Earthquake: రాజస్థాన్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 4.2 తీవ్రత నమోదు
గత కొన్ని రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో భూకంప ప్రకంపనలు వస్తూనే ఉన్నాయి. రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఆదివారం ఉదయం భూకంపం (Earthquake) సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం.. ఆదివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ప్రకంపనలు సంభవించాయి.
- Author : Gopichand
Date : 26-03-2023 - 9:02 IST
Published By : Hashtagu Telugu Desk
గత కొన్ని రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో భూకంప ప్రకంపనలు వస్తూనే ఉన్నాయి. రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఆదివారం ఉదయం భూకంపం (Earthquake) సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం.. ఆదివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైంది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ధృవీకరించలేదు. అంతకుముందు అరుణాచల్ ప్రదేశ్‌లోని చాంగ్లాంగ్‌లో ఆదివారం కూడా భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్) ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 2.18 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదైంది.
Also Read: Pulivendula: వై నాట్ పులివెందుల సెగ
మంగళవారం కూడా భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో భూకంపం బలమైన ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.6గా నమోదైంది. మంగళవారం రాత్రి సంభవించిన ఈ భూకంపం ప్రభావం ఢిల్లీ-ఎన్‌సీఆర్, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్, పంజాబ్, మధ్యప్రదే, ఉత్తరాఖండ్‌తో సహా మొత్తం ఉత్తర భారతదేశంలో కనిపించింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ ప్రాంతం భూకంప కేంద్రం. ఈ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. అయితే ఇప్పటి వరకు దేశం నుంచి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.