట్లను తుది నిర్ణయంగా తీసుకోలేదు. హోం మంత్రి, బెంగళూరు పోలీస్ కమిషనర్‌తో చర్చించాలి. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలి. అలాగే ఆటగాళ్లకు కూడా గౌరవం దక్కాలి” అని ఆయన స్పష్టం చేశారు.

Damodara Raja Narasimha : ఫుడ్ పాయిజన్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AB De Villiers
  • bengaluru
  • Chinnaswamy Stadium
  • Chris Gayle
  • DK Shivakumar
  • ipl 2024
  • IPL celebrations
  • karnataka government
  • rcb
  • RCB Victory Parade
  • Vidhana Soudha
  • virat kohli

Related News

Chinnaswamy Stadium

చిన్నస్వామి స్టేడియంలో దొంగల బీభత్సం!

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.

  • Actor Prakash Raj attends ED interrogation

    Prakash Raj : ప్రకాశ్ రాజ్ ఇంట విషాదఛాయలు

  • Srh Target

    IPL 2026 : RCB కి 202 టార్గెట్ పెట్టిన SRH

  • Csk Dhoni

    IPL 2026 : CSK కి బిగ్ షాక్..గాయంతో ధోని దూరం

  • Vijay Mallya Critics Who Laughed at His RCB Investment

    Vijay Mallya: నాడు పెట్టిన పెట్టుబడికి నన్ను చూసి చాలా మంది నవ్వుకున్నారు: విజ‌య్ మాల్యా

Latest News

  • ఐపీఎల్ 2026.. చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజ‌యం!!

  • సూర్యవంశీ శివతాండవం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!!

  • పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

  • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

  • రైతుల‌కు శుభ‌వార్త చెప్పిన కేంద్రం!

Trending News

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd