Congress MP : అత్యాచారం కేసు..కాంగ్రెస్ ఎంపీ అరెస్టు
తనతో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్‌ను సైతం పోలీసులకు సమర్పించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన నివాసం వద్దకు భారీ బందోబస్తుతో వెళ్లిన పోలీసులు అరెస్టు చేశారు.
- Author : Latha Suma
Date : 30-01-2025 - 4:22 IST
Published By : Hashtagu Telugu Desk
Congress MP : యూపీ పోలీసులు కాంగ్రెస్ నేత సీతాపుర్ ఎంపీ రాకేశ్ రాథోడ్‌ను అరెస్టు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాలుగేళ్లుగా తనపై లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపిస్తూ ఓ మహిళ జనవరి 17న పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్‌ను సైతం పోలీసులకు సమర్పించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన నివాసం వద్దకు భారీ బందోబస్తుతో వెళ్లిన పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఎంపీ సీతాపుర్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతుండగానే ఆయన్ను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. భారీ పోలీసు భద్రత నడుమ ఆయన్ను కోర్టుకు తీసుకెళ్లారు.
కేసు నమోదైన అనంతరం రాకేశ్ రాథోడ్ ముందస్తు బెయిల్ కోసం అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది. అంతకుముందు సీతాపూర్ లోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో కూడా రాకేశ్ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. అక్కడ కూడా ఆయనకు నిరాశే ఎదురైంది. దీంతో అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు రాకేశ్ రాథోడ్ గురువారం ఉదయం పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ క్రమంలోనే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. కాగా, రాకేశ్ రాథోడ్ గత లోక్‌సభ ఎన్నికల్లో సీతాపూర్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు.
ఇంకా, బాధితురాలికి సంబంధించిన విషయాలు ఆమె భర్త ఇచ్చిన మరో ఫిర్యాదు కూడా కీలకంగా మారింది. ఆమె భర్త చెప్పినట్లుగా ఎంపీ మరియు ఆయన కుమారుడు కేసును వాపస్ తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ఇది పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో గమనించారు. ఇది మరింత వాదనలు సృష్టించే అంశంగా మారింది.
Read Also:Super Six : చంద్రబాబు సర్కార్‌పై పెద్దిరెడ్డి ఫైర్